Singer Pravasthi : బుల్లితెర పై సింగర్స్ కోసం ప్రసారం అవుతున్న షో ‘పాడుతా తీయగా’ వల్ల తనకు అన్యాయం జరిగిందని ప్రముఖ సింగర్ ప్రవస్తి సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఇప్పటికే ఆమె పోస్ట్ చేసిన వీడియోలో టాలీవుడ్ ఇండస్ట్రీలో, అటు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఈ షోలో జడ్జిలుగా ఉన్న ప్రముఖులు కుల పిచ్చి తో తనను షో నుంచి ఎలిమినేట్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఆమె ఆరోపణల పై విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆమెకి సినీ ఇండస్ట్రీ నుంచి మద్దతు పెరుగుతుంది.. తాజాగా సింగర్ సునీత భర్త రామ్ ఈ విషయం పై సీరియస్ అయ్యారని సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజమేంత ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
తన తల్లిని సునీత అవమానించిందని ప్రవస్తి ఆవేదన..
సింగర్ ప్రవస్తి గురించి అందరికి తెలిసే ఉంటుంది. చిన్నప్పటి నుంచి పాటలు పాడుతుంది. ఆమె ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం బుల్లి తెర పై ప్రసారం అవుతున్న పాడుతా తీయగా షోలో పాల్గొన్నది.. ఇటీవలే ఆమె ఎలిమినేట్ అయ్యింది. దాంతో తన తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. అది తట్టుకోలేక సింగర్ సునీత దగ్గరకు వెళ్తే నువ్వు దగ్గరకు రావొద్దు బయటకు వెళ్ళు అని ఏక వచనంతో మాట్లాడి అవమానించిందని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఎలిమినేట్ అయిన బాధ లేదు కానీ అందరి ముందు తల్లికి అవమానం జరగడం నాకు బాధగా అనిపించింది. అందుకే వీడియోను రిలీజ్ చేశానని ప్రవస్తి అంటుంది.. ఆమె వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
Also Read :మంటల్లో కాలిపోతున్న అమ్మాయిలు.. దిమ్మతిరిగి పోయే స్టోరీ.. డోంట్ మిస్..
సునీత భర్త సీరియస్..
మీడియాలో ఈ వార్త ద్రావనంలా వ్యాపించింది. ప్రవస్తికి మద్దతు పెరుగుతుంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆమెను సపోర్ట్ చేస్తున్నారు. అయితే సింగర్ సునీతకు కుల పిచ్చి ఉందని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.. దీనిపై తాజాగా సింగర్ సునీత భర్త రామ్ రియాక్ట్ అయ్యినట్లు నెట్టింట ఓ వార్త షికారు చేస్తుంది.. సునీతను తిట్టినట్లు తెలుస్తుంది.. వెంటనే ప్రవస్తకి క్షమాపణలు చెప్పి షోలో మళ్లీ ఎంట్రీ ఇప్పించాలని ఆమెకు వార్నింగ్ ఇచ్చినట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. భర్త విన్న సునీత ప్రవస్తికి మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పే అవకాశం ఉందని సమాచారం. ఇందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ఇది మాత్రం నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. రేపు ఏం జరుగుతుందో చూడాలి.. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.. సింగర్ ప్రవస్తికి మద్దతు పెరుగుతుంది. నిర్మాత నట్టి కుమార్ ఆమెకు న్యాయం జరిగే వరకు తోడు ఉంటామని హామీ ఇచ్చారు.