E-Paper
Advertisement

నల్లగా ఉన్నావంటూ అవమానించారు.. ట్రోల్స్ పై ఘాటుగా స్పందించిన కామాక్షి!

నల్లగా ఉన్నావంటూ అవమానించారు.. ట్రోల్స్ పై ఘాటుగా స్పందించిన కామాక్షి!
Advertisement

Kissik Talks:సమాజంలో మహిళలైనా పురుషులైన బాడీ షేమింగ్ తో పాటు కలర్ షేమింగ్ పై కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సామాన్య ప్రజల గురించి కాస్త పక్కన పెడితే.. సెలబ్రిటీలు పబ్లిక్ కాబట్టి వారికి సంబంధించిన ఏ విషయమైనా సరే ఇట్టే క్షణాలలో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీలు కాస్త బొద్దుగా ఉన్నా లేదా బక్క చిక్కిపోయినా.. నల్లగా ఉన్నా సరే వారిని విమర్శలకు గురి చేస్తూ మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తాను కూడా ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ముఖ్యంగా తన కలర్ పై ఎన్నో విమర్శలు వచ్చాయని, చిన్నప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఇలాంటి అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది యంగ్ బ్యూటీ కామాక్షి భాస్కర్ల.

బాడీ షేమింగ్ , కలర్ షేమింగ్ పై కామాక్షి కామెంట్..

ఎమ్మెస్ రాజు (MS Raju) దర్శకత్వంలో కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla)లీడ్ రోల్ పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అగధ. ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ లో పాల్గొన్న కామాక్షి భాస్కర్లతో హోస్ట్ వర్షా మాట్లాడుతూ.. మిమ్మల్ని ఎవరైనా కామెంట్ చేసిన సిచువేషన్స్ ఏదైనా ఉందా అని ప్రశ్నించగా.. వస్తూనే ఉన్నాయి. చిన్నప్పటి నుంచి నా కలర్ పైన, హైట్ పైన, బరువు పైన ఎన్నో కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఆ కలర్ బాడీ షేమింగ్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఇప్పటికీ అక్కడక్కడ నన్ను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి అంటూ కాస్త ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది కామాక్షి.

కుస్తీ ఫైటర్ లా ఉంటాను..

Advertisement

ఒకప్పుడు నేను చాలా లావుగా ఉండేదాన్ని. పైగా బ్లాక్ కలర్.. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు తలకు నూనె రాసి గట్టిగా జడ వేసేది. ఒకరకంగా చెప్పాలి అంటే చూడడానికి నేను కుస్తీ ఫైటర్ లా ఉండేదాన్ని అంటూ తెలిపింది.

also read:చిన్నారుల్లో వ్యాధులు.. ఒక్కో ఇంజక్షన్ రూ.12 కోట్ల వెనుక అసలు నిజం!

దేవుడి కంటే మనుషులనే ఎక్కువగా నమ్ముతాను..

Advertisement

దేవుడిని ఎక్కువగా కోరుకునే కోరిక ఏమిటి? అని వర్షా అడగగా.. నేను దేవుడిని ఏ కోరిక కోరను. దేవుడు అనే పదం అందరూ వాడుతారు. కానీ మీరు గమనిస్తే ప్రతి ఒక్కరికి, దేవుడికి ఉన్న డెఫినేషన్ వేరు. నేను దేవుడిని నమ్మను. ఒకవేళ నమ్మినా.. దేవుడు కంటే ఎక్కువగా మనుషుల్ని నమ్ముతాను. అందుకే నేను దేవాలయాలకు కూడా వెళ్ళను. అంటూ చెప్పుకొచ్చింది కామాక్షి భాస్కర్ల.

కామాక్షి కెరియర్..

చైనాలో ఎంబిబిఎస్ పూర్తి చేసిన కామాక్షి భాస్కర్ల అపోలో హాస్పిటల్లో కొంతకాలం డాక్టర్ గా పనిచేసింది. ఆ తర్వాత మోడల్ రంగంలోకి అడుగుపెట్టిన ఈమె..2018లో మిస్ తెలంగాణగా ఎంపికయింది. అలాగే 2018 మిస్ ఇండియా పోటీలలో పాల్గొని ఫైనల్స్ వరకు చేరుకుంది. తొలిసారి ప్రియురాలు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె.. మా ఊరి పొలిమేర సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Related News

ఈ గుర్తింపు బిగ్ బాస్ పెట్టిన భిక్ష.. రోహిత్ తీరుపై కౌశల్ మండిపాటు!

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

Big Stories

Advertisement
×