BigTV English

OTT Movie : ఈ ఊళ్ళో అమ్మాయిలు పుడితే డైరెక్ట్ టికెట్… అయితే అమ్మోరికి లేదా దెయ్యానికి బలి… గుండెల్లో గుబులు పుట్టించే హర్రర్ సీన్స్

OTT Movie : ఈ ఊళ్ళో అమ్మాయిలు పుడితే డైరెక్ట్ టికెట్… అయితే అమ్మోరికి లేదా దెయ్యానికి బలి… గుండెల్లో గుబులు పుట్టించే హర్రర్ సీన్స్

OTT Movie : కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ రీసెంట్ గా థియేటర్లలో అడుగుపెట్టింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ కూడా రాబడుతోంది. తొందర్లోనే ఓటీటీలోకి కూడా అడుగు పెట్టబోతోంది. ఈ స్టోరీ ఒక గ్రామానికి పట్టిన శాపం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘మా’ (Maa). 2025లో విడుదలైన ఈ సినిమాకి విశాల్ ఫురియా దర్శకత్వం వహించారు.ఇందులో కాజోల్, ఖేరిన్ శర్మ, ఇంద్రనీల్ సేన్‌గుప్తా, రోనిత్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ అజయ్ దేవ్‌గణ్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ బ్యానర్‌లో రూపొందింది. ఈ సినిమా 2025 ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైంది. హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ డబ్బింగ్‌లతో నెట్ ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో కి రానుంది.  ఈ సినిమాకి IMDB లో 8.4/10 రేటింగ్ ఉంది.


స్టోరీలోకి వెళితే

అంబికా (కాజోల్) కోల్‌కతాలో తన భర్త శైలేష్ (ఇంద్రనీల్ సేన్‌గుప్తా) కుమార్తె శ్వేత (ఖేరిన్ శర్మ)తో సంతోషకరమైన జీవితం గడుపుతుంటుంది. శైలేష్ చంద్రపూర్ అనే గ్రామం నుండి వచ్చినవాడు. అక్కడ అతని కుటుంబానికి సంబంధించిన ఒక పాత ఇళ్ళు ఉంటుంది. అయితే శైలేష్ ఆ గ్రామంతో సంబంధాలు అంతగా ఉండవు. ఎందుకంటే అక్కడ ఏదో రహస్యం దాగి ఉందని అతను భావిస్తాడు. అయితే  శ్వేత, తన తాత గురించి, గ్రామం గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తుటుంది.

ఒక రోజు శైలేష్‌కు తన తండ్రి మరణ వార్త వస్తుంది. అతను చంద్రపూర్‌కు వెళ్లి, కుటుంబ హవేలీని అమ్మాలని అనుకుంటాడు. అయితే అక్కడికి వెళ్ళాక గ్రామంలో అతను భయంకరమైన శక్తిని ఎదుర్కొంటాడు. కోల్‌కతాకు తిరిగి వస్తున్నప్పుడు ఒక రోడ్డు ప్రమాదంలో మరణిస్తాడు. ఈ ఘటన అంబికా, శ్వేతను దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. కొన్ని నెలల తర్వాత, గ్రామ సర్పంచ్ జోయ్‌దేవ్ సలహాతో, అంబికా, శ్వేత హవేలీని అమ్మడానికి చంద్రపూర్‌కు వెళతారు. చంద్రపూర్ ఒక నిర్మానుష్యమైన వాతావరణంతో ఉంటుంది. వీళ్ళు హవేలీలో ఉండే ఒక పాత ఆలయం గురించి తెలుసుకుంటారు. ఇది కాళీ దేవతకు చెందినదని, ఎప్పటినుంచో దానిని మూసివేయడం జరిగిందని తెలుస్తుంది.

ఈ సమయంలో గ్రామంలో ఒక భయంకరమైన రహస్యం బయటపడుతుంది. రక్తబీజ్ అనే ఒక రాక్షసుడి శాపం గ్రామాన్ని వెంటాడుతోందని తెలసుకుంటారు. పురాణాల ప్రకారం, రక్తబీజ్ ఒక రాక్షసుడు. దీని ఒక్క రక్తపు చుక్క నుండి కొత్త రాక్షసులు జన్మిస్తాయి. అతన్ని మా కాళీ మాత్రమే ఓడించగలదు. ఈ శాపం గ్రామంలో టీనేజ్ బాలికలను లక్ష్యంగా చేసుకుంటుంది. ఇప్పుడు శ్వేత కూడా ఈ శాపం బారిన పడుతుంది. ఆమె ప్రవర్తన వింతగా మారుతుంది. ఆమె శరీరం రాక్షస శక్తి స్వాధీనంలోకి వస్తుంది. అంబికా, తన కుమార్తెను కాపాడుకోవడానికి, గ్రామంలోని ఒక స్థానిక పూజారి సహాయంతో హవేలీలోని మా కాళీ ఆలయాన్ని తిరిగి తెరుస్తుంది. ఆమె పూజలు, ఆచారాల ద్వారా మా కాళీ శక్తిని పొందుతుంది. ఆమె రక్తబీజ్ రాక్షసుడితో ఒక భీకరమైన యుద్ధంలో పాల్గొంటుంది. చివరికి అంబికా ఆ రాక్షసున్ని అంతం చేస్తుందా ? తన కూతుర్ని కాపాడుకుంటుందా ? ఆ గ్రామానికి పట్టిన శాపం పోతుందా ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : కజిన్ తో కాక్టైల్ … ప్రియుడితో పాప్కార్న్… పోలీసోడితో లాలీపాప్… ఈ టీనేజ్ పాప రచ్చ వేరే లెవెల్ బాసూ

Related News

This week OTT Movies : ఈ వారం ఓటీటీలోకి బ్లాక్ బాస్టర్ చిత్రాలు.. ఆ రెండే ఇంట్రెస్టింగ్..

OTT Movie : టాక్సిక్ బాయ్ ఫ్రెండ్, యాటిట్యూడ్ కు బాప్ ఆ అమ్మాయి… రా అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ

OTT Movie : భర్త ఇంట్లో లేడని బాయ్ ఫ్రెండ్ ను పిలిచే భార్య… నెక్స్ట్ బుర్రబద్దలయ్యే ట్విస్ట్… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : రాత్రిపూట భర్త గదిలోకి వెళ్లాలంటేనే భయపడే భార్య… నాలుగురమ్మాయిల అరాచకం… సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : సాఫ్ట్వేర్ జాబ్ పేరుతో అమ్మాయిలతో ఆ పాడు యాపారం… కూతురు కూడా అదే పని… వర్త్ వాచింగ్ మూవీ

OTT Movie : మొదటి రాత్రే పెళ్ళానికి షాక్… భర్తకు మ్యాటర్ వీక్… కడుపుబ్బా నవ్వించే బ్లాక్ కామెడీ మూవీ

OTT Move: ‘అవెంజర్స్’ ను గుర్తుచేసే కొరియన్ సినిమా… చచ్చినోడి బాడీ పార్ట్స్ తో సూపర్ పవర్స్ .. కిరాక్ మూవీ

OTT Move: దుమ్ము దులిపే ఇన్వెస్టిగేషన్… టైం ట్రావెల్ చేసి హత్యలు… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు…

Big Stories

×