Vishnu Priya: విష్ణు ప్రియ భీమినేని పరిచయం అవసరం లేని పేరు పటాస్ వంటి కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈమె బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించారు. ఇలా బుల్లితెర యాంకర్ గా అందరికీ ఎంతో సుపరిచితమైన విష్ణు ప్రియ(Vishnu Priya) ఇటీవల కాలంలో స్పెషల్ సాంగ్స్ ద్వారా సందడి చేస్తున్నారు. అదేవిధంగా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉంటున్న విష్ణు ప్రియ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.
ఇలా సోషల్ మీడియా వేదికగా ఈమె తనకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ఇంస్టాగ్రామ్ పెయిడ్ సబ్స్క్రిప్షన్(instagram Paid subscriptions) ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలు అదనపు ఆదాయాన్ని పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ పెయిడ్ సబ్స్క్రిప్షన్ ద్వారా వారి వ్యక్తిగత విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటారు అయితే విష్ణు ప్రియ ఈ విధంగా పెయిడ్ సబ్స్క్రిప్షన్ ద్వారా ఏకంగా 5,135 మంది సబ్స్క్రైబర్లను సొంతం చేసుకున్నారు. ఈ సబ్స్క్రిప్షన్ పొందాలి అంటే ప్రతినెల 390 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
ఇలా ఈమెకు ఉన్న సబ్స్క్రైబర్స్ ద్వారా నెలకు రెండు లక్షల ఆదాయం అందుకుంటున్నారు. ఇలా సబ్స్రిప్షన్ పేరుతో వారి బోల్డ్ ఫోటోలతో పాటు కొన్ని వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ నెలకు భారీగా సంపాదిస్తున్నారని చెప్పాలి. ఇక విష్ణు ప్రియ ఈ విధమైనటువంటి సబ్స్ట్రిప్షన్ పెట్టడంతో గతంలో కూడా ఈమె పట్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడమే కాకుండా తనపై చర్యలు తీసుకోవాలి అంటూ ఏఐఎస్‌ఎఫ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ విధంగా విష్ణుప్రియ సబ్స్క్రిప్షన్ పేరుతో తన బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ ఆరోపణలు వచ్చాయి.
ఈ విధంగా ఈమెపై కేసు నమోదు కావడంతో విష్ణు ప్రియ వార్తల్లో నిలిచారు. ఈ నేపథ్యంలోనే ఈ ఫెయిడ్ సబ్స్క్రిప్షన్ గురించి తెలియని వారు కూడా తెలుసుకొని ఆమెకు మరింతమంది సబ్స్క్రైబర్లు పెరగడం గమనార్హం. ఎంతోమంది సెలబ్రిటీలు ఈమె బాటలోనే ఇంస్టాగ్రామ్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ ప్రారంభించారు. ఏది ఏమైనా విష్ణు ప్రియ ఇన్స్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం అందుకోవడమే కాకుండా మరోవైపు ప్రమోషన్ కంటెంట్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈమె పలు బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు.
Also Read: నాకు ఎలాంటి రోగం లేదు..తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దన్న కమెడియన్!