Bigg Boss Krishnudu : తెలుగు బుల్లితెర అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రియాల్టీ షో అంటే టక్కున గుర్తుకు వచ్చేది బిగ్ బాస్. ఇప్పటికే 9 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో రీసెంట్గా పదో సీజన్ కూడా ప్రారంభించింది.. గత కొద్ది రోజులుగా ప్రారంభమైన ఈ సీజను ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకున్నట్టు కనిపించలేదు. గతంతో పోలిస్తే ఇప్పుడు సెలబ్రిటీలను ఎక్కువగా తీసుకున్న సరే సరికొత్త టాస్కులు లేకపోవడంతో జనాలు ఈ సీజన్ పై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని ప్రస్తుతం నమోదైన టిఆర్పి రేటింగ్ అర్థమవుతుంది. కొంతమంది ప్రేక్షకులు మాత్రం తమ అభిమానం నటులను గెలిపించేందుకు బిగ్ బాస్ ని మిస్ అవ్వకుండా చూస్తున్నారు. అయితే ఈ వారం హౌస్ నుంచి సినీ నటుడు కృష్ణుడు బయటకు వచ్చిన విషయం తెలిసిందే.. సరిగ్గా ఆడ లేకపోవడంతో పాటుగా తన మాట తీరు కూడా ఎక్కువగా ఆకట్టుకోలేదని బిగ్ బాస్ అభిమానుల నుంచి వచ్చిన ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న బిగ్ బాస్ తనని ఎలిమినేట్ చేసిన విషయం తెలిసిందే. మరి కృష్ణుడు రెండు వారాలకు గాను ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.. మరి కృష్ణుడు రెండు వారాలకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 10 గురించి రోజుకో వార్త వినిపిస్తూనే ఉంటుంది. ఈసారి కూడా సీరియల్ యాక్టర్స్ని ఎక్కువగా తీసుకున్న యాజమాన్యం టాస్కుల విషయంలో విఫలం అయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ షోలో సినీ నటుడు కృష్ణుడు గతవారం ఎలిమినేట్ అయ్యాడు. తక్కువ ఓటింగ్ నీ నమోదు చేసుకున్న కృష్ణుడు హౌస్ నుంచి బయటికి వచ్చేసిన సంగతి తెలిసిందే. మరి అతను ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అన్నది హాట్ టాపిక్ గా మారింది.. వారానికి రూ.3 లక్షల చొప్పున లెక్కిస్తే రెండు వారాలకు ఆయనకు సుమారు రూ.6 లక్షలు పారితోషికంగా దక్కినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం. ఏది ఏమైనా కూడా కృష్ణుడు మాత్రం బాగానే సంపాదించాడు అని నేటిజెన్లు అభిప్రాయపడుతున్నారు.
బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రతి సీజన్ ఏదో ఒక విమర్శలను అందుకుంటునే వస్తుంది. ఇప్పుడు ప్రారంభమైన సీరియల్ కూడా విమర్శకుల నుంచి నెగిటివ్ కామెంట్స్ ని అందుకుంటూనే ఉంది. ఈసారి హౌస్ లోకి తెలిసిన ముఖాలు రావడంతో ఈ సీజన్ బాగా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ జనాల అభిప్రాయాలకు అందని విధంగా కంటెస్టెంట్లు టాస్కులని పర్ఫామెన్స్ చేయడంతో ఈ సీజన్ ఫెయిల్ అయింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సీజన్ మళ్లీ సక్సెస్ అవ్వాలి అంటే బిగ్ బాస్ ఇంకేదైనా మ్యాజిక్ చేయాల్సిందే. కంటెస్టెంట్ల మధ్య టాస్కులు పెడుతున్నాడు కానీ కంటెంట్ ని క్రియేట్ చేయలేకపోతున్నాడు అని అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ గండం నుంచి గట్టెక్కాలి అంటే సీజన్లో ఇంకేదైనా ఊహించని ట్విస్ట్ జరగాల్సిందే.. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు బిగ్ బాస్ ఇంకా ఎలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తాడు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది..
Also Read : మనోజ్ క్యారక్టర్ అవుట్.. కొత్త యాక్టర్ ఎంట్రీ..