Deepfake Images: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తన ఫోటోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫేస్-స్వాప్ టెక్నాలజీ ద్వారా మార్ఫింగ్ చేసి, డీప్‌ఫేక్ చిత్రాలను ప్రచారం చేశారని ఆరోపిస్తూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బాధిత మహిళకు తక్షణమే పోలీసు రక్షణ కల్పించాలని హైకోర్టు సూచించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మెటా అభ్యంతరకరమైన కంటెంట్‌ను తొలగించాలని హైరోర్టు ఆదేశించింది.
CJP నాయకులు సౌరవ్ దాస్, అభిజిత్ దీప్కే, అశుతోష్ రాంకా, రత్న సింగ్ తన అనుమతి లేకుండా తన వ్యక్తిగత ఫోటోను సేకరించి, దానిని పీఎం మోదీ పక్కన ఉన్నట్లుగా అత్యంత అసభ్యకరమైన రీతిలో మార్ఫింగ్ చేశారని బాధితురాలు కోర్టుకు ఆరోపించింది. జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల బ్యానర్లలో కూడా ఈ మార్ఫింగ్ చిత్రాన్ని ప్రదర్శించారని బాధితురాలు పేర్కోంది. ఈ మార్ఫింగ్ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్ల తనకు అత్యాచార బెదిరింపులు, ప్రాణభీతి మరియు తీవ్రమైన మానసిక వేదన ఎదురవుతున్నాయని కోర్టుకు బాధితురాలు తెలిపింది.
ఈ ఘటనపై ఇప్పటికే సమాచార సాంకేతిక చట్టం (IT Act), భారతీయ న్యాయ సంహిత (BNS) కింద FIR నమోదు చేసి ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించింది. FIR నమోదైనప్పటికీ సోషల్ మీడియాలో ఆ కంటెంట్ ఇంకా అందుబాటులో ఉండటాన్ని కోర్టు గమనించింది. బాధితురాలి ప్రాణానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కల్పించాలని హైకోర్టు పోలీసుకు తెలిపింది.
Also read: తెలంగాణ బీజేపీలో మళ్లీ సునీల్ బన్సల్.. ఈసారైనా వ్యూహం ఫలించేనా..?