E-Paper
Advertisement

ప్రియాంక చోప్రా స్పెషల్ ఫోటో.. మహేష్ బాబు పెట్టుకున్న క్యాప్ ధర ఎంతంటే?

ప్రియాంక చోప్రా స్పెషల్ ఫోటో.. మహేష్ బాబు పెట్టుకున్న క్యాప్ ధర ఎంతంటే?
Advertisement

Mahesh Babu: సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు పైకి సింపుల్ గా కనిపించినా వారు ఉపయోగించే వస్తువుల ఖరీదు తెలిస్తే మాత్రం ఆశ్చర్యం వేయక మానదు.. ముఖ్యంగా మహేష్ బాబు (Mahesh Babu) లాంటి స్టార్ సెలబ్రిటీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన సింపుల్గా కనిపించినా.. పెట్టుకునే వాచ్ నుండి కాలికి తొడిగే చెప్పుల వరకు ప్రతిదీ కూడా కాస్ట్లీనే.. అందుకే ఆయన ధరించే వస్తువులు కూడా ఒక్కొక్కసారి అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆయన పెట్టుకున్న క్యాప్ ధర అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

అందరి దృష్టి మహేష్ బాబు క్యాప్ పైనే..

ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా వారణాసి (Varanasi ) సినిమా షూటింగ్ సెట్ నుండి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) మహేష్ బాబుతో కలిసి దిగిన ఒక ఫోటోని షేర్ చేస్తూ.. స్పెషల్ విషెస్ తెలియజేశారు. ఇందులో మహేష్ బాబు చాలా సింపుల్గా కనిపించారు. బ్రౌన్ కలర్ క్యాప్ పెట్టుకొని తన సింపుల్ లుక్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.. దీంతో అందరి దృష్టి ఆయన ధరించిన క్యాప్ పైనే పడింది. దీంతో ఆ క్యాప్ ధర ఎంత? ఏ బ్రాండ్ కి చెందింది? అంటూ అందరూ గూగుల్ లో వెతికేయగా.. దీని అసలు ధర తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి మహేష్ బాబు ధరించిన ఆ క్యాప్ ధర ఎంత? అది ఏ బ్రాండ్ కు చెందింది? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

ALSO READ:సుధీర్ పై మండిపడ్డ హీరో శ్రీకాంత్..ఈ ట్విస్ట్ ఏంటి బాస్!

ధర ప్రత్యేకతలు తెలిస్తే షాక్..

మహేష్ బాబు ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ జెగ్నాకి చెందిన ఒయాసి కాశ్మీర్ బేస్ బాల్ క్యాప్. ఫార్ ఫెచ్ వెబ్సైటులో దీని ధర సుమారుగా 80 వేల రూపాయల వరకు ఉంది. 100% అసలైన కాశ్మీర్ కాటన్ తో ఇటలీలో తయారైన ఈ క్యాప్ డిజైన్ ఎంతో రాయల్ గా కూడా ఉంటుంది.అలా మొత్తానికైతే మహేష్ బాబు ధరించిన క్యాప్ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.

మహేష్ బాబు సినిమాలు..

Advertisement

మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మహేష్ బాబు ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వారణాసి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూడగా.. నిరాశ తప్ప ఇంకేం మిగల్లేదు అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. పైగా వారణాసి సినిమా నుండి మహేష్ బాబు పుట్టినరోజుకైనా ఏదైనా అప్డేట్ వస్తుందని అభిమానులు ఎదురు చూడగా.. కేవలం మహేష్ బాబు ఫోటోతో మాత్రమే రాజమౌళి సరిపెట్టారు. ఇందులో మహేష్ బాబు ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. ప్రియాంక చోప్రా హీరోయిన్గా మందాకిని పాత్రతో ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యింది. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్ర పోషిస్తున్నారు.

Related News

చచ్చిపోతామని డ్రామా ఆడారు.. పూరి, ఛార్మి లీలలు బయటపెట్టిన ప్రొడ్యూసర్!

బూతులు తిడుతూ..చచ్చిపో అంటూ శాపాలు… రేణు దేశాయ్ ఎమోషనల్!

‘ముంజ్యా’ బ్యూటీ శర్వరీకి క్రేజీ అవార్డ్… ఆమె చేసిన సినిమాల లిస్ట్ ఇదే!

ప్రమోషన్లలో రణబాలి సరికొత్త స్ట్రాటజీ.. సినిమాకు ప్లస్ అయ్యేనా?

ఆదర్శ కుటుంబం నుంచి ‘నారాయణమ్మ’ ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్

వెంకటేష్ అంటే త్రివిక్రమ్ కు అంత భయమా.. ఎందుకో తెలుసా?

అమ్మ హీరోయినే..కూతురు హీరోయినే..ఇండస్ట్రీలో తల్లీకూతుర్ల హవా!

రూ.200 కోట్లు సాధ్యమేనా..? ‘ప్యారడైజ్’కి అసలు పరీక్ష ఇప్పుడే!

Big Stories

Advertisement
×