Suma Adda: సుమా అడ్డా(Suma Adda) ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈటీవీలో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందా ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది సినీ సెలబ్రిటీలు వారి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ కార్యక్రమంలో హాజరవుతూ సందడి చేస్తుంటారు. ఇక జూలై 4వ తేదీ నవీన్ చంద్ర (Naveen Chabdra) హీరోగా నటించిన షో టైమ్ సినిమా(Show Time) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇక ఈ ప్రోమోలో భాగంగా నటుడు నవీన్ చంద్రతో పాటు హీరోయిన్ కామాక్షి భాస్కర్ల, నటుడు రాజా రవీందర్, సురేష్ నలుగురు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.
ఆట పట్టించిన సుమ..
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సుమ ఎప్పటిలాగే వీరందరితో సరదాగా మాట్లాడుతూ వీరి చేత ఆటపాటలు ఆడించారు. అలాగే ఈ సెలబ్రిటీలతో కొన్ని టాస్కులు కూడా చేయించారని తెలుస్తోంది. ఇక సుమ షో అంటే కార్యక్రమంలో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం ఉంటుందని సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా రాపిడ్ ఫెయిర్ సెషన్ లో భాగంగా సెలబ్రిటీలను కొన్ని ప్రశ్నలు వేశారు ఈ క్రమంలోనే నటుడు సురేష్(Suresh) ను పిలిచిన సుమ అతనిని కొన్ని ప్రశ్నలు వేశారు.
రామ్ చరణ్ లాగా పుట్టాలి..
వచ్చే జన్మంటూ మీకుంటే ఏ హీరో లాగా మీరు పుట్టాలి అనుకుంటున్నారు . రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్(ntr) అంటూ రెండు ఆప్షన్లను కూడా ఇచ్చారు. అయితే నరేష్ మాత్రం వెంటనే రాంచరణ్ అని సమాధానం చెప్పడంతో సుమ తనదైన శైలిలోనే సెటైర్లు వేశారు. మీరు ఇలా చెప్పడంతో వెంటనే మళ్ళీ జన్మంటూ ఉంటే రామ్ చరణ్ లాగే పుట్టాలనుకుంటున్నారు ఎన్టీఆర్ లాగా ఎందుకు పుట్టాలనుకోవట్లేదు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తారని, వారు చేసే కామెంట్ల గురించి కూడా సుమ చెప్పడంతో ఒకసారిగా సురేష్ షాక్ అయ్యారు. అనంతరం రాజా రవీందర్ ని కూడా పిలిచి మీరు పని చేసిన ఈ హీరోలలో ఎవరు సరదాగా ఉంటారు అంటూ చిరంజీవి, బాలకృష్ణ పేర్లను చెప్పడంతో రాజా రవీందర్ మాట కూడా మాట్లాడకుండా ఉండిపోయారు.
ఇలా సుమా వీరందరి చేత ఇలాంటి సరదా ప్రశ్నలు వేస్తూ ఆట పట్టించారని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమం ఆదివారం సాయంత్రం 6 గంటలకు పూర్తి ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది. ప్రస్తుతం ఈ ప్రోమో మాత్రం వైరల్ అవుతుంది.. ఇక నవీన్ చంద్ర ఇటీవల కాలంలో ఎన్నో విభిన్న సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. మదన్ దక్షిణామూర్తి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై నా అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా నవీన్ చంద్రకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది. ఇక కామాక్షి ఇటీవల వచ్చిన పొలిమేర సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.
Also Read: Dil Raju on Game Changer: అసలు గేమ్ ఛేంజర్ తో శిరీష్ కి సంబంధమే లేదు… ఆ బాధ్యత నాదే