E-Paper
Advertisement

‘ది ప్యారడైజ్ ‘.. కేసీఆర్ రోల్ పై రాహుల్ రామకృష్ణ ట్వీట్!

‘ది ప్యారడైజ్ ‘.. కేసీఆర్ రోల్ పై రాహుల్ రామకృష్ణ ట్వీట్!
Advertisement

Rahul Ramakrishna – Priyadarshi:దసరా సినిమా అందించిన విజయంతో మళ్లీ నాని (Nani), శ్రీకాంత్ ఓదెల (Srikanth odela) కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎట్టకేలకు సెప్టెంబర్ 23న ప్రీమియర్ తో మొదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఏ మాత్రం మెప్పించ లేకపోవడం గమనార్హం. అయితే ఈ సినిమాలోని కొన్ని పాత్రలు మాత్రం ప్రత్యేకంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అందులో భాగంగానే హీరో జడల్ తల్లి పాత్ర పోషించిన సమ్మక్క అలియాస్ సోనాలి కులకర్ణి ఏ విధంగా అయితే ఆడియన్స్ అటెన్షన్ ను గ్రాబ్ చేసిందో.. అదేవిధంగా ఈ సినిమాలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గెటప్ లో నటించిన ప్రియదర్శి కూడా అంతే ఆకట్టుకున్నారు

ప్రియదర్శి నటనపై రామకృష్ణ రామకృష్ణ స్పెషల్ ట్వీట్..

ఈ కేసీఆర్ పాత్ర పై కొంత వరకు నెగెటివిటీ నెలకొన్నా.. చాలామంది సెలెబ్రిటీలు ప్రియదర్శి నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రియదర్శి ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను తలపించేలా వేసిన గెటప్, డైలాగ్ డెలివరీ సినిమాకు మరింత హైలెట్గా నిలిచాయి. ఈ నేపథ్యంలోనే ప్రియదర్శి నటనను అభినందిస్తూ మరో నటుడు రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు. ఈ మేరకు రామకృష్ణ తన ఎక్స్ ఖాతా ద్వారా… “ప్రియదర్శి బాపూ.. ఇచ్చి పడేశినావ్ ” అంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు.

Advertisement

also read:మాల్దీవ్స్ లో నయనతార.. 2 రోజుల బస కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా?

అదిరిపోయే రియాక్షన్ ఇచ్చిన ప్రియదర్శి..

అయితే రాహుల్ రామకృష్ణ పోస్ట్ కు ప్రియదర్శి తనదైన శైలిలో మరింత ఫన్నీగా రిప్లై ఇవ్వడం, అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా కేసీఆర్ గతంలో ఒక ప్రెస్ మీట్ లో వాడిన ఫేమస్ టోన్ గుర్తు చేసేలా..” ఏమయ్యా రాహుల్.. గిదా పద్ధతి? గొర్రెపిల్లని కోసి దావత్ ఇయ్యాలే” అంటూ రిప్లై ఇచ్చాడు. అలా ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ మధ్య సంభాషణ సోషల్ మీడియా వేదికగా మరింత వైరల్ గా మారింది.

ది ప్యారడైజ్ సినిమా స్టోరీ విషయానికి వస్తే..

Advertisement

1980ల కాలం నాటి సికింద్రాబాద్ ప్యారడైజ్ ఏరియా చుట్టూ తిరిగే కథ ఇది. సమాజంలో ఎలాంటి హక్కులు, పౌరసత్వం లేని సంచార (సవారీ) జాతి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆ అణచివేతకు గురైన కమ్యూనిటీ తరఫున పోరాడే కుర్రాడే జడల్ జమానా అలియాస్ ధగడ్ (నాని). ఆ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించే విలన్ల మీద జడల్ ఎలా తిరుగుబాటు చేశాడు? తన జాతి ఆత్మగౌరవం కోసం వ్యవస్థతో ఎలా పోరాడాడు అనేదే ఈ ‘ప్యారడైజ్’ అసలు కథ.

Related News

‘ది ప్యారడైజ్’ సినిమా పై వేణు స్వామి రివ్యూ .. సమస్యలు తెచ్చుకోవద్దంటూ!

నైజాంలో నాని మేనియా..రెండు రోజులకే బ్రేక్ ఈవెన్?

మహేష్ ‘వారణాసి’ పై కార్తికేయ బిగ్ అప్డేట్..గట్టిగనే ప్లాన్ చేస్తున్నారే!

డబ్బింగ్ షూర్ చేసిన ‘ కాకా ‘ .. సంక్రాంతి విడుదలకు సిద్ధం!

తప్పుగా తీసుకోవద్దు.. జర్నలిస్టు నాగేంద్ర వివాదంపై సంపూర్ణేష్ బాబు వివరణ!

అంతా మీ ఇష్టమే.. ‘ది ప్యారెడైజ్’ మూవీకి వస్తున్న రెస్పాన్స్‌పై స్పందించిన నాని

మాల్దీవ్స్ లో నయనతార.. 2 రోజుల బస కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా?

Big Stories

Advertisement
×