Karthika Deepam 2 serial today Episode: కాంచన ఇంటికి వచ్చిన మాలిని తన ప్లాన్ ప్రకారం తాను, కార్తీక్, దీప ఒక్కటే అని శివనారాయణ నమ్మాలి అనుకుంటుంది. అందుకోసం మాలిని శివనారాయాణను రెచ్చగొడుతుంది. తమ ఆఫీసుకు దీప, కార్తీక్ వచ్చిన విషయం చెప్తుంది. సీఈవో పదవి గురించి బేరాలు ఆడారని చెప్తుంది. అంతా శివనారాయణ వింటుంటాడు. మాలిని మాత్రం తాను చెప్పాలనుకున్నది చెప్తూనే ఉంటుంది. మీరు కోప్పడుతుంటారు బాబయ్ కానీ మేము ఎప్పుడో కలిసిపోయాము అంటూ దీప, మాలిని చేయి పట్టుకుని ఉన్న పాత ఫోటో తీసి చూపిస్తుంది. అలాగే దీపను తన రెండు వేళ్లల్లో ఒకటి పట్టుకోమని అడుగుతుంది. దీప ఒక వేలు పట్టుకోగానే.. అయితే నువ్వు సీఈవోగా ఉండటానికే మొగ్గుచూపావు అయితే నువ్వు సీఈవో నీకు కార్తీక్ అడ్వైజర్ అంటూ ఆఫర్ లెటర్ చేతిలో పెట్టి వెళ్లిపోతుంది మాలిని. మాలిని, దీప ఉన్న ఫోటో చూసిన శివనారాయణ కోపంతో రగిలిపోతుంటాడు.
బయట సూరజ్‌తో ఉన్న జ్యోత్స్న ఇంట్లోంచి బయటకు వస్తున్న మాలినిని చూస్తుంది. కోపంగా ఏంటి అత్తా ఎవరిని బేరం ఆడావు.. మనుషులనా..? ఇంటినా..? చెప్పు అత్తా అంటూ ప్రశ్నిస్తుంటే.. మాలిని కోపంగా నా కొడుకుతో ఏంటే మాట్లాడుతున్నావు.. అని మాలిని అడిగితే.. సీక్రెట్స్ మాట్లాడుతున్నాను అత్త.. అయినా నీ కొడుకు నేను రోజు కలుసుకుంటున్నాము తెలుసా..? ముందు ఎదుటి వాళ్లను కొనే ముందు నీ కొడుకు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసుకో అత్తా నీ కొడుకు ఎప్పుడో నా ప్రేమలో మునిగిపోయాడు. కావాలంటే నీ కొడుకు పర్స్ చూడత్తా అందులో ఏముంటుందో నీకే తెలుస్తుంది కదా అంటూ జ్యోత్స్న చెప్పగానే.. ఏముంటుంది నా ఫోటో ఉంటుంది అని మాలిని చెబితే.. నీ ఫోటో కాదు అత్తా నా ఫోటో ఉంటుంది. నీ కొడుకు ఎప్పుడో నీ చేతుల్లోంచి జారిపోయాడు అత్తా.. నీ ఫోటో పెట్టుకొని తిరిగే కాలానికి నీ కొడుకు ఎప్పుడో త్రిలోధకాలు ఇచ్చేశాడు. చివరిగా ఒక్క విషయం నా ఫ్యామిలీని నువ్వేం చేయలేవు అంటూ వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్లిపోతుంది జ్యోత్స్న.
ఇంట్లో శ్రీధర్ కోపంగా అసల ఏమైంది మీకు ఆ మాలిని ఇంటికి ఎందుకు వెళ్లారు అంటూ నిలదీస్తుంటే.. కార్తీ్‌క్, దీపలను వెనకేసుకొస్తుంది కాంచన. తన కొడుకు ఏం చేసినా కరెక్టే చేస్తాడని వాడి మీద తనకు నమ్మకం ఉందని చెప్తుంది. కానీ అగ్రిమెంట్ గురించి తమకు ఎందుకు చెప్పలేదని దశరథ్ ప్రశ్నిస్తాడు. సుమిత్ర కూడా కోపంగా మీరు మీరు ఒక్కటైపోయారు మమ్మల్ని దద్దమ్మల్ని చేశారు. ఇక ఆవిడ రోజూ ఇక్కడికి వస్తుంటే.. మేము చూడలేము అంటూ సుమిత్ర ఇక్కడి నుంచి వెళ్లిపోదాం పదండి అంటుంది.
కార్తీక్, దీప వెళ్లొద్దని అడ్డు పడుతుంటే.. శివనారాయణ తిడతాడు మీరు వెళ్లి మాలినిని కలిసింది నిజమా..? కాదా..? అని అడిగితే కార్తీక్ నిజమేనని కానీ మేము చెప్పేది వినండి అంటాడు.. అందుకు శివనారాయణ కోపంగా ఇంకా మీరు చెప్పేది మేము వినడం ఏంట్రా మీరు ఇంత స్వార్థానికి ఒడిగడతారని అసలు అనుకోలేదు.. అంటూ తిడుతుంటే.. కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. అవును తాత మేము స్వార్థ పరులమే… మేమెంత స్వార్థపరులమంటే మీరు మమ్మల్ని వదిలేసినా మా జీవితం మేము బతకగలిగే శక్తి సామర్థ్యాలున్నా మీ ఇంటికి వచ్చి మీ ఆఫీసుకి వచ్చి మీ సమస్యల్ని మా సమస్యలు అనుకునేంత స్వార్థపరులం. ఆస్తులు పోగొట్టుకుని మీరు రోడ్ల మీద పడిన టైంలో నా భార్య యాక్సిడెంట్ అయి హాస్పటల్లో ఉంది. డిస్చార్జ్ అవగానే మీకోసం తాను రోడ్డు మీదకు వచ్చేంత స్వార్థపరులం. అంటూ కార్తీక్ ఎమోషనల్ అవుతూ చెప్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్ అయిపోతుంది.