E-Paper
Advertisement

బిగ్ బాస్ బూతు షో కాదా? మిథిలేష్ రియాక్షన్?

బిగ్ బాస్ బూతు షో కాదా? మిథిలేష్ రియాక్షన్?
Advertisement

Mithilesh Reddy:బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నుండి కేవలం రెండు రోజులకే రూ. 15 లక్షల సూట్ కేస్ ఆఫర్‌‌తో బయటికి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు మిథిలేష్ రెడ్డి. వైల్డ్ కార్డ్‌గా టైటిల్ గెలవడం అసాధ్యమని భావించి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయనకు ఎదురైన “బిగ్ బాస్ అనేది బూతు షో కదా” అనే ప్రశ్నకు మిథిలేష్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌‌గా మారింది. ఆ విశేషాలు ఏంటో చూద్దాం..

మైండ్‌సెట్ మరియు మార్పులు:

ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ అడిగిన ప్రశ్నకు మిథిలేష్ స్పందిస్తూ.. ప్రస్తుతం సమాజంలో జనరేషన్ మారుతోందని, వెస్ట్రన్ కల్చర్ ప్రభావం వల్ల యువత ఆలోచనలు, సంభాషణల్లో వేగంగా మార్పులు వస్తున్నాయని తెలిపారు. ఇక బిగ్ బాస్ షోలో అందరికీ మంచి విలువలు నేర్పిస్తారని తాను చెప్పనని, అది పూర్తిగా ఒక రియాలిటీ షో మాత్రమేనని స్పష్టం చేశారు.

Advertisement

also read:ముఖేష్ కాళ్లు మొక్కిన వర్షిణి.. వీడియో వైరల్!

చూసే విధానంపైనే ఆధారపడి ఉంటుంది:

హౌస్‌‌లో వర్షిణి, ముఖేష్ వంటి కంటెస్టెంట్లు కొంచెం క్లోజ్‌గా ఉన్నారంటే దానిని ఆ కోణంలోనే చూడాలి తప్ప తప్పుగా పట్టించుకోకూడదని అన్నారు. తెలియని ఒక కొత్త హౌస్‌లో పడేసినప్పుడు వాళ్ళు అలాగే ఉంటారని, బాలీవుడ్ బిగ్ బాస్‌కు ఇక్కడికి కొద్దిగా తేడా ఉండవచ్చు కానీ, గతం కంటే షో రూపురేఖలు మారాయని తెలిపారు. ఒక షోని బూతు షోగా చూడాలా లేదా అనేది పూర్తిగా చూసే ప్రేక్షకుల మైండ్‌సెట్ పైనే ఆధారపడి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

కేవలం బిగ్ బాస్ మాత్రమే కాదు:

Advertisement

అలాగే కేవలం బిగ్ బాస్ షో గురించే కాకుండా, సమాజంలో కూడా అన్ని రకాల మార్పులు వేగంగా వస్తున్నాయని మిథిలేష్ పేర్కొన్నారు. ఇక ఏదైనా సరే దానిని ఒక గేమ్ షోగా మాత్రమే చూడాలని, అనవసరంగా భూతద్దంలో పెట్టి చూడటం సరికాదని ఆయన తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీశాయి.

బిగ్ బాస్ షోపై వస్తున్న విమర్శలకు మిథిలేష్ రెడ్డి తనదైన ప్రాక్టికల్ సమాధానంతో అందరి దృష్టిని ఆకర్షించారు. షోలను కేవలం వినోదంగా మాత్రమే చూడాలని, కాలం మారుతున్న కొద్దీ జనరేషన్ ఆలోచనలు కూడా మారుతుంటాయని ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకుల్లో ఆసక్తికరంగా మారాయి..

Related News

ముఖేష్ కాళ్లు మొక్కిన వర్షిణి.. వీడియో వైరల్!

ఒక్కపాటతో గూస్ బంప్స్ తెప్పించేసిన తెలుగు హీరోయిన్..ఏం టాలెంట్ భయ్యా!

అమన్ కెప్టెన్సీని లాగేసుకున్న వర్షిణి?

Nindu Noorella Saavasam Serial Today Episode October 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును మనోహరి చంపేస్తుందా..?   

Gundeninda GudiGantalu Today episode: మీనాకు మరో రికార్డ్.. మీనాకు రింగ్ గిఫ్ట్.. రోహిణికి షాక్…

Intinti Ramayanam Today Episode: పల్లవికి దిమ్మతిరిగే షాక్.. కరిగిపోయిన మీనాక్షి.. పార్వతికి నిజం చెప్తారా..?

Podarillu Today Episode : చక్రీకి మైండ్ బ్లాక్.. గోపికకు నిజం చెప్పిన మహా.. కత్తి పట్టిన నారాయణ.

Big Stories

Advertisement
×