Rajakumari Dayana: రాజకుమారి దయాన సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఇటీవల బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లడం కోసం అగ్నిపరీక్షకు (Agnipariksha) ఎంపికైన సంగతి తెలిసిందే. ఇలా అగ్నిపరీక్ష కార్యక్రమంలో తన ఆట తీరుతో అందరిని మెప్పించిన ఈమె ఖచ్చితంగా బిగ్ బాస్10 హౌస్ (Bigg Boss 10 House)లోకి అడుగు పెడతారని అందరూ భావించారు కానీ ఊహించని విధంగా ఈమె అగ్ని పరీక్ష నుంచి బయటకు రావాల్సి వచ్చింది. అయితే కచ్చితంగా రాజకుమారి వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి వెళుతుందని అభిమానులు కూడా భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే రాజకుమారి వైల్డ్ కార్డు ఎంట్రీ (Wild Card Entry) గురించి పరోక్షంగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వీడియోలో భాగంగా ఈమె మాట్లాడుతూ తాను అగ్ని పరీక్షలో ఉన్న సమయంలో తూర్పుగోదావరి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా నాకోసం రీల్స్ చేసి నన్ను చాలా సపోర్ట్ చేశారు. కానీ నేను ఆ రీల్స్ కొల్లాబ్స్ అన్ని తీసేయడం జరిగింది. నా ఓటింగ్ లైన్స్ సెప్టెంబర్ 4వ తేదీ క్లోజ్ అవుతాయి. ఆ తర్వాత బిగ్బాస్ హౌస్లో ఉన్న వారికి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవుతాయి. అందుకోసమే వాటిని తొలగించమని చెప్పడంతో తీసేసాను. ఈ విషయాన్ని ముందుగానే అందరికీ చెప్పాలనుకున్నాను కానీ నా ఫోన్ ప్రాబ్లం ఉండడంతో చెప్పలేకపోయాను ఈ విషయంలో తప్పుగా అనుకోవద్దు అంటూ తెలిపారు.
ఇక మీ అందరి సపోర్ట్ ఎప్పుడూ కూడా నాకు ఇలాగే ఉండాలి. తను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం కోసం మరొక అవకాశం రావచ్చు అని నేను భావిస్తున్నాను. అందుకే మీరందరూ నాకు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయండి అంటూ ఈ వీడియో ద్వారా తన అభిమానులను కోరారు.. బిగ్ బాస్ వెళ్లే అవకాశం రావోచ్చేమో అంటూ దయాన ఈ వీడియో ద్వారా తెలియజేయడంతో ఈమె వైల్డ్ కార్డు ఎంట్రీ కన్ఫామ్ అయ్యిందని అందుకే ఇలా ముందుగానే తన అభిమానులకు సపోర్ట్ చేయండి అని కోరుతూ వీడియోలు చేస్తున్నారని అందరూ భావిస్తున్నారు. ఇక ఈమె వైల్డ్ కార్డు ఎంట్రీ విషయంలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.
?stkn=MXNvd2I2eWxweXk0bg%3D%3D
ఇక బిగ్ బాస్ కార్యక్రమం ఒకవారం పూర్తయిన సంగతి తెలిసిందే మొదటి వారమే ఊహించిన విధంగా ఇద్దరు కంటెస్టెంట్లను హౌస్ నుంచి పంపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 16 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగు పెట్టారు. ఇందులో 10 మంది సెలబ్రిటీలు ఉండగా ఆరుగురు కామనర్స్ హౌస్ లోకి వెళ్లారు అయితే సెలబ్రిటీల నుంచి చైత్ర రాయ్, కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా వెళ్లిన చరణ్ కూడా మొదటి వారమే హౌస్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
Also Read: హీరో అజిత్ ను కలిసిన సీఎం విజయ్.. ఫుల్ ఖుషి అవుతున్న ఫ్యాన్స్!