E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode September 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణకు మాలిని షాక్ – హాస్పిటల్ లో దీప          

Karthika Deepam 2 Serial Today Episode September 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణకు మాలిని షాక్ – హాస్పిటల్ లో దీప          
Advertisement

Karthika Deepam 2 serial today Episode: మాలిని మోసం పసిగట్టిన శివనారాయణ, దశరథ ఇద్దరూ కలిసి తమ హెడ్‌ ఆఫీసుకు వెళ్తారు. అక్కడ సెక్యూరిటీ వాళ్లను లోపలికి వెళ్లనివ్వడు.. పర్మిషన్‌ ఉందా అని అడుగుతాడు. అందుకు శివనారాయణ కోపంగా మా ఆఫీసులో మేము పర్మిషన్‌ తీసుకోవడం ఏంట్రా వెధవ అంటూ కొట్టి లోపలికి వెళ్తారు. శివనారాయణ, దశరథ కలిసి రావడం చూసిన ఉద్యోగులు బాధగా ఎదురుగా వచ్చి అన్యాయం జరిగిపోయింది సార్‌ అంటూ ఎమోషనల్ అవుతుంటారు. మేము మాట్లాడటానికే వచ్చాము మాలిని ఎక్కడుంది అని శివనారాయణ అడిగితే కాన్ఫరెన్స్‌ హాల్ లో ఉందని చెప్తారు. శివనారాయణ, దశరథ కాన్ఫరెన్స్‌ హాల్లోకి వెళ్ళబోతుంటే.. డోర్‌ దగ్గర ఉన్న సెక్యూరిటీ ఆపేసి పర్మిషన్‌ ఉందా అని అడుగుతాడు. దశనరథ అనుమానంగా నాన్న ఇక్కడేదో జరుగుతుంది కాసేపు ఆగి చూద్దామని చెప్తాడు. శివనారాయణ సరే అంటాడు.

నొప్పితో బాధపడుతున్న దీపను జ్యోత్స్న, సూరజ్‌ ఇద్దరూ కలిసి హాస్పిటల్‌ కు తీసుకెళ్తుంటారు. జ్యోత్స్న త్వరగా వెళ్లమని చెబితే స్పీడుగానే వెళ్తున్నాను.. నాకు కూడా వదిన మీద అభిమానం ఉంది అంటాడు సూరజ్‌. ఏంటి ఉండేది.. నమ్మించి నడి రోడ్డు మీద వదిలేయడమా అభిమానం అంటూ తిడుతుంది జ్యోత్స్న. ఇంతలో హాస్పిటల్‌ వస్తుంది. దీపను హాస్పిటల్‌లోకి తీసుకెళ్తారు. దీపను కారులోంచి తీసుకెళ్తుంటే.. జ్యోత్స్న ఫోన్‌ కారులో పడిపోతుంది. హాస్పిటల్‌ లోకి వెళ్లాక సూరజ్‌ అసలు వదినకు ఏమైంది అని అడుగుతాడు. దీంతో జ్యోత్స్న కోపంగా ఇంకా నీకు వరుసలు గుర్తున్నాయా..? అంటూ తిడుతుంది. అయినా నీతో మాట్లాడటమే వేస్ట్‌ అనగానే.. అసలు నేను ఏం అడుగుతున్నాను.. నువ్వు ఈ టైంలో ఏం మాట్లాడుతున్నావు.. అసలు నీతో మాట్లాడటం కూడా వేస్ట్‌ అంటూ సూరజ్‌ తిడతాడు.

Advertisement

ఆఫీసులో ఏం జరుగుతుందో అర్థం కానీ శివనారాయణ కోపంతో రగిలిపోతుంటాడు. ఒకవైపు ఐటీ రైడ్స్‌ మరోవైపు మాలిని ఆక్రమణ అసలు ఏం జరగుతుంది దశరథ అంటూ కాన్ఫరెన్స్‌ హాల్లోకి వెళ్తాడు. అక్కడ చైర్మన్‌ సీటులో మాలిని కూర్చుని ఉంటుంది. చుట్టూ బోర్డు మెంబర్స్‌ ఉంటారు. వాళ్లను చూసి శివనారాయణ కోపంతో రగిలిపోతూ మాలిని ఏం చేస్తున్నావు అంటూ తిడతాడు. నా ఆఫీస్‌లో నీ పెత్తనం ఏంటి మాలిని అంటూ గద్దిస్తే.. నీ ఆఫీసా ఏం మాట్లాడుతున్నారు బాబాయ్.. ఈ బోర్డు మెంబర్స్ ఇప్పటి నుంచి నా బోర్డు మెంబర్స్.. గౌరీ ప్రసాద్ నా మనిషే.. తన రెస్టారెంట్ అమ్ముతాను అనడం.. దానికి మీరు పోటీకి రావడం.. అంతా నేను ఆడించిన నాటకం.. అది మీరు కొన్నాం అనుకున్నారు.. మీరు కొనలేదు.. మిమల్నే మేం కొన్నాం.. కళ్లు మూసుకొని కుటుంబం మొత్తం సంతకాలు పెట్టారు.. సంతకం పెట్టేముందు కాస్త చదువుకుని ఉంటే ఎవరి పేరు మీద సంతకం పెట్టారో తెలిసేది అంటూ మాలిని చెప్పగానే..

శివనారాయణ ప్లాష్‌ బ్యాక్‌ గుర్తు చేసుకుంటాడు. మీరు జ్యోత్స్న రెస్టారెంట్స్ రాసింది నా కొడుకు సూరజ్ పేరు మీద.. ఇక నుంచి జ్యోత్స్న రెస్టారెంట్స్ మావి.. మీరు గుడ్డిగా సంతకాలు పెట్టారు.. ఏం చేస్తాం మీ టైం అలా ఉంది.. చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి..  ఇదే కాదు బాబాయ్ ఇంకా చాలా బ్యాంక్స్‌లో మీరు అడ్డుగోలుగా డబ్బు తీసుకున్నారు అని మాలిని అంటుంది. నేనా.. నేను లోన్‌ తీసుకోవడం ఏంటి..? అంటూ శివన్నారాయణ ప్రశ్ని్స్తే..  మీరు కాదు మీ సంతకంతో నేను తీసుకున్నాను.. నా కొడుకు, దీప చాలా సార్లు మీ దగ్గర సంతకాలు తీసుకున్నారు. మీరు ఏం చదవకుండా గుడ్డిగా సంతకాలు చేశారు కదా ఇప్పుడు నీ ఆస్తుల మీద షేర్స్ మీద నీకు ఏం హక్కు లేదు అంటూ మాలిని చెప్తుంటే.. శివనారాయణ నిశ్చేస్టుడై కూలబడిపోతాడు. మాలిని కోపంగా సెక్యూరిటీని పిలిచి వీళ్లన బయటకు గెంటేయండి అని చెప్పగానే.. దశరథ ఏడుస్తూ అంతా అయిపోయింది నాన్న అంటూ బాధపడుతుంటాడు.

Advertisement

మరోవైపు హాస్పిటల్‌లో ఉన్న దీపకు ఆపరేషన్‌ చేయాలని తన భర్తను పిలపించండి డాక్టర్‌ చెబితే.. సూరజ్‌ తాను తన మరిదినని చెప్పి సంతకం చేయబోతే.. జ్యోత్స్స అడ్డుపడి నీకు సంతకం చేసే అర్హత లేదు అంటూ తిట్టి చెల్లిగా తాను సంతకం చేస్తుంది జ్యోత్స్న. తర్వాత దీపకు అవసరమైన బ్లడ్‌ కూడా జ్యోత్స్నే ఇస్తుంది. సూరజ్‌ హాస్పిటల్‌ స్టాప్‌కు కార్తీక్‌ నంబర్‌ ఇచ్చి ఫోన్‌ చేయమని చెప్తాడు. స్టాప్‌ కార్తీక్‌కు ఫోన్‌ చేసి దీపకు గురించి చెప్తారు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాకు మరో షాక్.. అడ్డంగా దొరికిపోయిన బాలు.. అరుణ్ తో మళ్లీ గొడవ..

Podarillu Today Episode : చక్రీ ప్లాన్ రివర్స్.. తాయారును రెచ్చగొట్టిన నారాయణ..పంతులు ప్లాన్ సక్సెస్..

Intinti Ramayanam Today Episode: పార్వతిని చంపేందుకు పల్లవి ప్లాన్.. అయ్యో పార్వతి.. సీన్ రివర్స్..

Illu Illalu Pillalu Today Episodes: వేదవతికి భద్ర వార్నింగ్.. ధీరజ్ కు మైండ్ బ్లాక్.. రామరాజు మాటతో ఫ్యూజుల్ అవుట్..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. కార్తీక దీపం 2 పరిస్థితి ఏంటి..?

Monday Movies in Tv : సోమవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

నటరాజ్ మాస్టర్ సినిమాలకు కొరియోగ్రఫీ చేయకపోవడానికి అదే కారణమా.. క్రెడిట్ అంతా వాళ్ళదేనా?

Big Stories

Advertisement
×