BigTV English

Dil Raju – Sirish Reddy : ప్రస్టేషన్.. ప్రస్టేషన్… దిల్ రాజు అసలేం ఏమైంది ?

Dil Raju – Sirish Reddy : ప్రస్టేషన్.. ప్రస్టేషన్… దిల్ రాజు అసలేం ఏమైంది ?

Dil Raju – Sirish Reddy : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు (Dil Raju), ఆయన తమ్ముడు శిరీష్ రెడ్డి (Sirish Reddy) కి అసలు ఏమైందో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా హీరోలపై, తోటి నిర్మాతలపై వీరు చేస్తున్న వ్యాఖ్యలతో వారి అభిమానుల ఆగ్రహానికి గురి అవుతున్నారని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే ..దిల్ రాజు ప్రస్తుతం నితిన్(Nithin ) హీరోగా ‘తమ్ముడు’ సినిమాను నిర్మిస్తున్నారు. జూలై 4వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో భాగంగానే నితిన్ – దిల్ రాజు సరదాగా చిట్ చాట్ సెషన్ నిర్వహించగా.. ఇందులో అల్లు అర్జున్(Allu Arjun), నితిన్ లను కంపేర్ చేస్తూ దిల్ రాజు చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. దీంతో దిల్ రాజు పై నితిన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


నితిన్ ను అవమానించిన దిల్ రాజు..

అసలు విషయంలోకి వెళ్తే.. ఈ చిట్ చాట్ సెషన్ లో భాగంగా.. దిల్ రాజు మాట్లాడుతూ..” 22 ఏళ్లుగా నటుడిగా సుదీర్ఘ ప్రయాణం కొనసాగిస్తున్న నువ్వు.. నాకంటే చిత్ర పరిశ్రమలో ఒక సంవత్సరం సీనియర్ వి కూడా.. నువ్వు 2002లో హీరో అయితే ..నేను 2003లో నిర్మాతను అయ్యాను. నాకెలాగైతే పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే శక్తి వచ్చిందో.. నీకు అలాగే వచ్చింది. అయితే నీ కంటే నేను జూనియర్ నే అయినా.. కెరియర్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ఈ స్థాయికి వచ్చాను. నిన్ను కూడా అలాగే ఊహించుకున్నాను. ఎందుకంటే నేను నీతో ‘దిల్’ తీసేటప్పుడు.. అల్లు అర్జున్ తో ‘ఆర్య’ కూడా తీశాను. ఇద్దరూ ఫ్యూచర్ స్టార్స్ అని భావించాను. కానీ నువ్వు మాత్రం ఆ మార్క్ సాధించలేకపోయావు” అంటూ డైరెక్ట్ గా నితిన్ ముఖానే నువ్వు సక్సెస్ కాలేదు అని దిల్ రాజు చెప్పిన కామెంట్లు ఇప్పుడు నితిన్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.


రామ్ చరణ్, మైత్రి మేకర్స్ పై శిరీష్ రెడ్డి అసహనం..

మరొకవైపు దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని..” ‘గేమ్ ఛేంజర్’ సినిమా డిజాస్టర్ అయితే.. ఈ సినిమా హీరో రామ్ చరణ్ (Ram Charan) కనీసం మాట వరసకు కూడా ఫోన్ చేసి పలకరించలేదని, సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ కూడా తిరిగి ఇవ్వలేదని” రామ్ చరణ్ పై నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఇదే కాదు మైత్రి మూవీ మేకర్స్ పై కూడా నెగిటివ్ కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నాగచైతన్య(Naga Chaitanya)తో ‘సవ్యసాచి’ , నాని(Nani)తో ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలు చేసిన వీరిని నమ్మి.. ఈ సినిమాల హక్కులు మైత్రీ చెప్పిన రేట్ కి తీసుకుంటే.. సవ్యసాచి సినిమాతో రూ.3.5 కోట్లు, గ్యాంగ్ లీడర్ సినిమాతో రూ.1.75 కోట్ల మేర నష్టపోయాము అని, మైత్రి మూవీ మేకర్స్ మోసం చేశారు” అని బహిరంగంగానే శిరీష్ రెడ్డి కామెంట్లు చేశారు.

ఆ హీరోలే లేకుంటే మీ స్థాయి ఏంటి? – మెగా ఫ్యాన్స్

ఇలా ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఇవి కాస్త అభిమానుల వరకు చేరాయి. దీంతో అటు నితిన్ అభిమానులు దిల్ రాజు పై.. ఇటు మెగా, మైత్రి అభిమానులు శిరీష్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ మేరకు వారు ఒక్కొక్కరూ స్పందిస్తూ.. ఇదే హీరోలు లేకపోతే, దిల్ రాజు అండ్ శిరీష్ ఈ బెంజ్, బీఎండబ్యూ కార్లలో తిరిగేవారా? అంత లగ్జరీ హౌస్ లలో ఉండే వారా? ఇంత స్టార్ హోదా వచ్చేదా? ఈ హీరోలతోనే కదా స్టార్ ప్రొడ్యూసర్ అయ్యాడు. డబ్బులు కూడా సంపాదించాడు.శిరీష్ కొడుకును కూడా హీరోను చేశాడు. అంటే దానికి కారణం ఈ హీరోలే కదా. ఈ హీరోలే గనుక లేకపోతే.. గతంలో మీకు ఉన్న ఆటోమొబైల్ షాపే ఉండేది కదా అంటూ మెగా ఫ్యాన్స్ కోపంతో ఊగిపోతున్నారు.

అన్నదమ్ముల ఫ్రస్టేషన్ కి ప్రధాన కారణం ఇదేనా..?

దీనికి తోడు ఇదే దిల్ రాజుపైన మొన్న థియేటర్స్ బంద్ అంటూ ప్రచారం చేశారు అని టాక్ కూడా వచ్చింది. అటు థియేటర్స్ బంద్. ఇటు హీరోలపై ఇలాంటి వ్యాఖ్యలు. మొత్తం దిల్ రాజు అండ్ శిరీష్ ఫుల్ ఫ్రస్టేషన్ లో ఉన్నారు. ఈ ఫ్రస్టేషన్స్ కు కారణం.. పెద్ద హీరోల డేట్స్ లేవు. వచ్చిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. అటు నితిన్ తమ్ముడు మూవీ పైన దిల్ రాజుకే నమ్మకం లేదు. ఆ ఫ్రస్టేషన్ మొత్తం ఇలా ఇంటర్వ్యూల్లో బయటికి వస్తుంది. ఈ కారణంగానే అటు హీరోలనే కాదు… తోటి ప్రొడ్యూసర్లు మైత్రీ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఇప్పటికైనా తప్పు తెలుసుకొని క్షమాపణలు చెబుతారేమో చూడాలి అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.

Related News

War 2 – Ntr: ఎన్టీఆర్ కి ఘోర అవమానం, ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు

Rajinikanth: ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు? రజనీ ను చూసి నేర్చుకోండి – సజ్జనర్

Actor Suman: ఆయన దయతోనే రాజకీయాలలోకి వస్తా.. క్లారిటీ ఇచ్చిన సుమన్!

Ram Pothineni: అడ్డంగా దొరికిపోయిన రామ్ పోతినేని, భాగ్యశ్రీ , జాగ్రత్తలు తీసుకోవాలి

Dharma Mahesh: భార్యను వేధిస్తున్న డ్రింకర్ హీరో, సినిమా అనుకున్నాడా?

Naga Vamsi: అప్పుడు ముంబై నిద్రపోలేదు, ఇప్పుడు నువ్వు పడుకుంటున్నావా అన్న?

Big Stories

×