Nindu Noorella Saavasam Serial Today Episode : మనోహరి కోర్టుకు వెళ్తుంటే.. అమర్ వస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతాడు. ఆశ్రమంలో చిన్న పనుంది అందుకని అక్కడికే వెళ్తున్నాను అని అబద్దం చెప్తుంది మనోహరి. దీంతో అమర్ నేను కూడా అటే వెళ్తున్నాను. కొద్ది సేపు వెయిట్ చేయ్ డ్రాప్ చేసి వెళ్తాను అని చెప్పగానే మనోహరి షాక్ అవుతుంది. అమర్ నీకెందుకులే శ్రమ. నేను వెళ్లిపోతాను అంటుంది. శ్రమ ఏం లేదులే మనోహరి ఆన్ ది వేనే కదా అంటాడు. దీంతో మనోహరి నాకు కారుంది. మధ్యలో కొన్ని జిరాక్సులు తీసుకోవాలి. వార్డెన్ కొన్ని వస్తువులు తీసుకురమ్మన్నారు అవి కొనాలి.. లేటవుతుంది అమర్ నేను వెళ్లిపోతాను. నాకు తెలుసు అమర్ ఆ రోజు జరిగిన దానికి నన్ను నమ్మడం కొంచెం కష్టం అవ్వచ్చని కానీ ఇవాళ నీకు నిజంగా ఇబ్బంది ఎందుకు అంటున్నాను అమర్. నీకు నమ్మడానికి కష్టం అయితే నువ్వే డ్రాప్ చేయ్ నేను వెయిట్ చేస్తాను అంటుంది.
అమర్ సరే మనోహరి వెళ్లు అని చెప్తాడు. ఇంతలో రాథోడ్ వచ్చి సార్ వెహికిల్ రెడీ అంటాడు. సరే రెడీ అయి వస్తాను అంటూ పైకి వెళ్తాడు. బయటకు వెళ్తున్న మనోహరి కంగారుగా వెళ్లి మిస్సమ్మను తగులుతుంది. మనోహరి చేతిలోని ఫైల్ కింద పడుతుంది. దీంతో మనోహరి కోపంగా ఏయ్ కళ్లు నెత్తిన పెట్టుకుని నడుస్తున్నావా..? అంటుంది. దీంతో మిస్సమ్మ నేను చూసుకునే వస్తున్నాను నువ్వు వచ్చి డాష్ ఇచ్చావు. ఆగు నీ కళ్లు నెత్తికి ఎక్కావేమో చూస్తాను అంటూ చూడబోతుంటే.. మనోహరి కోపంగా ఏయ్ కామెడీగా ఉందా..? అంటూ ఫైల్ లో పేపర్స్ తీసుకుంటుంటే.. మిస్సమ్మ ఒక పేపర్ తీసుకుని చూడబోతుంటే.. మనోహరి లాక్కుంటుంది.
ఏంటది అని మిస్సమ్మ అడగ్గానే.. ఏయ్ పొద్దుపొద్దునే నాతో ఆటలాడలాని చూస్తున్నావా..? అంటుంది. దీంతో మిస్సమ్మ ఏంటి పేపర్ చూడబోతే అంతలా కంగారు పడ్డావు ఆ పేపర్‌లో నేను చూడకూడనివి ఏమైనా ఉన్నాయా ఏంటి..? కళ్లలో భయం ముఖంలో ఆ ఎక్స్‌ప్రెషన్ చూస్తుంటే. కచ్చితంగా ఆ పేపర్‌లో ఏదో ఉంది. ఏంటది.. పైగా ఇంత పొద్దున్నే భయటకు వెళ్తున్నావు అంటే మళ్లీ ఎవరిని ముంచడానికి వెళ్తున్నావు అంటూ ప్రశ్నించడంతో మనోహరి కోపంగా ఏయ్ నాకు పని ఉంది కాబట్టి బతికిపోయావు లేదంటే.. అంటూ వెళ్లిపోతుంది. మను ఇంత కంగారు పడటం నేనెప్పుడూ చూడలేదు. ఎందుకు ఇంత టెన్షన్ పడుతుంది అని మనసులో అనుకుంటుంది.
చిత్ర.. అమర్ ఇంటికి వస్తుంది. మనోహరి బయటకు రావడం చూసి మనోహరి పని పడదామని నేను అనుకుంటే.. మనునే ఎక్కడికో వెళ్తుందో.. వెళ్లే స్పీడు చూస్తుంటే.. కచ్చితంగా అది మనకు పనికొచ్చేలా ఉంది. డ్రైవర్ త్వరగా ఆ కారును ఫాలో అవ్వు అంటూ మనోహరి కారును చిత్ర ఫాలో అవుతుంది. కోర్టు దగ్గరకు కరుణ వస్తుంది. పద్మావతి గారు అంటూ లాయర్‌ను పిలిచి నమస్తే మేడం నేను కరుణను ఆర్జే భాగీ ఫ్రెండను మొన్న కలవాలని మీకు కాల్ చేశాను కదా..? అని గుర్తు చేయగానే పద్మావతి అవును చెప్పండి ఎందుకు కలవాలనుకున్నారు అని అడుగుతుంది పద్మావతి. దీంతో కరుణ నా ఫ్రెండ్ భాగీ ఎఫ్‌ఎంలో పెరుగుతున్న డివోర్స్ కేసుల గురించి ఒక ఫ్రొంగ్రాం చేస్తుంది. ఆ టాపిక్ గురించి నాకు పెద్దగా తెలియదు. మీకు అభ్యంతరం లేకపోతే మీ క్లయింట్స్ తో మాట్లాడిస్తే.. మాకు హెల్ప్ అయితది అని చెప్పగానే.. పద్మావతి లంచ్ ముందు గంట ఫ్రీగా ఉంటాను ఇవాళ నాలుగు డివోర్స్ కేసులు ఉన్నాయి. వారితో మాట్లాడిస్తా అంటుంది. దీంతో కరుణ నాలుగు జంటలు ఉన్నాయా..? అయితే మస్త్ కంటెంట్ దొరుకుతది. ఇప్పుడే నా ఫ్రెండ్‌కు కాల్ చేసి చెప్తా.. అది వచ్చాక మిమ్మల్ని కలుస్తాం అంటూ మిస్సమ్మకు ఫోన్ చేసి చెప్తుంది.
మిస్సమ్మ కూడా కోర్టుకు బయలుదేరుతుంది. రణవీర్ కూడా అదే కోర్టుకు వస్తాడు. లాయర్‌ను కలిసి ఇవాళ్టితో పని అయిపోతుంది కదా అని అడుగుతాడు. అయిపోతుంది. కానీ మనోహరి మనం చెప్పినట్టే చెప్తుందా..? అని అడుగుతాడు. చెప్తుంది మనోహరికి మరో దారి లేదు కదా అంటాడు. ఇంతలో మనోహరి కోర్టు దగ్గరకు వస్తుంది. రణవీర్‌ను వెతుక్కుంటూ వెళ్తుంది. వెనకాలే ఫాలో అయిన చిత్ర అనుమానంగా మనోహరికి కోర్టులో ఏం పని అనుకుంటుంది. ఇంతలో మనోహరి వెళ్లి రణవీర్‌ను కలుస్తుంది. చిత్ర షాక్ అవుతుంది. తర్వాత కోర్టు ఆవరణలో ఉన్న రణవీర్, మనోహరి దగ్గరకు లాయర్ వచ్చి నెక్ట్స్ మనదే హియరింగ్ మీరు రెడీగ ఉండండి అని చెప్తాడు. రణవీర్ సరే అంటాడు. ఇద్దరూ మాట్లాడుకుంటుంటే ఇంతలో అమర్, రాథోడ్ ఒక లాయరుతో కలిసి కోర్టుకు వస్తారు. అమర్‌ను చూసిన మనోహరి షాక్ అవుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?