E-Paper
Advertisement

పార్టీ లవర్స్ కోసం ఫర్ఫెక్ట్.. సౌండ్‌కి దిమ్మ తిరిగిపోవాల్సిందే !

పార్టీ లవర్స్ కోసం ఫర్ఫెక్ట్.. సౌండ్‌కి దిమ్మ తిరిగిపోవాల్సిందే !
Advertisement

iBall Dhun 180 portable bluetooth speaker: ప్రస్తుత రోజుల్లో ప్రయాణాల్లో ఉన్నప్పుడు,ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలు చేసుకునేటప్పుడు మంచి మ్యూజిక్ అందించే పోర్టబుల్ స్పీకర్ల ..వాడకం విపరీతంగా పెరిగింది. యూజర్ల అవసరాలకు తగ్గట్టుగా ప్రముఖ బ్రాండ్ ఐబాల్ తాజాగా మార్కెట్లోకి తెచ్చిన ‘iBall Dhun 180’ మోడల్ టెక్ మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. చూడటానికి ప్రీమియంగా ఉండటమే కాకుండా, పవర్‌ఫుల్ ఆడియోను అందించే ఈ స్పీకర్ ఫీచర్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

డిజైన్, బిల్డ్ క్వాలిటీ :

ఈ స్పీకర్ డిజైన్ చాలా ట్రెండ్‌గా, మోడ్రన్‌గా ఉంటుంది. దీని చుట్టూ ప్రీమియం ఫినిష్ ఇవ్వడం వల్ల దీనికి రిచ్ లుక్ వస్తుంది. దీనిని ఎక్కడికైనా ఈజీగా మోసుకెళ్లడానికి పైన బలమైన మెటల్ హ్యాండిల్ ను అమర్చారు. ఇది చూడటానికి స్టైలిష్‌గా ఉండటమే కాకుండా.. క్వాలిటీ పరంగా కూడా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు.

పవర్‌ఫుల్ సౌండ్, డ్యూయల్ డ్రైవర్స్ :

Advertisement

ఈ మోడల్ మెయిన్ హైలైట్ దీని సౌండ్ పవర్ అని చెప్పొచ్చు. ఇది ఏకంగా 50W RMS పవర్‌‌ఫుల్ ఆడియో అవుట్‌ పుట్‌ను అందిస్తుంది. ఇందులో.. పవర్ ఫుల్ 6.35 సెం.మీ సైజు గల డ్యూయల్ డైనమిక్ డ్రైవర్లను వాడారు. దీనివల్ల పాటల్లోని బీట్స్ చాలా స్పష్టంగా, లౌడ్‌గా వినిపిస్తాయి. అలాగే.. ఇందులో ఉన్న పవర్‌ఫుల్ బేస్ మ్యూజిక్ లవర్స్‌కు అద్భుతమైన థ్రిల్‌ను ఇస్తుంది.

డ్యూయల్ ఈక్యూ, ఆర్జీబీ లైట్స్ :

యూజర్ల మూడ్‌కు తగ్గట్టుగా సౌండ్ సెట్ చేసుకోవడానికి ఇందులో డ్యూయల్ ఈక్యూ మోడ్స్ ఇచ్చారు. మీరు ఇంట్లో.. ఉన్నప్పుడు లేదా బయట పార్టీ చేసుకునే టప్పుడు ఈ మోడ్స్‌ను మార్చుకోవచ్చు. దీనికి అదనంగా.. స్పీకర్ చుట్టూ ఆకర్షణీయమైన 7 ఆర్జీబీ లైట్ మోడ్స్ఉంటాయి. మ్యూజిక్ రిథమ్‌కు తగ్గట్టుగా ఈ లైట్లు వెలగడం పార్టీ మూడ్‌ను మరింత పెంచుతుంది.

కనెక్టివిటీ, బ్యాటరీ లైఫ్ :

Advertisement

కనెక్టివిటీ ఆప్షన్లు: ఇది లేటెస్ట్ బ్లూటూత్ v5.3 సపోర్ట్‌తో వస్తుంది.అంతే కాకుండా బ్లూటూత్‌తో పాటు USB డ్రైవ్, మైక్రో ఎస్డీ కార్డ్ (mSD), AUX కేబుల్ ద్వారా కూడా పాటలు ప్లే చేసుకోవచ్చు.

TWS సపోర్ట్: ఇందులో ట్రూ వైర్‌లెస్ డ్యూయో ఫీచర్ ఉంది. దీని సహాయంతో.. మరొక స్పీకర్‌ను యాడ్ చేసి మరింత పెద్ద సౌండ్‌ను ఎంజాయ్ చేయెచ్చు.

బ్యాటరీ, ఛార్జింగ్: ఇందులో బిల్ట్-ఇన్ రీచార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. సాధారణ వాల్యూమ్ వద్ద సుమారు 5 గంటల పాటు నాన్‌స్టాప్ ప్లేబ్యాక్ అందిస్తుంది.ఫాస్ట్ ఛార్జింగ్ కోసం లేటెస్ట్ టైప్-సి పోర్ట్‌ను దీనిలో ఇచ్చారు. అలాగే దీని ద్వారా ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి ప్రత్యేకమైన కాల్ ఫంక్షన్ కూడా అందుబాటులో ఉంది.

Also Read: గూగుల్‌లో ఈ విషయాలను అసలు వెతకొద్దు..సెర్చ్ చేస్తే నేరుగా జైలుకే!

ధరల వివరాలు:

ఇండియన్ మార్కెట్లో ఈ మోడల్ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ ధర వేరియేషన్స్ , ఈకామర్స్ సైట్లను బట్టి సుమారు రూ.3,379 నుంచి రూ. 4,499 వరకు లభిస్తుంది. వివిధ ఫెస్టివల్ సేల్స్, బ్యాంక్ ఆఫర్లలో దీనిని ఇంకా తక్కువ ధరకు కొనే అవకాశం ఉంది.

తక్కువ బడ్జెట్‌లో 50W హెవీ సౌండ్, పార్టీకి తగిన ఆర్జీబీ లైట్లు , పోర్టబుల్ డిజైన్ కోరుకునే వారికి ఈ మోడల్ ఒక అద్భుతమైన ఛాయిస్ అని చెప్పొచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే స్పీకర్ ఆర్డర్ చేసేయండి.

Related News

విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాది..’రోహిణి ఇంజనీరింగ్ కాలేజ్’ ప్రత్యేకతలివే!

బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌వాచ్ కావాలా? శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ 9 ఫీచర్లు ఇవే!

గూగుల్‌లో ఈ విషయాలను అసలు వెతకొద్దు..సెర్చ్ చేస్తే నేరుగా జైలుకే!

110 ఇంచుల భారీ స్క్రీన్.. 6,000 నిట్స్ బ్రైట్‌నెస్.. హువావే కొత్త టీవీలు వచ్చేశాయ్!

చలికాలంలో వేడి నీళ్ల కోసం ఏ గీజర్ కొనాలి? గ్యాస్ Vs ఎలక్ట్రిక్ పూర్తి గైడ్!

వైర్డ్ vs వైర్‌లెస్ పవర్ బ్యాంక్.. ఈ రెండింటిలో ఏది ఎక్కువ కాలం మన్నుతుంది?

ఫ్రిజ్ క్లీనింగ్ కష్టమా? ఈ అల్యూమినియం ఫాయిల్ ట్రిక్‌తో మీ పని ఈజీ!

Big Stories

Advertisement
×