Karthika Deepam 2 : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ కార్తీకదీపం 2. గతంలో వచ్చిన ఈ సీరియల్ మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఆ సీరియల్కు సీక్వల్ గానే సీజన్ 2 ప్రస్తుతం ప్రసారమవుతుంది. మొదటి సీజన్ లాగే ఈ సీజన్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని తెలుస్తుంది. స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో ఇదే టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది.. ఈమధ్య తెలుగు సీరియల్స్ పై ట్రోల్స్ కూడా ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. విషయానికొస్తే.. ఈ సీరియల్ పై కూడా ట్రోల్స్ మొదలైనట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మంచి టిఆర్పి తో దూసుకుపోతున్న ఈ షోపై కామెంట్స్ వినిపించడం గమనార్హం..
వంటలక్క మేకప్ పై ట్రోల్స్..
కార్తీకదీపం 2 సీరియల్ లో ప్రస్తుతం కార్తీక్ కు, వంటలక్క కు మరోసారి పెళ్లి చేయబోతారు కుటుంబ సభ్యులు.. ఇందులో దీపకు పెళ్లికూతురు లాగా ముస్తాబు చేస్తారు.. మొదటగా వీరిద్దరికీ పెళ్లి జరిగింది. కానీ జ్యోష్న ఆ తాళిని తెంచేస్తుంది. ఆ తాళిని మళ్లీ నేను కట్టాలి అని కార్తిక్ కండీషన్ పెడతాడు. దాంతో చేసేదేమి లేక పెళ్లి చెయ్యడానికి ఒప్పుకుంటారు. పెళ్లికి దీపని పెళ్లి కూతురులాగా రెడీ చేస్తారు. అయితే అది కాస్త చూడటానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. సడెన్‌గా దీపని పెళ్లి కూతురు గెటప్‌లో చూసిన వాళ్లు మాత్రం.. వామ్మో ఇదేం మేకప్‌రా బాబూ అని దండాలు పెట్టేస్తున్నారు. అయితే ఈ వయసులో దీపకి పెళ్లేంటి? అనే కామెంట్లూ వినిపిస్తున్నాయంటే.. దీపని అంతా బాగా చూపిస్తున్నారు.. ఈ గెటప్ పై ఇప్పటికే ట్రోల్స్ మొదలయ్యాయి.. అరేయ్ ఏంట్రా మా వంటలక్కను ఏం చేస్తున్నార్రా అని దీప అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతుంది. దీనిపై టీమ్ ఎలా స్పందిస్తారో చూడాలి.
దీపతో కార్తిక్ పెళ్లి…
కార్తీకదీపం మొదటి పార్ట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రెండో పార్ట్ కూడా బాగా అలరిస్తుంది. తెలుగు సీరియల్స్ లలో ఇదే నంబర్ వన్.. ఇక మొదటి దాంతో పోలిస్తే రెండో దాంట్లో దీప పెద్దగా కనిపిస్తుంది. రోజూ చూసేవాళ్లు హర్ట్ అయిపోతుంటారేమో కానీ.. ఇప్పుడు దీపని చూస్తుంటే మాత్రం..అది కూడా కార్తీక్ పక్కన భార్యగా చూస్తుంటే.. అలా కనిపించకుండా అతనికి అమ్మలా కనిపిస్తుంది. ఆమెకి కొట్టే మేకప్‌తో దీపక్కలా కాదు.. దీపమ్మలా కనిపిస్తుంది.. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్… టీమ్ ఇకనైన స్పందించి దీప మేకప్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారేమో చూడాలి..
Also Read : శనివారం మూవీ లవర్స్ కు కిక్కిచ్చే సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకండి..
స్టార్ మా టాప్ రేటింగ్స్..
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అన్నీ సీరియల్స్ పోటీ పడి మరీ వినోదాన్ని అందిస్తున్నాయి. టాప్ ప్లేసులో కార్తీక దీపం 2 ఉంది. అలాగే రెండో ప్లేసులో ఇల్లు ఇల్లాలు పిల్లలు, గుండెనిండా గుడిగంటలు కొనసాగుతున్నాయి.. అంతేకాదు పలు స్పెషల్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి.