Big Tv Kissik Talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో కిస్సిక్ టాక్స్ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సొంతం చేస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి వారం సెలబ్రెటీలు పాల్గొంటూ వారి కెరియర్ కి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ వారం ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సినీనటి సురేఖ వాణి(Surekha Vani) కుమార్తె సుప్రీత హాజరయ్యారు.
ఈ నేపథ్యంలోనే సుప్రీత సురేఖ వాణి గురించి పలు విషయాలు తెలిపారు. ముఖ్యంగా ఆమె ఇటీవల కాలంలో సినిమాలలో నటించకపోవడం గురించి మాట్లాడారు. యాంకర్ వర్ష ఈ విషయం గురించి ప్రశ్నిస్తూ… అమ్మగారు ఇండస్ట్రీకి దూరం అవడానికి కారణం ఏంటి అంటూ అడగడంతో అమ్మ ఇండస్ట్రీకి దూరమయ్యారనడం కంటే కూడా అవకాశాలు రాలేదని చెప్పడం కరెక్ట్ అని సుప్రీత(Supritha) తెలిపారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో తన అమ్మకు అవకాశాలు లేకపోవడం వల్లే ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉన్నట్లు తెలియజేశారు.
ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సురేఖవానికి అవకాశాలు లేకపోవడానికి కారణం గురించి కూడా మాట్లాడుతూ.. బహుశా సినిమాలలో ఓల్డ్ ఫేస్ ఎందుకని భావించారేమో అందుకే తనకు అవకాశాలు రాలేదంటూ సుప్రీత అసలు కారణాన్ని తెలిపారు. ఇక ప్రస్తుతం సురేఖవానికి సినిమా అవకాశాలు లేకపోవడంతో ఈమె కూడా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన వీడియోలు ఫోటోల ద్వారా అభిమానులను ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. ఇక సురేఖ వాణి ఇండస్ట్రీకి దూరం కావడంతో తన కుమార్తె సుప్రీత ఇండస్ట్రీలోకి వచ్చారు. ఈమె పలు సినిమాలలో నటించిన కూడా పెద్దగా సక్సెస్ రాలేదు. ఈ నేపథ్యంలోనే సుప్రీత బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.
సురేఖ వాణికి అవకాశాలు లేకపోవడం వల్లే ఇండస్ట్రీకి దూరమయ్యారని సుప్రీత తెలియచేయడంతో ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. ఒకానొక సమయంలో ఏదైనా సినిమాలో అక్క వదిన పాత్రలు అంటే టక్కున గుర్తుకు వచ్చే నటి సురేఖ వాణి. వందల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అక్క, పిన్ని, వదిన పాత్రలలో నటించి మెప్పించిన ఈమెకు ప్రస్తుతం అవకాశాలు లేకపోవడం అనేది బాధాకరం అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరూ సినిమాలలో కూడా నటించిన సంగతి తెలిసిందే.