OTT Movie : ఓటీటీలోకి ఒక సరికొత సై-ఫై సిరీస్ స్ట్రీమింగ్ కి వచ్చింది. యాక్షన్ స్టోరీలను ఇష్ట పడేవాళ్లకి ఇది కావాల్సినంత స్టఫ్ ని ఇస్తుంది. ఇదివరకే రెండు సీజన్ లతో ఈ సిరీస్ ఆడియన్స్ ని అలరించింది. ఇందులో ఏలియన్ షిప్ ధ్వంసమైన రెండు సంవత్సరాల తర్వాత, ప్రపంచం సాధారణ స్థితిలోకి వచ్చినట్లు కనిపిస్తుంది. కానీ ఏలియన్లు తిరిగి వస్తారనే భయం మళ్లీ తలెత్తుతుంది. ఇప్పటివరకు చెల్లాచెదురుగా ఉన్న ప్రధాన పాత్రలు మొదటిసారిగా ఒకచోట చేరి, కొత్త ఏలియన్ మదర్ స్పేస్ షిప్‌లోకి చొరబడే అత్యంత ప్రమాదకరమైన మిషన్‌లో పాల్గొంటారు. మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీన్స్ తో సీజన్ 3 వచ్చింది. ఈ సిరీస్ పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
యాపిల్ టీవీ+ లో స్ట్రీమింగ్
‘ఇన్వేషన్’ (Invasion) సీజన్ 3, సైమన్ కిన్బెర్గ్, డేవిడ్ వీల్ సృష్టించిన సై-ఫై సిరీస్. 2025 ఆగస్టు 22 నుంచి యాపిల్ టీవీ+లో ప్రీమియర్ అవుతోంది. 2025 ఆగస్టు 22 నుండి అక్టోబర్ 24 వరకు వారంవారీగా ఎపిసోడ్‌లు విడుదలవుతాయి. ఈ సిరీస్‌లో గోల్షిఫ్తే ఫరహానీ (అనీషా మాలిక్), షియోలి కుట్సునా (మిట్సుకి యమటో), షమీర్ ఆండర్సన్ (ట్రెవాంటే కోల్), బిల్లీ బారట్ (కాస్పర్ మోరో), ఇండియా బ్రౌన్ (జమీలా హస్టన్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ నటన, సినిమాటోగ్రఫీకి ప్రశంసలు అందుకుంది. ఈ సిరీస్ 22వ విజువల్ ఎఫెక్ట్స్ సొసైటీ అవార్డులలో అత్యుత్తమ ఎఫెక్ట్స్ సిమ్యులేషన్స్ కోసం నామినేట్ అయింది.
స్టోరీలోకి వెళ్తే
అనీషా మాలిక్, మిట్సుకి యమటో, ట్రెవాంటే కోల్, కాస్పర్ మోరో, జమీలా హస్టన్ తమ జీవితాలను పునర్నిర్మించే ప్రయత్నంలో ఉంటారు. ఈ సీజన్‌లో ఈ పాత్రలు ఒక కీలక మిషన్ కోసం ఒక్కటవుతాయి. ఏలియన్ మదర్ స్పేస్ షిప్‌లోకి చొరబడి మానవాళిని రక్షించేందుకు ప్రయత్నిస్తారు. గత సీజన్లలో విడివిడిగా ఉన్న వీళ్ళు, ఈ సీజన్‌లో ఒక్కటిగా మారి యాక్షన్‌ను తీవ్రతరం చేస్తారు. అయితే ఈ ఏలియన్లు మరింత ఘోరమైన రూపంలో తిరిగి వచ్చి, భూమిపై ప్రమాదకరమైన తొండలను వ్యాపింపజేస్తాయి.
మిట్సుకి ఏలియన్స్ తో ఉన్న సంబంధం సీజన్ 2 క్లైమాక్స్ తర్వాత, ఆమె భవిష్యత్తు గురించి ప్రశ్నలను లేవనెత్తుతుంది. అయితే ఇప్పుడు అనీషా ఒక ధీర నాయకురాలిగా అవతారం ఎత్తుతుంది. ట్రెవాంటే ఇక్కడ జరిగే అరాచకంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాడు. ఈ సీజన్ ఉత్కంఠభరితమైన యుద్ధాలతో ముందుకు నడుస్తుంది. ఏలియన్స్ ని వీళ్లంతా అదుపు చేస్తారా ? ఏలియన్స్ భూమిని ఆక్రమించుకుంటాయా ? ఈ స్టోరీ నాలుగో సీజన్ కి గేట్లు తీరుస్తుందా ? అనే విషయాలను ఈ సై-ఫై సిరీస్ ని చూసి తెలుసుకోండి.
Read Also : భర్త ఉండగానే మరొకడితో… వెంకటేష్ హీరోయిన్ ఇలాంటి రోల్ లో… ఫ్యామిలీతో చూడకూడని మూవీ