E-Paper
Advertisement

నైజాంలో నాని మేనియా..రెండు రోజులకే బ్రేక్ ఈవెన్?

నైజాంలో నాని మేనియా..రెండు రోజులకే బ్రేక్ ఈవెన్?
Advertisement

The Paradise Nizam Collections: నాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం “ది ప్యారడైజ్”(The Paradise). ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ 24వ తేదీ విడుదలైన సంగతి తెలిసిందే. తల్లి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు 88 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి నాని కెరియర్ లోనే అత్యధిక ఓపెనింగ్ రాబడిన సినిమాగా గుర్తింపు పొందింది. ఒకవైపు వర్షాలు మరోవైపు వినాయక నిమజ్జనం జరుగుతున్నప్పటికీ ఈ సినిమాకు మాత్రం భారీ స్థాయిలో ఆదరణ లభిస్తుందని చెప్పాలి.

నైజాం ఏరియాలో బ్రేక్ ఈవెన్ దిశగా..

ఇలా ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూసి చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నైజాం కలెక్షన్లకు సంబంధించి ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఈ సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) వారు 34 కోట్ల రూపాయలకు కైవసం చేసుకున్నారు. అయితే ఈ సినిమా మొదటి రోజే జిఎస్టి లతో కలిపి 15.7 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమా మొదటి రోజే సుమారు 50% కలెక్షన్లను రాబట్టటం విశేషం. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవడం కోసం మరో 18 కోట్ల కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది. అయితే రెండో రోజు కూడా ఈ సినిమాకు భారీ స్థాయిలోనే కలెక్షన్లు వచ్చాయని తెలుస్తోంది.

టైర్ 2 హీరోల విషయంలో రికార్డ్ కలెక్షన్స్..

Advertisement

ఇలా ఈ సినిమా నైజాం ఏరియాలో రెండు మూడు రోజులలోనే బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని చెప్పాలి. స్టార్ హీరోల సినిమాలు బ్రేక్ ఈవెన్ అవడం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటాయి .అలాంటిది టైర్ 2 హీరో అయినా నాని సినిమా కేవలం మూడు రోజులలోనే బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఇది ఇండస్ట్రీలోనే ఆల్ టైం రికార్డ్ అంటూ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి కాసేపట్లో నైజాం సెకండ్ డే కలెక్షన్ కి సంబంధించిన పూర్తి వివరాలు రానున్నాయి. ప్రస్తుతం ప్యారడైజ్ సినిమా దూకుడు చూస్తుంటే ఈ వారాంతంలోనే నైజాం ఏరియాలో లాభాల బాటలో దూసుకుపోతుందని చెప్పాలి.

మొదటి రోజే 88 కోట్ల గ్రాస్ కలెక్షన్స్..

ఇక ఈ సినిమా విడుదలకు ముందు భారీ స్థాయిలో అంచనాలు ఉన్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరుపుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలోనే బ్రేక్ ఈవెంట్ సాధించడం కోసం ఈ సినిమా ఏకంగా 150 కోట్ల క్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజే 88 కోట్ల క్రాస్ వసూళ్లను రాబట్టడంతో చాలా సునాయసంగా నాని టార్గెట్ రీచ్ అవుతారని తెలుస్తోంది. మరి ప్యారడైజ్ సినిమా ద్వారా నాని ఎలాంటి సక్సెస్ అందుకుంటారనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ పై చెరుకూరి సుధాకర్ నిర్మించిన సంగతి తెలిసిందే.

Advertisement

Also Read: మహేష్ ‘వారణాసి’ పై కార్తికేయ బిగ్ అప్డేట్..గట్టిగనే ప్లాన్ చేస్తున్నారే!

Related News

మహేష్ ‘వారణాసి’ పై కార్తికేయ బిగ్ అప్డేట్..గట్టిగనే ప్లాన్ చేస్తున్నారే!

‘ది ప్యారడైజ్ ‘.. కేసీఆర్ రోల్ పై రాహుల్ రామకృష్ణ ట్వీట్!

డబ్బింగ్ షూర్ చేసిన ‘ కాకా ‘ .. సంక్రాంతి విడుదలకు సిద్ధం!

తప్పుగా తీసుకోవద్దు.. జర్నలిస్టు నాగేంద్ర వివాదంపై సంపూర్ణేష్ బాబు వివరణ!

అంతా మీ ఇష్టమే.. ‘ది ప్యారెడైజ్’ మూవీకి వస్తున్న రెస్పాన్స్‌పై స్పందించిన నాని

మాల్దీవ్స్ లో నయనతార.. 2 రోజుల బస కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా?

‘ది ప్యారడైజ్’ చిత్రంలో నాని తల్లిగా నటించింది ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Big Stories

Advertisement
×