E-Paper
Advertisement

‘గణేష్ నిమజ్జనం అయ్యింది.. ఇక జ్ఞానేష్ నిమజ్జనమే’.. ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్!

‘గణేష్ నిమజ్జనం అయ్యింది.. ఇక జ్ఞానేష్ నిమజ్జనమే’.. ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్!
Advertisement

Prakash Raj: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న వేళ.. ఈ వివాదంలోకి నటుడు ప్రకాశ్ రాజ్ సైతం ఎంట్రీ ఇచ్చారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘గణేష్ నిమజ్జనం అయ్యింది.. ఇక జ్ఞానేష్ కుమార్ నిమజ్జనం కావాలి’ అని వ్యాఖ్యానించారు. జ్ఞానేష్ తన పదవికి రాజీనామా చేయాలని పట్టుబట్టారు. ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియను తీవ్రంగా తప్పుబట్టారు. అసలు ఎస్ఐఆర్ అంటే తెలుసా అని ప్రశ్నించారు.  ‘ఇది ఓటు హక్కును తీసుకునే ప్రక్రియ కాదు.. ప్రజాస్వామ్యాన్ని చంపేసే ప్రక్రియ’ అని ఘాటుగా విమర్శించారు.

దేశంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో అనేక ప్రశ్నలు ఉన్నాయని నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. తొలగించిన ఓటర్లు.. తెలంగాణాలోనే అత్యధికంగా ఉన్నారని ఆరోపించారు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న స్వాతంత్రాన్ని మళ్లీ కాలరాసే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇది ఏదో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన విషయం కాదన్న ప్రకాశ్ రాజ్.. జాతి ఔన్నత్యానికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు.

Advertisement

Also Read: ప్రియుడితో కూతురు జంప్.. చెప్పు తీసుకొని.. యువకుడి తండ్రిపై యువతి తల్లి దాడి!

14 రాష్ట్రాల్లో సర్ పూర్తైన తర్వాత అసలు కథ బయటపడిందని ప్రకాశ్ రాజ్ అన్నారు. అసలు ఎన్నికలకు 6 నెలల ముందు ఓట్లు తొలగించడమేంటని ప్రశ్నించారు. సర్ ను అడ్డుపెట్టుకొని బెంగాల్లో ఏకంగా ప్రభుత్వాన్ని మార్చేశారని ఆరోపించారు. అసలు సర్ పై ప్రజలకు ఏమాత్రం అవగాహన కల్పించకుండానే ప్రక్రియను ఎలా ప్రారంభిస్తారని మండిపడ్డారు. ప్రతీ పౌరుడికి ఓటు ఉండాలని అంబేద్కర్, నెహ్రూ పోరాడారని గుర్తు చేశారు. ఇప్పుడు ఓటు కోసం మళ్లీ పోరాడాల్సిన పరిస్థితులు తలెత్తాయని చెప్పారు. ఈ సందర్భంగా తన విషయాన్ని ప్రస్తావిస్తూ.. తనకు ఓటు ఉందని ఎలా నిరూపించుకోవాలో చెప్పాలని నిలదీశారు. ఆధార్ చూపిస్తే అది కాదని చెప్పారని.. మరి ఏ పేపర్ చూపించాలని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు.

Advertisement

Also Read: ‘ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించా’.. ఎలాన్ మస్క్ సడెన్ బ్రేకప్‌పై.. శివోన్ జిలిస్ తీవ్ర భావోద్వేగం!

Tags

Related News

వికారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..లోయలో పడిన బస్సు, నలుగురు మృతి

మెట్రోలో మంత్రుల సందడి.. ప్రయాణికులతో మాటామంతి.. ఆర్టీసీ-మెట్రో పాస్‌పై ఆరా!

దిల్‌సుఖ్‌నగర్ ఆలయంపై దాడి.. రేవంత్ సర్కార్‌పై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణలో క్రీడా విప్లవం.. అంతర్జాతీయ స్థాయి శిక్షణకు సర్కార్ ప్లాన్!

ఆంధ్రా వాళ్ల హోటళ్లు కేటీఆర్‌కి ఎలా వచ్చాయి? రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్!

గాంధీ జయంతి వేళ KCR సంచలన కామెంట్స్.. రేవంత్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు

బొల్లారం ఆయుధాల చోరీ కేసులో సంచలనం.. బంగ్లాదేశీలకు అమ్మేందుకే ఏకే-47లు, పిస్టళ్లు!

Big Stories

Advertisement
×