Karthika Deepam 2: బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కార్తీకదీపం సీరియల్ ద్వారా కార్తీక్, దీప, మోనిత పాత్రలు తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాయి. ఈ సీరియల్ పూర్తి కావడంతో ఈ సీరియల్ కొనసాగింపు వస్తే బాగుంటుందని అభిమానులు భావించారు అందుకు అనుగుణంగానే ప్రస్తుతం కార్తీకదీపం 2(Karthika Deepam 2) ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సీరియల్ లో యధావిధిగా కార్తీక్ పాత్రలో పరిటాల నిరుపమ్ నటిస్తున్నారు. దీపా పాత్రలో ప్రేమి విశ్వనాధ్ నటిస్తున్నారు.
ఇక కార్తీకదీపం 2 సీరియల్లో మోనితా పాత్రకు బదులుగా జోత్స్న పాత్రను(jyotsna Role) ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ పాత్రలో నటి గాయత్రి సింహాద్రి(Gayatri Simhadri) నటించి సందడి చేస్తున్నారు అయితే ఈమె మొదట్లో విలన్ పాత్రలో కనిపించినప్పటికీ ఇటీవల కాలంలో జోత్స్న పాత్రను చాలా పాజిటివ్ గా తీర్చిదిద్దారు అయితే ఈ సీరియల్ లో ప్రస్తుతం మాలిని పాత్ర విలన్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని ఎపిసోడ్ల నుంచి జోత్స్న పాత్ర ఈ సీరియల్ లో కనిపించకపోవడంతో ఈ సీరియల్ నుంచి ఈమె తప్పుకున్నారా? అసలు ఎందుకు సీరియల్ లో కనిపించడం లేదు? అంటూ ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
కార్తీకదీపం 2 సీరియల్లో జోత్స్న పాత్ర కనిపించక పోవడానికి కారణం ఆమెకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉండటం వల్లే ఈ సీరియల్ కు కాస్త విరామం ఇచ్చారని తెలుస్తోంది. ఇలా కొంత విరామం తర్వాత తిరిగి జోత్స్న యధావిధిగా ఈ సీరియల్లో కనిపించబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సీరియల్ నుంచి ఈమె తప్పుకోవడానికి మరో కారణం కూడా ఉందని వార్తలు బయటకు వచ్చాయి. జోత్స్న మిస్సింగ్ వెనుక మాలిని హస్తం ఉందా? అనే కోణంలో ప్రస్తుతం సీరియల్ ట్రాక్ నడుస్తోంది. ఇందువల్లే గత కొన్ని ఎపిసోడ్లుగా ఆమె స్క్రీన్ పై కనిపించడం లేదని తెలుస్తోంది. మరి ఈమె తప్పుకోవడానికి గల కారణం ఏంటనేది తెలియాలి అంటే గాయత్రి సింహాద్రి స్పందించాల్సి ఉంటుంది.
ఈ విధంగా గాయత్రి సింహాద్రి జోత్స్న పాత్రలో కార్తీకదీపం 2 సీరియల్ లో ప్రేక్షకులను సందడి చేయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన ఎన్నో ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తున్నారు. మరి ఈ సీరియల్లో జోత్స్న పాత్ర రీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఈమె కనిపించకపోవడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు నువ్వు కనిపించకపోవడంతో బెంగగా ఉందంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
Also Read: వేలల్లో సబ్స్క్రైబర్స్..లక్షల్లో సంపాదన.. విష్ణు ప్రియ నెల సంపాదన తెలిస్తే మతి పోవాల్సిందే!