E-Paper
Advertisement

Airtel యూజర్లకు షాక్.. రూ. 579, రూ. 859 ప్లాన్లు గుప్‌చుప్‌గా అవుట్.. ప్రత్యామ్నాయాలు ఇవే!

Airtel యూజర్లకు షాక్.. రూ. 579, రూ. 859 ప్లాన్లు గుప్‌చుప్‌గా అవుట్.. ప్రత్యామ్నాయాలు ఇవే!
Advertisement

Airtel Recharge: టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తన యూజర్లకు మరో షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే రూ. 579, రూ. 859 ప్లాన్లను తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఎయిర్ టెల్ యాప్‌ తో సహా.. ఇతర రీఛార్జ్ పోర్టళ్లలో ఈ ప్లాన్లు కనిపించడం లేదని యూజర్లు చెబుతున్నారు. యూపీ తదితర రాష్ట్రాల్లో ఈ ప్లాన్ కనిపించడం లేదని పేర్కొంటారు. ఈ నేపథ్యంలో వాటికి ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉన్న రూ. 619, రూ. 899 ప్లాన్ల వివరాలు, వాటివల్ల బెనిఫిట్స్, రెండింటిలో ఏది బెస్టో ఈ కథనంలో చూద్దాం.

రూ. 619 ప్లాన్ ప్రయోజనాలు

ఈ ప్లాన్ ను ఎయిర్ టెల్ 60 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద రోజూ 1.5 GB డేటాతో పాటు అపరిమిత ఫ్రీ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. అదనపు బెనిఫిట్స్ కింద.. నెలకు రూ. 4,000 విలువైన 12 నెలల ‘అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం’ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందొచ్చు. అలాగే నెలకు ఒక హలో ట్యూన్‌ను సెట్ చేసుకునే వెసులుబాటును ఈ ప్లాన్ ద్వారా ఎయిర్ టెల్ కల్పిస్తోంది.

ఓటీటీ బెనిఫిట్స్..

Advertisement

రూ. 619 ప్లాన్‌లో డేటా, కాలింగ్‌తో పాటు ఓటీటీ వినోదానికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ద్వారా సినిమాలు, షోలు, లైవ్ టీవీ ఛానెళ్లను చూడవచ్చు. ఇందులో సోనీ లివ్, అమెజాన్ MX ప్లేయర్, చనా జోర్, రన్ టీవీ వంటి ప్లాట్‌ఫామ్‌ల కంటెంట్ ను ఫ్రీగా చూడొచ్చు. అయితే ఈ ప్లాన్ కూడా కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

రూ. 899 ప్లాన్ వివరాలు

ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునే వారి కోసం ఎయిర్‌టెల్ రూ. 899 ప్లాన్‌ తీసుకొచ్చింది. 84 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ లో రోజుకు 1.5 GB డేటా యూజర్లకు లభిస్తుంది. ఫ్రీ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు చేసుకోవచ్చు. సాధారణంగా ఈ ధర కలిగిన ప్లాన్లలో ఓటీటీ, అడిషనల్ బెనిఫిట్స్ ను అందరూ ఆశిస్తూ ఉంటారు. కానీ ఈ ప్లాన్‌లో ఎలాంటి ఎక్స్ ట్రా ప్రయోజనాలను ఎయిర్ టెల్ ఆఫర్ చేయకపోవడం గమనార్హం.

Advertisement

Also Read: పవిత్రమైన గోవింద నామాలపై పేరడీలా?.. పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం!

ఏ ప్లాన్ ఎంచుకుంటే బెటర్?

ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కావాలనుకుంటే రూ. 899 ప్లాన్ బెస్ట్. అలా కాకుండా వ్యాలిడిటీ తగ్గినా పర్లేదు.. కాలింగ్, డేటాతో పాటు ఉచిత ఓటీటీ కంటెంట్, అడోబ్ ఎక్స్‌ప్రెస్ వంటి అదనపు ప్రయోజనాలు కావాలనుకుంటే మాత్రం రూ. 619 ప్లాన్ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.

Also Read: వీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్తగా రూ.249, రూ.250 ప్లాన్స్ లాంచ్.. నిజంగా అదిరిపోయాయ్!

Tags

Related News

ఉచిత ఇంటర్నెట్ టీవీకి చెక్? టెలికాం నిబంధనల దిశగా ట్రాయ్ అడుగులు!

వామ్మో.. ఫోన్ అప్‌డేట్ వెనుక ఇంత ప్రాసెస్ ఉందా? కోడింగ్ నుంచి మీ మొబైల్ వరకు ఎలా వస్తుందంటే!

కరెంట్ పోయిన వెంటనే..తప్పకుండా ఆపేయాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్

ఫోన్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం.. ఈ 4 సెట్టింగ్స్ మార్చితే GBల కొద్దీ స్పేస్ ఫ్రీ!

గెలాక్సీ వాచ్‌పై ఆరెంజ్ డాట్ ఎందుకు వస్తుంది? దాని అర్థం ఏంటి?

వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు ఇవ్వరో తెలుసా?

ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేయిస్తున్నారా? బ్లాక్ అండ్ బ్లూ ప్యానెల్స్ మధ్య తేడా ఇదే !

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

Big Stories

Advertisement
×