E-Paper
Advertisement

మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు భర్త పట్ల అంకిత భావంతో ఉంటారు

మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు భర్త పట్ల అంకిత భావంతో ఉంటారు
Advertisement

Numerology| ప్రేమ విషయంలో ప్రతి ఒక్కరి ఆలోచనలు ఒకేలా ఉండవు. కొందరు స్వేచ్ఛకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. మరికొందరు భావోద్వేగ అనుబంధాన్ని కోరుకుంటారు. న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీ ఆధారంగా కొన్ని వ్యక్తిత్వ లక్షణాలను అంచనా వేస్తారు. అందులో ఒక ప్రత్యేక మూల అంకం.. భావోద్వేగాలు, సున్నితత్వంతో అనుసంధానిస్తారు. అందుకే ఈ మూల అంకం ఉన్న అమ్మాయిలు ప్రేమలో నమ్మకం, నిజాయితీ, అనుబంధానికి ఎక్కువ విలువ ఇస్తారని న్యూమరాలజీ చెబుతుంది.

మూల అంకం 2.. భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు

న్యూమరాలజీలో మూల అంకం 2ను చంద్రుడితో అనుసంధానిస్తారు. చంద్రుడు.. భావోద్వేగాలు, సున్నితత్వం, ప్రేమకు ప్రతీకగా భావిస్తారు. అందువల్ల మూల అంకం 2 ఉన్న అమ్మాయిలు భావాలను సులభంగా గుర్తిస్తారు. ప్రేమ సంబంధాలను కూడా వారు ఎంతో ముఖ్యంగా భావిస్తారు.

లవ్ రిలేషన్‌లో ఎంతో సీరియస్‌గా ఉంటారు

Advertisement

మూల అంకం 2 అమ్మాయిలు.. ప్రతి సంబంధంలో నిజాయితీగా ఉంటారు. ముఖ్యంగా పెళ్లి తరువాత భర్త సంతోషం కోసం ఏదైనా చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా తోడుగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. భాగస్వామి ప్రవర్తనలో చిన్న మార్పులను కూడా గమనించవచ్చని న్యూమరాలజీ చెబుతుంది.

నమ్మకం, నిజాయితీకి ఎక్కువ విలువ ఇస్తారు

మూల అంకం 2కు ప్రేమలో నమ్మకం ఎంతో ముఖ్యమని న్యూమరాలజీ చెబుతోంది. భాగస్వామి కూడా నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు. నమ్మకం దెబ్బతింటే చాలా బాధపడతారు. రిలేషన్‌లో భద్రత, పరస్పర నమ్మకం ఉంటే ఆ బంధాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తారు.

భాగస్వామి భావాలను అర్థం చేసుకుంటారు

Advertisement

మూల అంకం 2 అమ్మాయిలు ఇతరుల భావాలను గమనించే స్వభావం కలిగి ఉంటారు. భాగస్వామి బాధలో ఉంటే కారణం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. అవసరమైనప్పుడు ఓదారుస్తారు. ఈ లక్షణం ఇద్దరి మధ్య అనుబంధాన్ని పెంచుతుంది.

Also Read: చిన్న వయసులోనే పేరు, గుర్తింపు పొందుతారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి అతిత్వరగా విజయాలు సాధిస్తారు

ఎక్కువ సున్నితత్వం వల్ల సమస్య

ఈ మూల అంకం గల మృదు స్వభావులు. సున్నిత మనస్తత్వం సంబంధాన్ని బలపరుస్తుంది. అదే సమయంలో చిన్న విషయాలు కూడా ఎక్కువగా బాధిస్తాయి. భాగస్వామి మాటలు లేదా ప్రవర్తనను ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది. కొందరు సంబంధాన్ని కాపాడేందుకు ఎంతో త్యాగం చేస్తారు.

Also Read: మీ పార్ట్‌నర్ మిమ్మల్ని ముందులాగా ప్రేమించడం లేదా? నిశ్శబ్దంగా ఈ 5 సంకేతాలతో తెలుసుకోండి

ప్రేమలో వ్యక్తిగత హద్దులను కూడా గౌరవించాలి

ప్రేమలో అంకితభావం మంచిదే. అయితే ఒక హెల్తీ రిలేషన్ కొనసాగించాలంటే పరస్పర గౌరవం, స్పష్టమైన సంభాషణ, వ్యక్తిగత హద్దులు కూడా అవసరం. ప్రేమ కోసం మన అవసరాలను పూర్తిగా మర్చిపోవాల్సిన అవసరం లేదు.

Tags

Related News

ఎంజాయ్ కోసం లవ్ కోరుకుంటున్న యువత.. ఆ ప్రమాదముందని హెచ్చరిస్తున్న నిపుణులు

ఆపిల్ పండు తింటే కడుపులో పురుగుల చనిపోతాయా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

ఆధార్ కార్డ్‌లో మొబైల్ నెంబర్ అప్డేట్ ఇక చాలా ఈజీ.. ఇంటి నుంచి ఇలా చేసేయండి

రోజూ వాడే టవల్‌ను ఎన్ని రోజులకు ఒకసారి ఉతకాలి? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

లవ్ బ్రేకప్.. తొలిప్రేమను మరిచిపోవడం ఎందుకు కష్టంగా ఉంటుంది? సైకాలజీలో దీనికి సమాధానం ఇదే

గుండె ఆరోగ్యం కోసం ఎంతసేపు వ్యాయామం చేయాలి? సరైన విధానం ఇదే

అన్నింటికీ ముందుగానే సిద్ధంగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు రిస్క్ అసలు తీసుకోరు

Big Stories

Advertisement
×