E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode August 8th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్నకు కోలుకోలేని షాక్ ఇచ్చిన సూరజ్    

Karthika Deepam 2 Serial Today Episode August 8th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్నకు కోలుకోలేని షాక్ ఇచ్చిన సూరజ్    
Advertisement

Karthika Deepam 2 serial today Episode:  జ్యోత్స్నను తాను రిజెక్ట్‌ చేస్తున్నానని.. పెళ్లికి రెండు ఇష్టం లేని రెండు మనసులు కలవలేవని చెప్తాడు సూరజ్‌. దీంతో జ్యోత్స్న కోపంగా నేను చేసిన అవమానం మనసులో పెట్టుకుని నువ్వు నన్ను రిజెక్ట్‌ చేస్తున్నావా..? అని అడిగితే.. నువ్వు ఏమైనా అనుకో కానీ నేను చెప్పింది ఇక్కడ ఉన్నవాళ్లకు అర్థం అయితే చాలు అంటూ సూరజ్‌ చెప్పగానే.. జ్యోత్స్న కోపంగా ఈ జ్యోత్స్ననే రిజెక్ట్‌ చేస్తున్నావా.? నువ్వు అంటూ ప్రశ్నిస్తుంది. అవును జ్యోత్స్ననే రిజెక్ట్ చేస్తున్నాను అంటూ సూరజ్‌ కరాకండిగా చెప్తాడు. నీ మనసులో నేనున్నానని నేను నమ్మిన రోజున నీతో ఏడడుగు నడవడానికి నేను రెడీగా ఉంటాను.. ఇక వెళ్తాను సార్‌ అంటూ సూరజ్‌ వెళ్లిపోతుంటే..

సుమిత్ర ఆపేసి నా కూతురు మనసులో వాళ్ల బావ లేడని నీకు తెలిస్తే నా కూతురును పెళ్లి చేసుకోవడానికి నీకు అభ్యంతరం లేదు కదా అనగానే.. లేదు మేడం కానీ అది నేను నమ్మాలి అంటాడు సూరజ్‌. అయితే అది నీకు తెలియాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి అని సుమిత్ర చెప్పగానే.. సూరజ్‌ లేదు మేడం నా దారి వేరే ఉంది నేను వెళ్లిపోతాను అనగానే.. సుమిత్ర నువ్వు ఏ తప్పు చేయలేదని నిన్ను నువ్వు నమ్ముకుంటే ఇక్కడే ఉండు.. లేదంటే నువ్వు వెళ్లిపోతే తప్పు చేసినట్టే అంటూ సుమిత్ర చెప్పగానే.. సూరజ్‌ సరే మేడం అంటూ బయటకు వెళ్లిపోతాడు. జ్యోత్స్న కోపంగా లోపలికి వెళ్లిపోతుంది. కార్తీక్‌, దీప బయటకు వెళ్లిపోతారు.

Advertisement

ఇది నేను అసలు ఊహించలేదు.. సూరజ్‌ ఇలా మాట్లాడతాడని అనుకోలేదు అంటాడు కార్తీక్‌. కానీ దీని వల్ల రెండు విషయాలు స్పష్టం అవుతున్నాయి అంటూ దీప జ్యోత్స్న విషయంలో సూరజ్‌ చెప్పిన విషయాలు నిజమే అంటుంది. కార్తీక్ కూడా అవును కానీ సూరజ్‌ ఏం చెప్పాలనుకున్నాడో అది స్పష్టంగా చెప్పాడు.. అది కొందరికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు కానీ అన్ని అనుమానాలన్నీ సూరజ్‌ తన మాటలతో తీర్చేశాడు అంటాడు. జ్యోత్స్నకు సూరజ్‌ ను మించిన మంచి భర్త దొరకడం చాలా కష్టం అంటుంది దీప. అవునని అత్త కూడా అలాగే ఆలోచించి ఉండొచ్చు అందుకే సూరజ్‌ ఇక్కడే ఉండేలా చేసింది అంటాడు కార్తీక్‌.

మరోవైపు సుమిత్ర, దశరథ, శివనారాయణ కూడా ముగ్గురు సూరజ్‌ చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తారు. శివనారాయణ మరో సంబంధం చూద్దామని చెబితే.. అలా చూసిన అబ్బాయి కూడా కార్తీక్‌ విషయంలో జ్యోత్స్న బిహేవియర్‌ గురించి అడిగితే ఏం చేస్తాం అని సుమిత్ర చెప్పగానే.. దశరథ కూడా అది నిజమే కదా పైగా సూరజ్‌ జ్యోత్స్నను చాలా బాగా అర్థం చేసుకున్నాడు. తనను భరించాడు.. జ్యోత్స్న గురించి సూరజ్‌కు మనం చెప్పేది ఏమీ లేదు.. ఇంకా మనమే జ్యోత్స్న గురించి సూరజ్‌ దగ్గర తెలుసుకోవాలి అన్నంతగా అర్థం చేసుకున్నాడు అని చెప్తాడు. మరి జ్యోత్స్నను పెళ్లి చేసుకోను అన్నాడు.. మనసు మారాలి అన్నాడు అలాంటి టార్చర్‌ పెట్టేవాడు నీ కూతురుకు కరెక్టేనా అని నీకు అనిపించలేదా..? అని శివనారాయణ అడగ్గానే..

Advertisement

ఇదే విషయం పెళ్లి అయ్యాక చెబితే మనం ఏం చేసేవాళ్లం.. పైగా ఆస్థి ఉంటే చాలు అమ్మాయి ఎలా ఉన్నా పర్వాలేదు అనుకునే ఈ రోజుల్లో సూరజ్‌ చెడ్డవాడైతే మీరిచ్చిన ఆఫర్‌కు నో చెప్పకుండా పెళ్లి చేసుకునే వాడు. కానీ సూరజ్‌ చాలా మంచి వాడు కాబట్టి మన ముందే నిజాలు మట్లాడాడు.. స్వార్థం లేని సూరజ్‌ మంచితనం మనకున్న ఆస్థికన్నా ఎక్కువే..? కష్టపడకుండా వస్తున్న ఆస్థులను కూడా వదులుకోవడానికి సిద్దపడ్డాడంటే.. సూరజ్‌ ఎంత మంచి వాడో అర్థం అవుతుంది కదా అంటూ సుమిత్ర చెప్పగానే.. చూద్దాం ఎలా జరుగుతుందోనని శివనారాయణ అంటాడు.

రూంలో ఒంటరిగా కూర్చుని జ్యోత్స్న ఏడుస్తుంది. సూరజ్‌ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని బాధపడుతుంది. పారిజాతం వెళ్లి సూరజ్‌ను తిడుతూ.. వాడు నిన్నే రిజెక్ట్ చేస్తాడా..? అంటుంది. జ్యోత్స్న మాత్రం వాడు నిజమే చెప్పాడు అంటుంది. కానీ వాడు రిజెక్ట్‌ చేస్తున్నాను అన్న మాట సుత్తి తీసుకుని నెత్తి మీద కొట్టినట్టు ఉంది అంటూ పరధ్యానంలో కూర్చున్నట్టు ఆలోచిస్తూ బాధపడుతుంది జ్యోత్స్న. తనను కాసేపు ఒంటరిగా వదిలేయమని ఇక సూరజ్‌ విషయం వదిలేయమని చెప్తుంది. అందుకు పారిజాతం షాక్‌ అవుతుంది. ఏంటో కొత్తగా కనిపిస్తున్నావు… అంటూ కొంపదీసి జ్యోత్స్న ఆ సూరజ్‌ గాడితో ప్రేమలో లేదు కదా అని మనసులో అనుకుంటూ వెళ్లిపోతుంది.

కార్తీక్‌ ఇంటి దగ్గరకు వెళ్లి శివనారాయణ ఇంట్లో జరిగింది చెప్తాడు. అందుకు కాంచన, జ్యోత్స్నను తిడుతుంది. దాని అహంకారం దిగిపోయింది అంటుంది. ఇక ఈ పెళ్లి జరగదు అని శ్రీధర్‌ అంటాడు. కానీ దీప, కార్తీక్‌ ఇద్దరూ కలిసి ఎలాగైనా సరే ఈ పెళ్లి మనమే చేయాలని అంటారు. మీరు మాట నిలబెట్టుకోవాలంటే జ్యోత్స్న మనసు మార్చుకోవాలి కదా అంటుంది కాంచన. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?

శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బోలే.. దెబ్బకు రియాక్షన్?

Nirupam Paritala : మంచుకొండల్లో డాక్టర్ బాబు… ఏమున్నాడ్రా బాబు..

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Big Stories

Advertisement
×