Bigg Boss 10:తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 రోజుకో ట్విస్ట్ తో అభిమానుడికి ఊపిరాడనివ్వకుండా చేస్తోందనే కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అనుకోని వ్యక్తులు ఎలిమినేట్ అవ్వడం.. వైల్డ్ కార్డు ద్వారా ఊహించని కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టడం.. కష్టపడి కెప్టెన్సీ పదవిని దక్కించుకుంటే.. ఆ పదవులను పవర్ పేరిట మరికొంతమంది లాగేసుకోవడం, ఇలా రోజుకో ట్విస్ట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతేకాదు షో ప్రారంభమైన మూడు వారాల్లోనే సూట్ కేస్ ఆఫర్ రావడం, హౌస్ లోకి అడుగుపెట్టిన రెండు రోజుల్లోనే 15 లక్షలు తీసుకొని బయటకు వెళ్లిపోవడం.. ఇలా ఒక్కటేమిటి రోజుకో ట్విస్ట్ షోపై ఆసక్తిని కలిగిస్తోంది.
ఇదంతా ఇలా ఉంటే మరొకవైపు వర్షిణి , ముకేష్ ల మధ్య వ్యవహారం రోజు రోజుకు మితిమీరిపోతోందనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. బిగ్ బాస్ అంటే ఒక రియాలిటీ షో.. దీనిని అందరూ చూస్తారు అనే విషయం కూడా దృష్టిలో లేనంతగా లవర్స్ లా ముఖేష్, వర్షిణిలు ప్రవర్తించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా ఇదంతా షో కోసమే అని కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. మరికొంతమంది ఎంత టిఆర్పి రేటింగ్ కోసమైతే మాత్రం ఇలా హద్దులు మీరాలా అనే కామెంట్లు కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ జంట మరింత హద్దులు దాటిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
also read:‘అనకాపల్లి’ మూవీ రివ్యూ..రా అండ్ రస్టిక్ లవ్ స్టోరీ మెప్పించిందా?
అసలు విషయంలోకి వెళ్తే కెప్టెన్సీ టాస్క్ లో పోరాడి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాల్సిన అమన్.. తనకు లభించిన మ్యాజిక్ కీ ని ఉపయోగించి తనకు దక్కిన పవర్ సహాయంతో అమన్ కెప్టెన్సీని లాగేసుకుంది వర్షిణి. అలా ఇంటికి కొత్త కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన ఈమె.. ఇప్పుడు సడన్గా ముఖేష్ కాళ్లు మొక్కడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఏం జరుగుతోంది ? అంటూ ఆడియన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకు కెప్టెన్ గా అవకాశం లభించడంతో ఏకంగా ముఖేష్ కాళ్ళ మీద పడిపోయింది వర్షిణి..
ముఖేష్ వద్దని వారించినా.. ఇది నా అలవాటు అంటూ ఆమె చేసిన కామెంట్లు కూడా వైరల్ గా మారుతున్నాయి.. ఇప్పటికే మొన్న వీరు చేసిన రొమాన్స్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటే.. ఇప్పుడు ఈ కాళ్ళు మొక్కడాలేంటి? మీరు ఏమైనా భార్యాభర్తలు అనుకుంటున్నారా ? అంటూ ఒక రేంజ్ లో మండిపడుతున్నారు.. ఏది ఏమైనా బిగ్ బాస్ షో టిఆర్పి రేటింగ్ కోసం కంటెస్టెంట్స్ తో ఇలాంటి పనులు చేయించడం ఎంతవరకు కరెక్ట్ అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కంటెస్టెంట్స్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన వర్షిణి , ముఖేష్ ఇద్దరూ హద్దులు మీరుతూ ప్రవర్తించడం ఆగ్రహానికి గురిచేస్తుంది . పైగా వీరిద్దరిపై విపరీతమైన నెగెటివిటీ కూడా ఏర్పడుతోంది.