Big TV Kissik Talks:మానస్ నాగులపల్లి (Manas Nagulapalli).. ఈ మధ్యకాలంలో బుల్లితెర సీరియల్స్ చూసేవారికి ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. “బ్రహ్మముడి” సీరియల్ లో హీరోగా.. కావ్య పాత్రకు భర్తగా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. మానస్ నాగులపల్లికి ప్రత్యేకమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇక అలాంటి ఈయన తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్గా నిర్వహిస్తున్న ‘కిస్సిక్ టాక్స్’ అనే కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేశారు. ఈ షోలో తన బాల్యం గురించి తన కెరియర్ గురించి అలాగే తన టాలెంట్ మొత్తం బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు.
చైల్డ్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు నంది అవార్డు గ్రహీత కూడా..
ఇక మానస్ నాగులపల్లి విషయానికి వస్తే.. చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మాస్టర్ రామ్ తేజగా 1990 ఆగస్టు 2న జన్మించిన మానస్.. బాల నటుడిగా నటసింహా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా నటించిన ‘నరసింహనాయుడు’ చిత్రంలో నటించి తన కెరియర్ ను ప్రారంభించారు. ఇకపోతే ఈ సినిమాలో అసాధారణ నటనను కనబరిచినందుకుగానూ మానస్ కి ప్రతిష్టాత్మక నంది అవార్డు కూడా లభించింది. ఆ తర్వాత ‘వీడే’ , ‘అర్జున్’ వంటి చిత్రాలలో కూడా కనిపించారు. అయితే అర్జున్ సినిమాతో మరో అవార్డు కూడా అందుకున్నారు. 2004లో వచ్చిన ఈ సినిమాతో ఉత్తమ బాల నటుడు జాబితాలో స్టార్ మా అవార్డును కూడా దక్కించుకున్నారు. మానస్ విశాఖపట్నంకి చెందిన వారు కాగా.. మానస్ తల్లి పద్మిని నాగులపల్లి. ఈమె డాక్టర్.. అంతేకాదు విద్యావేత్త కూడా.. దక్షిణ భారతదేశంలో బాలలు , మహిళా హక్కుల కార్యకర్తగా కూడా పనిచేశారు. హైదరాబాదులోని సెంట్రల్ బోర్డ్ ఫిలిం సర్టిఫికేషన్లో వైస్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు.. మానస్ తండ్రి మాజీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావడం గమనార్హం.
హీరోగా మానస్ కెరియర్..
ఇకపోతే ఈయన కెరియర్ విషయానికి వస్తే.. 2011లో రవి శర్మ (Ravi Sharma) దర్శకత్వం వహించిన ‘ఝలక్’ అనే సినిమా ద్వారా హీరోగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత 2014లో వచ్చిన ‘గ్రీన్ సిగ్నల్’, 2015లో ‘కాయ్ రాజా కాయ్’ 2018లో ‘ప్రేమికుడు’, ‘సోడా గోలి సోడా’ వంటి అనేక చిత్రాలలో నటించి ఆకట్టుకున్నారు. మానస్ తెలుగులోనే కాకుండా 20023లో ‘ప్యారా కుల్హాద్’ అనే హిందీ చిత్రం ద్వారా బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టారు. ఇక అదే ఏడాది ఓంకార్ హార్రర్ థ్రిల్లర్ ‘మ్యాన్షన్ 24’తో ఓటీటీ అరంగేట్రం కూడా చేశారు. ఇంక 2021లో బిగ్ బాస్ సీజన్ 5(Bigg Boss 5) రియాల్టీ షో ద్వారా ఇటు బిగ్ బాస్ ప్రేమికులను కూడా ఆకట్టుకున్నారు. అంతేకాదు 2021లో వచ్చిన ‘కోయిలమ్మ’ అనే సీరియల్ తో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టారు. ఇక తర్వాత ‘కార్తీకదీపం’ సీరియల్లో డాక్టర్ బాబు పాత్రలో కొద్దిరోజులు నటించిన ఈయన ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ లో కూడా నటిస్తున్నారు.
ALSO READ:Big TV Kissik Talks: పెళ్లయిందో లేదో అప్పుడే గొడవలు.. మానస్ పై నెటిజన్స్ ట్రోల్స్..!