Bigg Boss 10 Krishnudu:సోషల్ మీడియాలో ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ కాబోతున్నారు అని వార్తలు వచ్చాయి అంటే.. కచ్చితంగా అది నిజమనే చెప్పాలి. గతవారం చైత్ర, ఎలా అయితే ఎలిమినేట్ అయ్యారో.. ఈవారం కూడా కృష్ణుడు అదే తరహాలో ఎలిమినేట్ అవ్వడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 10 లో ఆదివారం నాటి ఎపిసోడ్లో రెండవ వారంలో భాగంగా రెండవ కంటెస్టెంట్గా కృష్ణుడు (Krishnudu) ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. ఆఖరి రౌండ్ లో సృష్టి, కృష్ణుడు మాత్రమే ఉండగా వీరిద్దరిలో కృష్ణుడు ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.
ఇకపోతే ఎలిమినేట్ అయ్యాక కృష్ణుడు హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. “మీరు అన్నట్టుగానే నేను సరిగ్గా హౌస్ లో ఆడలేకపోయాను. ఒప్పుకుంటాను. దానికి నాకేం బాధ లేదు. చాలా సంతోషంగా కూడా ఉన్నాను” అంటూ కృష్ణుడు చెప్పుకొచ్చాడు. అయితే తొలి వారంలోనే కృష్ణుడుతో గొడవపడిన రోహిత్ మాత్రం కృష్ణుడు వెళ్లిపోతుంటే కన్నీళ్లు పెట్టుకున్నాడు. మీ కళ్ళు మా నాన్నగారి కళ్ళలాగే ఉంటాయి అంటూ ఏడవడంతో అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కృష్ణుడు కూడా స్పందిస్తూ.. “కోపంలో కంట్రోల్ చేసుకోలేకపోయాను . మిమ్మల్ని నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను.. నన్ను క్షమించండి” అని చెప్పాడు. త్రిగుణ్ కూడా కృష్ణుడిని పట్టుకొని ఏడ్చేసాడు.
also read:సుధీర్ పై సృష్టి ఫైర్.. మరీ అంత ఫ్లర్ట్ చేశాడా?
ఇక స్టేజ్ పైకి రాగానే కృష్ణుడు బిగ్ బాస్ అనుభవం పై స్పందిస్తూ డిఫరెంట్ మెంటాలిటీలు ఉన్న వ్యక్తులతో ఉండడం వల్ల లైఫ్ ఏంటో అర్థం అయింది అని చెప్పాడు. అలాగే కృష్ణుడు మాట్లాడుతూ..” నేను రోజుకు 10 కేజీల స్వీట్లు తింటాను. ఆ అలవాటు నాకుంది . అయితే గత ఎనిమిది రోజులుగా స్వీట్లు, షుగర్ తినడం పూర్తిగా మానేయడం వల్ల నా శరీరం పూర్తిగా నీరసించింది. ఉన్నట్టుండి షుగర్ ఒక్కసారిగా బంద్ చేయడం వల్ల హెల్త్ రివర్స్ అయ్యి , గేమ్ పై ప్రభావం చూపించింది” అంటూ తాను గేమ్లో సరిగ్గా ఆడక పోవడం వెనుక అసలు కారణాన్ని తెలిపారు.. ఇక నాగార్జున మాట్లాడుతూ బయటకు వెళ్లాక రెండు నెలలు మెల్లమెల్లగా పంచదార వాడకం తగ్గించండి అని కృష్ణుడికి చెబుతూ వీడ్కోలు పలికారు. మొత్తానికైతే ఆదివారం ఎపిసోడ్ లో కృష్ణుడు ఎలిమినేట్ అయినా, ఆయన ఎలిమినేషన్ పై కంటెస్టెంట్స్ కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం.
ఆ తర్వాత కృష్ణుడు జర్నీ వీడియోని నాగార్జున చూపించారు. తర్వాత నాగార్జున ఆదేశాల మేరకు కృష్ణుడు ఇంట్లో వాళ్లలో నలుగురు పాజిటివ్, నలుగురు నెగిటివ్ కంటెస్టెంట్లను వర్గీకరించారు. దేబ్జానీ ,ఝాన్సీ, సృష్టి , అమన్ పాజిటివ్ అని, సుధీర్, ముఖేష్, వర్షిని, చరణ్ నెగటివ్ అని అన్నారు. ఇక నెగిటివ్ అని ఎందుకు అన్నారో కూడా వివరణ ఇచ్చారు. గేమ్లో మనస్పూర్తిగా లేరు. విష్ చేసినా హాఫ్ స్మైల్ మాత్రమే ఇచ్చారు అంటూ తెలిపారు.