E-Paper
Advertisement

బైక్ లవర్స్ కు పండగే.. 3 నెలల్లో ఎంట్రీ ఇవ్వబోతున్న 10 క్రేజీ టూ వీలర్స్ ఇవే!

బైక్ లవర్స్ కు పండగే.. 3 నెలల్లో ఎంట్రీ ఇవ్వబోతున్న 10 క్రేజీ టూ వీలర్స్ ఇవే!
Advertisement

Upcoming Two-Wheelers in India: 2026 సంవత్సరం ముగింపునకు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఇయర్ ఎండింగ్ లో టూ వీలర్ మార్కెట్ హీటెక్కుతోంది. కొత్త బైకులు, స్కూటర్లతో పాటు ఇప్పటికే ఉన్న మోడళ్లలో అప్‌డేటెడ్ వెర్షన్లు కూడా మార్కెట్లోకి రానున్నాయి. హోండా, రాయల్ ఎన్‌ఫీల్డ్, బజాజ్, హీరో, ట్రయంఫ్, నార్టన్, ఏప్రిలియా లాంటి ప్రముఖ బ్రాండ్లు ఈ లిస్టులో ఉన్నాయి.

ట్రయంఫ్ బోన్నెవిల్ 400

ట్రయంఫ్ నుంచి రాబోతున్న బోన్నెవిల్ 400 ఇప్పటికే పలుమార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఇది 400cc విభాగంలో కంపెనీ లైనప్‌ను మరింత విస్తరించనుంది. రెట్రో డిజైన్‌కు ఆధునిక ఫీచర్లను జోడించే అవకాశం ఉంది. క్లాసిక్ లుక్‌తో రోజువారీ వినియోగానికి సరిపోయే బైక్ కోరుకునేవారిని అనుకూలంగా ఉంటుంది.

బజాజ్ పల్సర్‌లో మరిన్ని అప్‌డేట్లు!

Advertisement

పల్సర్ బ్రాండ్ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బజాజ్ ఈ ఏడాది పలు కొత్త మోడళ్లను, అప్‌డేట్లను తీసుకొస్తోంది. పల్సర్ 125, పల్సర్ 150, N160 S వంటి మోడళ్ల తర్వాత కూడా మరికొన్ని వెర్షన్లు విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

హీరో ఎక్స్‌ ట్రీమ్ సిరీస్

హీరో మోటోకార్ప్ కూడా ఎక్స్‌ట్రీమ్ లైనప్‌ను మరింత ఆధునికంగా మార్చేందుకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 2న కంపెనీ నిర్వహించనున్న రైడ్ కార్యక్రమం సందర్భంగా కొత్త అప్‌డేట్లను వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎక్స్‌ట్రీమ్ 125Rలో TFT డిజిటల్ కన్సోల్‌తో కూడిన వెర్షన్ డీలర్‌షిప్‌లలో కనిపించింది. దీంతో బైక్‌లో టెక్నాలజీ, కనెక్టివిటీ ఫీచర్లు మరింత పెరగొచ్చు.

హోండా నుంచి వరుస మోడళ్లు

Advertisement

హోండా టూ-వీలర్స్ ఈ ఏడాది చివరి నాటికి పలు కొత్త మోడళ్లను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇందులో XR 300 Rally, XR 300L, CB500 వంటి మోటార్‌సైకిళ్లతో పాటు QC3 ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఉంది.

హిమాలయన్ 750

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి వస్తున్న హిమాలయన్ 750 ఈ జాబితాలో అత్యంత ఆసక్తికరమైన మోడళ్లలో ఒకటి. కంపెనీ ఇప్పటి వరకు తీసుకొచ్చిన హిమాలయన్ మోడళ్లలో ఇది పెద్ద ఇంజిన్‌తో రానుంది. ఇందులో కొత్త 750cc ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉండొచ్చని అంచనా. ఇది సుమారు 55PS పవర్, 60Nm టార్క్ అందించే అవకాశం ఉంది. నవంబర్‌లో జరిగే Motoverse కార్యక్రమంలో దీన్ని విడుదల చేసే అవకాశం ఉంది.

నార్టన్ మ్యాంక్స్ R, అట్లాస్

నార్టన్ కూడా భారత మార్కెట్‌పై దృష్టి పెడుతోంది. ముందుగా Manx R విడుదల కానుండగా, ఆ తర్వాత Atlas సిరీస్‌ను తీసుకురావచ్చని తెలుస్తోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ S6

ఫ్లయింగ్ ఫ్లీ S6, ఈ బ్రాండ్‌కి చెందిన స్క్రాంబ్లర్ తరహా మోడల్‌గా రానుంది. స్పోక్డ్ వీల్స్, ఇన్వర్టెడ్ ఫోర్క్, రఫ్ రోడ్లకు అనువైన డిజైన్ దీని ప్రత్యేకతలు. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్‌ను డిసెంబర్‌లో విడుదల చేసే అవకాశం ఉంది.

బజాజ్ ట్రెక్కర్, ఏప్రిలియా SXR 175

బజాజ్ ట్రెక్కర్ కంపెనీ నుంచి ప్రత్యేకంగా రాబోతున్న డ్యూయల్-స్పోర్ట్ బైక్. ఇప్పటికే టెస్టింగ్‌లో కనిపించిన ఈ మోడల్ రఫ్ అండ్ టఫ్ డిజైన్‌తో ఆకట్టుకుంటోంది. దక్షిణ అమెరికా తర్వాత డిసెంబర్ చివర్లో భారత్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక ఏప్రిలియా SXR 175 మ్యాక్సీ-స్టైల్ స్కూటర్‌గా రానుంది. ఇందులో SR 175 నుంచి తీసుకున్న 174.7cc ఇంజిన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. మెరుగైన ట్యూనింగ్‌తో పాటు కనెక్టివిటీ, ఇతర ఆధునిక ఫీచర్లు కూడా లభించవచ్చని తెలుస్తోంది.

Read Also: ఒకటి రెండు కాదు ఒకేసారి 5 కొత్త కార్లు.. టాటా ప్లాన్ చూస్తే మతిపోవాల్సిందే!

Tags

Related News

ఒకటి పెట్రోల్, మరొకటి ఫుల్ ఎలక్ట్రిక్.. హోండా నుంచి 2 కొత్త SUVలు వచ్చేస్తున్నాయి!

JSW కాంబ్యాట్ SUV వచ్చేస్తోంది.. టయోటా ఫార్చ్యూనర్‌ కు ఇక చుక్కలేనా?

టాటా పంచ్ ధరల షాక్.. పెట్రోల్, EV మోడళ్లపై ఏకంగా రూ.20 వేల పెంపు!

ఫాస్టాగ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక బ్యాంక్ మారితే కొత్త ట్యాగ్ అవసరం లేదు!

1980’sలోబాలీవుడ్‌ను ఏలిన 5 కార్లు ఇవే.. హీరోల కంటే ఈ కార్లకే ఎక్కువ క్రేజ్!

ఒకటి రెండు కాదు ఒకేసారి 5 కొత్త కార్లు.. టాటా ప్లాన్ చూస్తే మతిపోవాల్సిందే!

పుతిన్ ఆరస్ vs జిన్‌ పింగ్ హాంగ్‌ కీ L5.. ఎవరి కారు ఎక్కువ పవర్‌ ఫుల్?

Big Stories

Advertisement
×