E-Paper
Advertisement

ముఖేష్ – త్రిగుణ్ మీ పంతం వీడరా?

ముఖేష్ – త్రిగుణ్ మీ పంతం వీడరా?
Advertisement

Bigg Boss 10:తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ (Bigg Boss) రియాలిటీ షో గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రస్తుతం తెలుగులో 10వ సీజన్ నడుస్తోంది. ఇప్పటికే 8 వారాల పూర్తికాగా.. 9వ వారంలో అప్పుడే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. మొత్తం 10 మంది ఈ వారం నామినేషన్ లోకి వచ్చారు. ఇదిలా ఉండగా మరోవైపు 59వ రోజుకు సంబంధించి మొదటి ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. అందులో రివార్డ్ అండ్ రివేంజ్ ఛాలెంజ్ లో భాగంగా ఫ్యామిలీని కలుసుకునే అవకాశం పొందాలి అంటే టాస్కులో నెగ్గాలి అంటూ ఒక టాస్క్ నిర్వహించారు బిగ్ బాస్.

ముఖేష్ , త్రిగుణ్ లను సంచాలకు గా పెట్టిన బిగ్ బాస్..

హౌస్ సభ్యులను 2 టీమ్ లుగా విడగొట్టారు. అందులో త్రిగుణ్, ముఖేష్ సంచాలకులుగా వ్యవహరిస్తారు అంటూ బిగ్ బాస్ చెప్పారు. అసలే ఉప్పు నిప్పు గా వున్న వీరిద్దరిని ఇప్పుడు బిగ్ బాస్ సంచాలకులుగా వ్యహరించమని చెబితే మొదట హౌస్ మేట్సే షాక్ అయ్యారు. తర్వాత టాస్క్ ప్రారంభించారు. ఇక అమన్ టీం గెలిచింది. ఇందులో సంచాలక్ గా ఉన్న త్రిగుణ్ వీరి ఆటను తప్పు బట్టే ప్రయత్నం చేస్తూ ఆ గేమ్ ను వివరించేటప్పుడు, శివ ,రాంప్రసాద్ ఇద్దరూ కలగజేసుకున్నారు. కానీ త్రిగుణ్ వీళ్ళిద్దరిని పక్కకు నెట్టేశాడు. ఇక వాదన ముగిసిన తర్వాత సంచాలక్ గా వ్యవహరించిన ముఖేష్ మాట్లాడుతూ.. టీం ఏ , రైన్బో టీం గెలిచింది బిగ్ బాస్ అంటూ చెప్పాడు.

Advertisement

ALSO READ:అందరినీ నవ్వించే రాంప్రసాద్ జీవితంలో ఇంతటి విషాదమా?

ఈ ఇద్దరి వల్ల వాళ్లు బలవుతున్నారా..

ఇక మరో సంచాలక్ గా వ్యవహరించిన త్రిగుణ్ మాట్లాడుతూ.. ఇంకో సంచాలక్ తో మాట్లాడితే ఆయన నా నా పాయింట్స్ ని పెట్టనివ్వలేదు బిగ్ బాస్ అంటూ చెప్పాడు త్రిగుణ్. ఆ తర్వాత ఇద్దరూ కూడా తమ పాయింట్స్ ని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే బిగ్ బాస్ వీరి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ను గమనించి ఈ విధంగా మాట్లాడారు. “ఇద్దరు సంచాలకులు ఒక నిర్ణయానికి రాలేకపోతే పర్యావసనాలు రెండు టీమ్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది .రివార్డు ఎవరికి లభించదు” అంటూ గట్టి జలక్కిచ్చారు మొత్తానికైతే వీరిద్దరూ హౌస్లో ఉప్పు నిప్పుగా ఉన్నారు. ఇలాంటిది వీళ్లిద్దరినే సంచాలకుగా పెట్టి బిగ్బాస్ తీసుకున్న నిర్ణయం ఆటపై మరింత ఆసక్తిని కలిగించింది. మరి వీరిద్దరూ ఒకే నిర్ణయానికి వచ్చి రివార్డును కష్టపడిన టీం కి అందిస్తారా? లేక పంతం వీడకుండా రివేంజ్ ఇబ్బందులను ఎదుర్కొంటారా ?అన్నది చూడాలి.

Advertisement

Related News

అందరినీ నవ్వించే రాంప్రసాద్ జీవితంలో ఇంతటి విషాదమా?

నా భార్య అందుకే నన్ను వదిలేసింది. సుధీర్ ఎమోషనల్!

తెలుగు సీరియల్స్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఆ మూడు అవుట్..

కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టిన వంటలక్క.. కొత్త హీరోయిన్ ఎంట్రీ..?

సీరియల్స్ కు మరో హీరోయిన్ గుడ్ బై.. అస్సలు ఊహించని ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: పల్లవి కోసం కన్నీళ్లు.. పల్లవి మాటతో షాక్.. ఫైనల్ ట్విస్ట్ ఇదే..

Karthika Deepam 2 Serial Today Episode November 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి వార్నింగ్ ఇచ్చిన కార్తీక్, దీప   

Big Stories

Advertisement
×