Hidden cost of casual relationships| క్యాజువల్ రిలేషన్‌షిప్ అంటే ఎలాంటి బాధ్యతలు లేకుండా స్వేచ్ఛగా ఉండటం. కేవలం ఎంజాయ్ కోసం లవ్ రిలేషన్ అనిపిస్తుంది. మొదట్లో ఇది చాలా సులభంగానే కనిపిస్తుంది. కానీ ఇద్దరి అంచనాలు మారినప్పుడు పరిస్థితి క్లిష్టంగా మారవచ్చు. భావోద్వేగాలు పెరిగితే మెసేజ్ కోసం ఎదురుచూడటం, ఎదుటివారి ప్రవర్తనను ఆలోచించడం మొదలవుతుంది. అందుకే క్యాజువల్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్లే ముందు మీకు నిజంగా ఏం కావాలో తెలుసుకోవడం ముఖ్యం.
ఒక వ్యక్తి క్యాజువల్ రిలేషన్‌షిప్ మాత్రమే కోరుకోవచ్చు. మరో వ్యక్తి మాత్రం భవిష్యత్తులో ఈ సంబంధం సీరియస్ అవుతుందని ఆశించవచ్చు. ఇద్దరూ తమ అంచనాలను స్పష్టంగా చెప్పకపోతే అయోమయం పెరుగుతుంది. భావోద్వేగ అనుబంధం పెరిగినప్పుడు ఈ పరిస్థితి మరింత కష్టంగా మారుతుంది. ఎదుటివారి మెసేజ్ కోసం తరచుగా ఫోన్ చెక్ చేయడం మొదలవుతుంది. వారు దూరంగా ఉంటే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.
క్యాజువల్ డేటింగ్‌లో ఆకర్షణ, ఉత్సాహం, కొత్త అనుభవాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈ అంశాల కారణంగా మొదట్లో రిలేషన్ చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. అయితే దీర్ఘకాలిక సంబంధాలకు మరికొన్ని లక్షణాలు అవసరం. నమ్మకం, మంచి కమ్యూనికేషన్, దయ, బాధ్యత వంటి లక్షణాలు ముఖ్యమైనవి. అలాగే సమస్యలు వచ్చినప్పుడు వాటిని కలిసి పరిష్కరించే సామర్థ్యం కూడా అవసరం.
కేవలం కెమిస్ట్రీ ఉన్నంత మాత్రాన ఇద్దరూ మంచి భాగస్వాములు అవుతారని చెప్పలేం.
క్యాజువల్ రిలేషన్‌షిప్స్ ప్రతి ఒక్కరి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని చెప్పలేం. ఈ అంశంపై జరిగిన పరిశోధనల్లో కూడా భిన్నమైన ఫలితాలు కనిపించాయి. కొంతమంది క్యాజువల్ రిలేషన్‌షిప్స్‌తో ఎలాంటి పెద్ద ఇబ్బంది లేకుండా సౌకర్యంగా ఉంటారు. మరికొన్ని పరిశోధనలు కొన్ని వ్యక్తులలో ఇలాంటి ప్రవర్తనకు భావోద్వేగ సమస్యలతో సంబంధం ఉన్నట్లు సూచించాయి. అయితే సంబంధం కారణంగానే సమస్యలు ఏర్పడ్డాయని దీని ద్వారా నిరూపించలేం. వ్యక్తిగత పరిస్థితులు, అంచనాలు, అనుబంధం వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయి.
ఒక వ్యక్తి వరుసగా తక్కువ కమిట్‌మెంట్ ఉన్న సంబంధాల్లో ఉండవచ్చు. దీంతో ఆ వ్యక్తి లోతైన భావోద్వేగ అనుబంధం గురించి అవగాహన ఉండదు. అంటే వారు ఇతరుల ఫీలింగ్స్ గురించి పట్టించుకోరు. కాలక్రమంలో ఇలాంటి వారు ఎదుటి వ్యక్తి దగ్గరకావాడానికి ప్రయత్నించినా వీరు మాత్రం తప్పించుకుంటూ దూరమవుతారు. సంబంధంలో చిన్న సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేసే ధోరణి పెరుగుతుంది. దీంతో ఆకర్షణ, ఉత్సాహం, ఆసక్తి తగ్గిపోతుంది. ఫలితంగా ఎదుటి వ్యక్తి డిప్రెషన్ లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది.
Also Read: లవ్ ఫార్ములా.. గణితంతో ప్రేమను అర్థం చేసుకోవచ్చు.. ఆసక్తికర పరిశోధన
క్యాజువల్ రిలేషన్‌షిప్ అంటే తప్పనిసరిగా చెడు అనుభవం అని చెప్పలేం. ఇద్దరికీ ఒకే విధమైన అంచనాలు ఉంటే ఇది సౌకర్యవంతంగా ఉండవచ్చు. ఇద్దరూ తమ కోరికలు, హద్దులు, అంచనాల గురించి స్పష్టంగా మాట్లాడాలి. అలాగే ఎదుటివారి భావోద్వేగ అవసరాలను కూడా గౌరవించాలి.
భావోద్వేగ భద్రత కోరుకునే వ్యక్తికి క్యాజువల్ సంబంధం అసంతృప్తి కలిగించే అవకాశం ఉంది. ఇక్కడ సమస్య క్యాజువల్ డేటింగ్ కాకుండా అంచనాలు తప్పడమే. సంబంధం జీవితాంతం కొనసాగాల్సిన అవసరం లేదు. అయితే ఇద్దరికీ ఆ సంబంధం నుంచి ఏం కావాలో స్పష్టంగా ఉండాలి. మీ ఫీలింగ్స్, ఎదుటి వ్యక్తి నుంచి మీరు ఏం ఆశిస్తున్నారనేది దాచిపెడితే క్యాజువల్ రిలేషన్‌షిప్ కూడా క్రమంగా క్లిష్టంగా మారుతుంది.
Also Read: నెలకు రూ.1 లక్ష సాలరీ.. సాఫ్ట్‌వేర్ జాబ్ కాదని చిన్న బిజినెస్.. నేడు రూ.9 కోట్ల టర్నోవర్