E-Paper
Advertisement

భార్య ప్రేమ కోసం తెగించాడు.. దొంగగా మారి కారుని కొట్టేసిన భర్త, మధ్యప్రదేశ్‌లో ఘటన

భార్య ప్రేమ కోసం తెగించాడు.. దొంగగా మారి కారుని కొట్టేసిన భర్త, మధ్యప్రదేశ్‌లో ఘటన
Advertisement

Bhopal: భార్య ప్రేమను పొందేందుకు చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కాకపోతే కొందరు మహిళలు గొంతెమ్మ కోర్కోలు కోరుతారు. లేకుంటే భర్తను దూరంగా పెడతాడు. భార్య కోరిన కాదనలేక ఏకంగా దొంగగా మారాడు ఓ భర్త. ఈ ఘటన మధ్య ప్రదేశ్‌లో వెలుగు చూసింది.

భోపాల్‌లో ఊహించని ఘటన

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఓ కారు షోరూమ్‌ నుంచి ఇటీవల కారు దొంగతనం కేసు వెలుగులోకి వచ్చింది . ఈ దొంగతనం వెనుకున్న అసలు కుట్ర బయటపడింది. షోరూమ్ ఉద్యోగి గజేంద్ర అలియాస్ రిషి ఆనంద్ తన సొంత షోరూమ్ నుంచే సుమారు రూ. 23 లక్షల రూపాయల విలువ చేసే విలాసవంతమైన కారును దొంగిలించాడు. ఆ ఉద్యోగి పేలవమైన పని తీరు కారణంగా జీతంలో 30 శాతం కోత విధించారట. దీంతో సదరు సేల్స్‌మ్యాన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

భార్య కోరిక కోసం కారుని కొట్టేసిన భర్త

Advertisement

సీన్ కట్ చేస్తే.. రిషికి భార్య అంటే ప్రాణం. ఈ సందర్భంగా ఆమె చిన్న కోరిక భర్తను కోరింది. ఖరీదైన కారులో తిరగాలని చెప్పడంతో ఏ మాత్రం ఆలోచించలేదు. భార్య ప్రేమను పొందేందుకు తన షోరూమ్‌లో కారుకి కన్నం వేశాడు. భార్య ఖరీదైన కోరికలను తీర్చడం కోసం రిషి షోరూమ్ నుంచి 23 లక్షల రూపాయల విలువైన వోక్స్‌ వ్యాగన్ వర్టస్ జీటీ కారుని దొంగిలించాడు. ఓ కస్టమర్ పేరు మీద కారును బుక్ చేసి సెప్టెంబర్ 28న రాత్రి షోరూమ్ నుంచి వెళ్లిపోయాడు. ఆ కారు కూడా వెళ్లిపోయింది.

స్టాక్ తనిఖీ సమయంలో షోరూమ్ సిబ్బందికి కారు కనిపించకపోవడంతో అనుమానం వచ్చింది. కంపెనీ ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారులో అమర్చిన జీపీఎస్ డీటేల్స్ పోలీసులకు ఇచ్చారు. చివరకు భోపాల్‌లో పోలీసులు అషిమా మాల్ సమీపంలో కారును కనుగొన్నారు. రిషి భార్య కారు నడుపుతున్నట్లు తేలింది. కారు కోసం గాలిస్తున్న పోలీసులు అక్కడికి చేరుకోగానే అసలు విషయం బయటపడింది. పోలీసులు నిందితుడు, షోరూమ్ ఉద్యోగిపై ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Advertisement

ALSO READ: మేము కొట్టం.. తిట్టం.. కానీ? మోడీ, అమిత్ షాలకు రాహుల్ ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ మెసేజ్!

పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు రిషి.. జేకే రోడ్‌లోని వోక్స్‌వ్యాగన్ కార్ షోరూమ్‌లో ఏడాదిగా పని చేస్తున్నాడు. హోషంగాబాద్‌కు చెందిన అతడు, భోపాల్‌లోని అశోకా గార్డెన్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. షోరూమ్‌లో పని చేయడంవల్ల వాహనాల రాకపోకలు, వాటి గురించి అవగాహన ఏర్పడింది. దీన్ని తనకు అనుకూలంగా మలచుకుని దొంగతనం చేయడానికి ప్లాన్ చేశాడు. మొదట్లో ఈ విషయం షోరూమ్ యాజమాన్యానికి తెలియదు. వాహనాలను తనిఖీ చేసినప్పుడు కనిపించకపోవడంతో ఈ గుట్టు బయటపడింది. అశోకా గార్డెన్ పోలీసులు నిందితుడు గజేంద్ర అలియాస్ రిషి ఆనంద్‌ను అరెస్టు చేశారు. కారును స్వాధీనం చేసుకుని షోరూమ్ వారికి అప్పగించారు. నిందితుడ్ని పోలీసులు విచారిస్తున్నారు.

Related News

మేము కొట్టం.. తిట్టం.. కానీ? మోడీ, అమిత్ షాలకు రాహుల్ ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ మెసేజ్!

ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై.. మమత బెనర్జి సంచలన సెటైర్లు!

రైల్వే జాబ్స్.. 1,215 స్టేషన్ మాస్టర్ ఖాళీలు.. డిగ్రీ అంటే చాలు

రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా బ్లాక్ ర్యాలీ..10 లక్షల మంది వస్తారని అంచనా, భారీగా పోలీసుల మోహరింపు

కర్ణాటక రాజకీయాల్లో స్పై ఆపరేషన్ల కలకలం.. సిద్ధరామయ్య కేసులో సంచలన ట్విస్ట్!

నడిరోడ్డుపై మహిళ హల్‌చల్.. బీఎండబ్ల్యూ కారుతో బీభత్సం.. పోలీసునే ఢీకొట్టేందుకు యత్నం!

క్లాస్‌రూమ్‌లో దారుణం.. 6 ఏళ్ల చిన్నారిపై 8 ఏళ్ల బాలుడి రాక్షస దాడి.. షాకింగ్ CCTV విజువల్స్!

Big Stories

Advertisement
×