E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode June 27th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పనిమనిషిలా మారిపోయిన పారిజాతం – సుమిత్రకు నిజం తెలిసేలా చేసిన దశరథ  

Karthika Deepam 2 Serial Today Episode June 27th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పనిమనిషిలా మారిపోయిన పారిజాతం – సుమిత్రకు నిజం తెలిసేలా చేసిన దశరథ  
Advertisement

Karthika Deepam 2 serial today Episode: శివనారాయణ ఆర్డర్‌ ప్రకారం పారిజాతం ఇంట్లో పని మనిషిగా మారిపోతుంది. పని మనిషి గెటప్‌లో వచ్చిన పారును చూసి అందరూ ఆశ్చర్యపోతారు. కార్తీక్‌ మాత్రం ఈ గెటప్‌లో ఎంత అందంగా ఉన్నావు పారు.. పాత రోజులు తిరిగి వచ్చనట్టు లేదూ.. దీప పారుకు బొట్టు కొంచెం పెద్దది అయింది కదా..? అనగానే.. దీప వదిలేయోచ్చు కదా బావ అంటుంది. దీంతో కార్తీక్‌ వదిలేశాను దీప నెల రోజులు ఇక పారు హాయిగా స్వేచ్చగా ఇంటి పనులు చూసుకుంటూ మొక్కలకు నీళ్లు పట్టుకుంటూ కొత్తగా రిలీజ్‌ అయిన సీరియల్‌ పార్ట్స్‌ చూసుకుంటూ ఎంజాయ్‌ చేయోచ్చు అని చెప్పగానే..

పారిజాతం ఆశ్చర్యంగా నాకు ఆ ఆఫర్‌ కూడా ఇచ్చారా..? అని అడగ్గానే.. అన్ని ఇచ్చాము పారు నువ్వు ఆడుకోవడమే తరువాయి అంటాడు కార్తీక్‌. పారిజాతం మాత్రం కోపంగా దీప యజమాని అయింది. నేను పనిదాన్ని అయ్యాను నా బతుకు ఇలా తయారైందేంటి అని మనసులో తిట్టుకుంటుంది పారిజాతం. ఇంతలో దీప ఇంటికి వెళ్దామా… అని అడగ్గానే.. మనం వెళ్లిపోయాక పారు అందరూ నిద్రపోయాక హాయిగా రూంలో ఏసీ వేసుకుని పడుకుంటే.. బయటి నుంచి పిజ్జాలు, బర్గర్లు ఆర్డర్‌ చేసుకుని తినోచ్చు అంటూ అనుమానం వ్యక్తం చేస్తే.. శివనారాయణ వెళ్లి పారజాతం రూంకు తాళం వేసి తాళం చెవులు తీసుకుని వెళ్లిపోతాడు. పారిజాతం కోపంగా జుట్టు విడిచి శపథం చేస్తుంది. ఆయనే వచ్చి నా రూం తెరచేలోపు ఈ జుట్టు ముడేసుకోను అంటూ శపథం చేస్తే.. ఒక నెల రోజులు ఆగితే నువ్వు చెప్పినా చెప్పకపోయినా తాతే ఆ రూం ఓపెన్‌ చేస్తాడు అంటూ కార్తీక్‌, దీపను తీసుకుని వెళ్లిపోతాడు.

Advertisement

ఇంటికి వెళ్లిన దీపకు కాంచన జాగ్రత్తలు చెప్తుంది. నువ్వు కడుపుతో ఉన్నావు.. మిగిలిపోయిన భోజనాన్ని ఏదో చేశావు కానీ కడుపు ఏమైనా అయినా ఏం చేయలేము అంటూ భయపడుతుంటే.. కార్తీక్‌ నేను ఉన్నాను కదా అమ్మా అంటూ ధైర్యం చెప్తుంటే.. ఒక్కటి మాత్రం ఆనందంగా ఉంది. ఎక్కడైతే నా కొడుకు అవమానం ఎదుర్కొన్నాడో..? అక్కడే నువ్వు గౌరవంగా సీఈవో అయ్యావు అంటూ గర్వంగా చెప్తుంది. అప్పుడే వచ్చిన శౌర్య ఆనందంగా దీప గురించి స్కూల్లో, బయట అందరికీ చెప్తానని ఆనందపడుతుంది. తర్వాత కాంచన అనుమానంగా జ్యోత్స్న చేసిన తప్పు గురించి సుమిత్ర ఏమీ అనలేదా..? అని అడగ్గానే.. అత్తకు తెలియలేదు.. చెప్పొద్దని పారు, తాత కాళ్లు పట్టుకుంది అని చెప్పగానే.. మీరు ఎన్ని రోజులు దాచిన ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది. తెలిసిన రోజు మా వదిన ఊరుకోదులే అంటుంది కాంచన.

మరోవైపు సుమిత్ర, శివనారాయణ దశరథలతో కలిసి కూర్చుని జ్యోత్స్న ఏదైనా తప్పు చేసిందా..? అని అడుగుతుంది. అత్తయ్య గారి విషయంలో మీరు కోపంగా ఉన్నారు. ఆవిడ ఏదైనా పాపం చేసిందా..? ఆ పాపంలో నా కూతురుకు ఏమైనా భాగం ఉందా..? అని అడగ్గానే.. ఉందని నువ్వు అనుకుంటున్నావా..? అని శివనారాయణ అడిగితే నా కూతురు తప్పు చేస్తే మాత్రం వదిలేయకండి మామయ్య గారు అంటుంది సుమిత్ర. దీంతో శివనారాయణ నీ కూతురును సరిదిద్దే బాధ్యత నాది అంటాడు. దీంతో అంటే నా కూతురు తప్పు చేసింది అన్నమాట అంటూ సుమిత్ర అనగానే.. ఏం జరిగింది ఎలా జరిగింది అనేది వదిలేయ్‌ అమ్మ. నా కూతురిలా ఉండాలి అని నువ్వు కోరుకుంటున్నావు కదా..? నువ్వు కోరుకున్నట్టు నీ కూతురుని తీర్చిదిద్దే బాధ్యత నాది అంటూ చెప్తుంటే..

Advertisement

సుమిత్ర వద్దు మామయ్య దాన్ని ఎవ్వరూ గెలవనివ్వొద్దు.. అలా గెలిపిస్తే.. గెలుపు విలువ దానికి తెలియదు. అది ఒకవేళ క్షమించరాని తప్పు చేస్తే.. నాకు చెప్పండి అంటుంది. దీంతో దశరథ ఏం చేస్తావు అని అడగ్గానే.. తప్పు చేస్తే కన్నతండ్రినే వదులుకున్న దాన్ని.. కన్నదాన్ని వదులుకోలేనా..? అంటూ సుమిత్ర చెప్పగానే.. చాటు నుంచి వింటున్న జ్యోత్స్న షాక్‌ అవుతుంది. అంటే నేను తప్పు చేశానని తెలిస్తే.. నన్ను ఇంట్లో ఉండనివ్వరన్నమాట అనుకుంటూ తన రూంలోకి వెళ్తుంది. రూంలో చీకటిలో జుట్టు విరబోసుకుని కూర్చున్న పారిజాతాన్ని చూసిన జ్యో షాక్‌ అవుతుంది. లైట్‌ వేసి దగ్గరకు వెళ్లి తిడుతుంది. దీంతో పారిజాతం అందరూ కలిసి నన్ను తరిమేయండి అంటూ తిడుతుంటే.. నా టెన్షన్‌లో నేనుంటే నువ్వు వచ్చి ఇలా భయపెడతావేంటి..? అనగానే.. నీ టెన్షన్‌ ఏంటే అని పారిజాతం అడిగితే సూరజ్‌ గాడు వాడు ఈ కాంపటీషన్‌ అయిపోయాక వెళ్లిపోతాడు అనుకుంటే.. ఇక్కడే ఉండిపోయాడు అంటుంది. దీంతో పారిజాతం కోపంగా వాడిని ఇంట్లోంచి మీ తాతయ్యే వెళ్లగొట్టేలా నా దగ్గర ఒక ప్లాన్‌ ఉంది అంటూ వెళ్లిపోతుంది.

మరోవైపు కిచెన్‌లో ఉన్న దీపను పిలిచిన కాంచన కొన్ని చీరలు, బంగారం చైన్‌ గిఫ్ట్‌ గా ఇస్తుంది. అవి చూసిన దీప షాక్‌ అవుతుంది. కార్తీక్‌ ఎమోషనల్ అవుతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

ఫైమా, యాదమరాజు మధ్య బాంగిల్స్ గోల.. నవ్వులే నవ్వులు!

సోనియానే నా హీరో అన్న యష్.. ఎందుకో తెలుసా?

సనాతన ధర్మంపై ఫైమా ఏమందో తెలుసా.. ఫ్యామిలీ రియాక్షన్ కూడా ఇదే!

యాదమరాజుతో ఫస్ట్ టైమ్ థియేటర్‌కు వెళ్లిన స్టెల్లా.. అక్కడ ఏం జరిగిందంటే?

ఫైమా బెటరా? వర్ష బెటరా?.. సమాధానం విని అంతా నవ్వాల్సిందే!

సింగిల్‌గా ఉండటమే బెస్ట్ అంటున్న వర్ష.. విష్ణుప్రియ కౌంటర్ అదుర్స్!

రూ.15 లక్షలకే ఎందుకు టెంప్ట్ అయ్యావు.. మిథిలేష్ కు ఇచ్చిపడేసిన శివాజీ!

బషీర్ మాస్టర్ ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Big Stories

Advertisement
×