Nindu Noorella Saavasam Serial Today Episode: అందరూ కొడైకెనాల్ రెడీ అవుతుంటారు. అనామిక కూడా బ్యాగు సర్దుకుని హాల్‌లోకి వస్తుంది. అప్పుడే రూంలోచిం బయటకు వచ్చిన మనోహరి, అనామికను కొడైకెనాల్ రావొద్దు అంటుంది. ఆంటీ మీరు చెప్పండి అనామికను అక్కడికి తీసుకెళ్లడం వల్ల ఏమైనా యూస్ ఉందా అని అడుగుతుంది. నిర్మల పలకకుండా ఉండిపోతుంది. దీంతో మనోహరి ఇంకా చూస్తూ నిలబడ్డావేంటి..? బ్యాగు తీసుకుని లోపలికి వెళ్లు.. అమర్ వచ్చాక నువ్వు ఇక్కడ ఉండాలో వద్దో అమర్ తో మాట్లాడి చెప్తాను. అంటూ అరుంధతి నువ్వు నీ గేమ్ ఆడుతూ నన్ను అమర్‌కు దూరం చేద్దాం అనుకున్నావు కదా..? ఇప్పుడు చూడు నేను నిన్ను అమర్‌కు పర్మినెంట్‌గా దూరం చేయబోతున్నాను. అని మనసులో అనుకుంటుంది.
అనామిక అక్కడే నిలబడి చూస్తుంటే.. ఇంకా చూస్తున్నావేంటి..? వెళ్లు అని మనోహరి అనడంతో అనామిక బ్యాగు తీసుకుని లోపలికి వెళ్తుంటే అప్పుడే పై నుంచి అమర్, మిస్సమ్మ వస్తారు. మిస్సమ్మ, అనామికను మళ్లీ దగ్గరకు తీసుకుని వస్తుంది. అనామిక గారు మీరేంటి బ్యాగు తీసుకుని అలా వెళ్లిపోతున్నారు అని మిస్సమ్మ అడగ్గానే.. మనోహరి నేనే వెళ్లిపోమ్మని చెప్పాను. కొడైకెనాల్ లో కేర్‌టేకర్ అవసరం ఏముంటుంది అమర్. అందుకే ఈ అమ్మాయిని కొడైకెనాల్‌కు వద్దని చెప్తున్నాను అనగానే అమర్ కరెక్టుగా చెప్పావు మనోహరి అంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. మిస్సమ్మ ఏవండి అంటూ ఏదో చెప్పబోతుంటే.. అమర్ ఏంటి..? పిల్లలను చూసుకోవడానికి నువ్వు, మనోహరి, రాథోడ్, నేను ఉన్నాము కదా..? మళ్లీ అనామిక ఎందుకు..?
అనామిక స్కూల్ ఉన్నన్నీ రోజులు నువ్వు కష్టపడ్డావు కదా..? పిల్లలకు హాలిడేస్ అయ్యే వరకు నువ్వు రెస్ట్ తీసుకో రిలాక్స్ అవ్వు.. అని అమర్ చెప్పగానే.. అనామిక అంటే సార్ నాకు రెస్ట్ అవసరం లేదు. పిల్లలను చూసుకోవడమే నాకు ఇష్టం అని చెప్పగానే.. అమర్ నువ్వు ఇష్టం అన్నా అది మాకు కష్టంలా అనిపిస్తుంది అనామిక. నువ్వు ఒక కేర్ టేకర్‌గా అయితే కొడైకెనాల్ రానవసరం లేదు. కానీ మా ఫ్యామిలీలో ఒకరిగా అయితే రావొచ్చు అని అమర్ చెప్పగానే.. అనామిక హ్యాపీగా ఫీలవుతుంది. మనోహరి షాక్ అవుతుంది. పిల్లలు, నిర్మల, శివరాం సంతోషిస్తారు. ఇంతలో అమర్ పిల్లలను చూసుకోవడానికి అయితే నువ్వు అక్కడికి రానవసరం లేదు అనామిక. పిల్లలతో కలిసి సరదాగా గడపడానికి రావొచ్చు. అక్కడ నువ్వు ఏ రెస్పాన్స్ బులిటీస్ లేకుండా రిలాక్స్ అవ్వడానికి రావొచ్చు.
అని అమర్ చెప్పగానే అనామిక షాకింగ్‌గా సార్ అంటుంది. ఇంతలో అమర్ అవును అనామిక నా పిల్లలను పరాయివాళ్లు అనుకుని ఉంటే.. నువ్వు ఇంత ప్రేమగా చూసుకునే దానివి కాదు కదా..? నువ్వు మన అనుకున్నప్పుడు మేము కూడా మన అనే కదా అనుకోవాలి. అనగానే.. శివరాం చాలా బాగా చెప్పావు అమర్. ఏమ్మా మనోహరి ఇక అనామిక రావొచ్చు కదా అంటాడు. ఇంతలో నిర్మల సంతోషంగా అనామిక పిల్లలకు హాలిడేస్ అయ్యే వరకు నీకు ఎలా కావాలంటే అలా ఉండు. ఏం చేయాలనిపిస్తే అది చేయ్. ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉండు సరేనా అంటుంది. దీంతో అనామిక సరే ఆంటీ అంటుంది. ఇంతలో రాథోడ్ సరే సరే ఫ్లయిట్ టైం అవుతుంది. పిల్లుల పదండి అనగానే అందరూ ఇంట్లోంచి వెళ్లిపోతారు.
అందరూ కొడైకెనాల్ వెళ్లాక.. అక్కడి వాతావరణం, ఇల్లు చూసి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. ఇంతలో అంజు బాధగా ప్లేస్ ఏం చేంజ్ అవ్వలేదు కదా డాడ్ అంటుంది. ఆనంద్ కూడా అందరం ఇలా బయటి నుంచి రాగానే కారు సౌండ్ విని అమ్మ పరుగెత్తుకుంటూ బయటకు వచ్చేది. అంటూ ఎమోషనల్ అవుతారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..?అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?