E-Paper
Advertisement

రిటైర్ అయ్యాక ఇంట్లో నరకం చూపించాడు… కోడలు ఇచ్చిన ట్రీట్‌మెంట్ చూస్తే నవ్వాపుకోలేరు

రిటైర్ అయ్యాక ఇంట్లో నరకం చూపించాడు… కోడలు ఇచ్చిన ట్రీట్‌మెంట్ చూస్తే నవ్వాపుకోలేరు
Advertisement

Telugu Family Drama on OTT: కుటుంబంలో పెద్ద మనిషి మాటకు అందరూ విలువ ఇవ్వడం సహజమే. కానీ ఆ అధికారం కాస్తా పెత్తనంగా మారితే ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి ? ప్రతి చిన్న విషయానికి భార్యను, కోడలిని మందలిస్తూ, తన మాటే ఇంట్లో చెల్లాలని భావించే ఓ పెద్దాయనకు రిటైర్మెంట్ తర్వాత ఊహించని పరిస్థితి ఎదురైతే ఎలా ఉంటుంది ? ఇలాంటి ఆసక్తికరమైన పాయింట్‌తో తెరకెక్కిన సరికొత్త తెలుగు ఫ్యామిలీ కామెడీ డ్రామా ‘సరి కొత్తగా’ (Sarikothaga). కుటుంబ విలువలు, అత్తాకోడళ్ల అనుబంధం, ఇంట్లో పెద్దల ప్రవర్తన, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనుషుల్లో వచ్చే మార్పులను కామెడీగా చూపించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? ఈ తెలుగు సినిమా స్టోరీ ఏంటి ? అన్నది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

రామరాజు అనే వ్యక్తి ఈ కథలో ఇంటి పెద్ద. ఉద్యోగంలో ఉన్న సమయంలో ఆయనకు క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. కానీ ఆ క్రమశిక్షణ కాస్తా ఇంట్లోని వాళ్లకు ఇబ్బంది కలిగించేంతగా మారిపోతుంది. భార్య ఏదైనా చిన్న విషయం మర్చిపోయినా, కోడలు సమయానికి కాఫీ ఇవ్వకపోయినా, ఇంట్లో పేస్ట్ అయిపోయినా ఆయనకు కోపం వచ్చేస్తుంది. ప్రతి విషయాన్నీ తప్పుబడుతూ, ఇంట్లో తన మాటే వినాలని భావిస్తూ భార్య, కోడలిపై అధికారం చెలాయిస్తుంటాడు.

Advertisement

రామరాజు ఉద్యోగంలో ఉన్నంతకాలం కుటుంబ సభ్యులు కూడా ఆయన మాటలను పెద్దగా ఎదిరించకుండా భరిస్తుంటారు. కానీ ఆయన జీవితంలో రిటైర్మెంట్ అనే కొత్త దశ మొదలైన తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఉద్యోగం లేకపోవడంతో ఇంట్లోనే ఎక్కువ సమయం గడపాల్సి వస్తుంది. ఇంతకాలం బయట ఉద్యోగ బాధ్యతల్లో బిజీగా ఉన్న ఆయనకు ఇప్పుడు ఇంటి జీవితాన్ని దగ్గరగా గమనించే పరిస్థితి వస్తుంది.

అదే సమయంలో రామరాజు ప్రవర్తనతో ఇబ్బంది పడుతున్న అత్తాకోడళ్లు ఇద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. నేరుగా గొడవ పడకుండా, అతనికి ఒక గుణపాఠం చెప్పాలని భావిస్తారు. అందుకోసం ఇద్దరూ కలిసి ఒక సున్నితమైన మాస్టర్ ప్లాన్ వేస్తారు. అయితే ఆ ప్లాన్ ఏంటి? రామరాజుకు తెలియకుండా అత్తాకోడళ్లు వేసిన ఈ ఎత్తు చివరకు ఎలాంటి పరిణామాలకు దారితీసింది ? అనేది సినిమాలో చూసి ఎంజాయ్ చేయాల్సిన అసలైన కథ.

Advertisement

రిటైర్మెంట్ తర్వాత ఇంట్లో పరిస్థితులు మారడంతో రామరాజు కూడా క్రమంగా తన ప్రవర్తనను, కుటుంబ సభ్యులతో తనకున్న బంధాలను మరో కోణంలో చూసుకోవాల్సి వస్తుంది. ఇంతకాలం తాను చేస్తున్న చిన్నచిన్న పనుల వల్ల ఇంట్లో వాళ్లు ఎంత ఇబ్బంది పడ్డారో ఆయనకు అర్థమవుతుందా ? భార్య, కోడలిని కేవలం తన మాట వినాల్సిన వ్యక్తులుగా కాకుండా కుటుంబ సభ్యులుగా చూడటం మొదలుపెడతాడా ? అనే అంశాలను సినిమాలో సరదాగా చూపించారు.

తెలుగులోనే అందుబాటులో

ఈ సినిమాలో శుభలేఖ సుధాకర్ రామరాజు పాత్రలో కనిపించగా, రాజ్‌శ్రీ నాయర్, భ్రమరాంబిక, అన్విత్, బేబీ సుకృతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. వర ముళ్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వర్మ డ్రీమ్ క్రియేషన్స్, సుచేత డ్రీమ్‌వర్క్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రాఘవేంద్ర వర్మ, రామ్ విశ్వాస్ హన్నూర్కర్ నిర్మించారు.

‘సరి కొత్తగా’ ప్రస్తుతం ETV Winలో ‘కథాసుధ’ సిరీస్‌లో భాగంగా స్ట్రీమింగ్ అవుతోంది. 2026 ఆగస్ట్ 9 నుంచి ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. కుటుంబంతో కలిసి హాయిగా కూర్చొని చూడగలిగే కామెడీతో పాటు, ఇంట్లో మన ప్రవర్తన ఎలా ఉండాలి, బంధాలకు ఎంత విలువ ఇవ్వాలి అనే విషయాన్ని కూడా గుర్తుచేసే కథను చూడాలనుకుంటే ‘సరి కొత్తగా’ను ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు.

Read Also: 16 వేల అడుగుల ఎత్తులో అసాధ్యమైన మిషన్… ప్రాణాలను పణంగా పెట్టిన భారత వాయుసేన వీరుల కథ

Tags

Related News

ప్రేమించినోడికి యాక్సిడెంట్… మరో అబ్బాయితో ప్రియురాలి రొమాన్స్… తెలుగులోనే ఈ పాపులర్ సిరీస్

రాజకీయాల్లో ఎదిగిన రౌడీ… గెలిచిన రాత్రే హత్య.. అసలు చంపిందెవరు?

థియేటర్ ముఖం చూడకుండానే ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్.. హంతకుడెవరో కనిపెట్టగలరా?

This Week OTT Releases : మూవీ లవర్స్ కు జాతరే.. ఓటీటీల్లోకి 22 సినిమాలు..!

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న చెన్నై లవ్ స్టోరీ!

హోర్డింగ్ లోపల వ్యక్తి నివాసం.. నెట్‌ ఫ్లిక్స్ వింత ప్రచారం!

భార్య కోసం దెయ్యంగా మారిన భర్త… గోడలో దాచిన చీటీతో అదిరిపడే ట్విస్ట్

Big Stories

Advertisement
×