E-Paper
Advertisement

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఇంట్లో భారీ దొంగతనం!

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఇంట్లో భారీ దొంగతనం!
Advertisement

Bigg Boss: బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఇంట్లో దొంగతనం జరిగిన విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఆ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఎవరు? దొంగతనం లో భాగంగా ఎంత డబ్బు బంగారం చోరీ అయింది? అసలు బంగారం, డబ్బు చోరీ అయిందా? లేక మరేదైన వస్తువులు దొంగలించబడ్డాయా ? అంటూ పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఇంట్లో దొంగతనం..

ఆమె ఎవరో కాదు బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న లోపముద్ర రౌత్ (Lopamudra Raut). బిగ్ బాస్ తో పాటూ ఖత్రోన్ కే ఖిలాడీ లో కూడా కనిపించిన ఈమె.. కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటున్న ఈమె.. ముంబై లోని శాంతాక్రూజ్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. అయితే ఆమె ఇంట్లో లేని సమయంలో దొంగతనం జరిగినట్లు సమాచారం. ఈ మేరకు తన ఫ్లాట్లో జూన్ 20 నుంచి జూలై 27 మధ్య తాను బయట ఉన్న సమయంలో నిందితుడు ఇంట్లోకి ప్రవేశించి, నగదు, బంగారు ఆభరణాలు, అలాగే బంగారు బిస్కెట్లు దొంగలించినట్లు పోలీస్ కేసు పెట్టింది . ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానిక క్రైమ్ బ్రాంచ్ సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి.. నిందితుడు కోసం గాలించగా.. ఇంటి పరిసరాలలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి, అనుమానితుడి కదలికలను గుర్తించారు.

భారీ నగదుతో పాటు బంగారు ఆభరణాలు, బంగారు బిస్కెట్లు..

Advertisement

ఈ కేసులో 26 ఏళ్ల చందన్ కమలేష్ ముఖియా పేరు బయటపడింది. ఇతని ఆచూకీ బీహార్ లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకొని ముంబైకి తీసుకొచ్చి విచారణ కొనసాగిస్తున్నారు. ఇకపోతే నిందితుడిని ప్రశ్నించిన పోలీసులు అతడి నుండి రూ.76 లక్షల విలువైన దొంగ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నగదు, బంగారు ఆభరణాలు, బంగారు బిస్కెట్లు ఉన్నట్లు తెలిపారు. అయితేదొంగలించిన మొత్తం సొత్తు ఇంకా రికవరీ కాలేదని, మిగిలిన సొత్తు కోసం దర్యాప్తు కొనసాగుతోందని సమాచారం.

ALSO READ:ప్రియాంక చోప్రా స్పెషల్ ఫోటో.. మహేష్ బాబు పెట్టుకున్న క్యాప్ ధర ఎంతంటే?

దొంగ అతి తెలివికి పోలీసులు షాక్..

Advertisement

ఇకపోతే ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే.. దొంగతనం చేసిన ఆ దొంగ డబ్బును తన సోదరి పేరు మీద భూమి కొనుగోలు చేయడానికి ఉపయోగించాలని ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ డబ్బులు, బంగారు సొత్తును ఎక్కడికి తరలించాడు అనే కోణంలో కూడా అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో అధికారుల విచారణలో భాగంగా ఈ దొంగ వెనుక ఇంకెవరైనా ఉన్నారా? లేక ఒంటరిగానే ఇతడు ఈ నేరానికి పాల్పడ్డారా? అనే విషయాలపై కూడా దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే 76 లక్షల విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు మిగతా సొత్తు స్వాధీనం చేసుకోవడానికి దర్యాప్తును వేగవంతం చేశారు.

Related News

ఫైమా, యాదమరాజు మధ్య బాంగిల్స్ గోల.. నవ్వులే నవ్వులు!

సోనియానే నా హీరో అన్న యష్.. ఎందుకో తెలుసా?

సనాతన ధర్మంపై ఫైమా ఏమందో తెలుసా.. ఫ్యామిలీ రియాక్షన్ కూడా ఇదే!

యాదమరాజుతో ఫస్ట్ టైమ్ థియేటర్‌కు వెళ్లిన స్టెల్లా.. అక్కడ ఏం జరిగిందంటే?

ఫైమా బెటరా? వర్ష బెటరా?.. సమాధానం విని అంతా నవ్వాల్సిందే!

సింగిల్‌గా ఉండటమే బెస్ట్ అంటున్న వర్ష.. విష్ణుప్రియ కౌంటర్ అదుర్స్!

రూ.15 లక్షలకే ఎందుకు టెంప్ట్ అయ్యావు.. మిథిలేష్ కు ఇచ్చిపడేసిన శివాజీ!

బషీర్ మాస్టర్ ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Big Stories

Advertisement
×