Nindu Noorella Saavasam Serial Today Episode : బయటకు వెళ్లి ఆడుకుందామని గోల చేస్తున్న అంజుపై ఆకాష్ కోప్పడతాడు. ఎగ్జామ్ వస్తున్నాయని నువ్వేతే పక్కోడి పేపర్ చూసో స్లిప్స్ తీసుకునో రాసి పాసవుతావు. లేదంటే డాడీకి ఏవో మాటలు చెప్పైనా తప్పించుకుంటావు కానీ మేము అలా కాదు మేము చదువుకోవాలి అంటూ సీరియస్ అవుతాడు. ఇంతలో ఆకాష్ ఆయాసపడతాడు. దీంతో అమ్ము వాటర్ తాగించి అంజు, ఆనంద్‌ను తీసుకుని బయటకు వస్తుంది. ఆకాష్‌కు ఆస్తమా ప్రాబ్లమ్ ఉంది. వాడు ఎక్కువగా అరవకూడదని నీకు తెలియదా..? అంటూ అంజును తిడుతుంది. దీంతో అంజు తెలుసు అమ్ము.. కానీ ఇంత చిన్న విషయానికి నా మీద అరుస్తాడని అనుకోలేదు. అయినా వాడు టెన్షన్ అవుతున్నాడని కొంచెం రిలాక్స్ చేద్దామని బయటకు వెళ్లి ఆడుకుందామని అడిగాను అంతే అంటుంది. దీంతో ఆనంద్ సరేలేవే.. టెన్షన్ అవ్వకు..ఒక్క ఐదు నిమిషాల్లో నిన్ను తిట్టానన్న బాధతో వాడే బయటకు వస్తాడు.
అని మాట్లాడుకుంటుంటే.. ఆకాష్‌కు ఆస్తమా ఎక్కువ అవుతుంది. అక్కా అంటూ బెడ్ మీద నుంచి కింద పడి గిలా గిలా కొట్టుకుంటుంటాడు. కిందకు వచ్చిన అంజు వాళ్లను అనామిక చూస్తుంది. ఏంటి.. చదువుకోకుండా ఎక్కడికి పోతున్నారు. అని అడుగుతుంది. దీంతో అంజు మా సిలబస్ అయిపోయింది. సిలబస్ అయిపోతే థర్టీ మినిట్స్ ప్లే అని నువ్వే చెప్పావు కదా..? అంటుంది. సరే సరే వెళ్లండి జాగ్రత్త.. అవును అంజు.. ఆకాష్ ఎక్కడ..? అని అడుగుతుంది. దీంతో అమ్ము పైనే ఉన్నాడు. వాడు కాసేపు ఆగి వస్తా అన్నాడు. అని చెప్పి వెళ్తారు. అనామిక కిచెన్ లోకి వెళ్లి గుప్త మాటలు గుర్తు చేసుకుంటుంది.
రాథోడ్ మనోహరి దగ్గరకు వెళ్తాడు. మనోహరి ఏంటి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. దీంతో రాథోడ్ సార్ మిమ్మల్ని రెడీ అవ్వమన్నారు.. అరగంటలో బయటకు వెళ్లాలట అని చెప్తాడు. ఆ మాట వినగానే మనోహరి హ్యాపీగా బయటికా..? ఎవరెవరు అని అడుగుతుంది. మీరు నేను సారు అని చెప్తాడు రాథోడ్.. దీంతో మనోహరి మా మధ్య నువ్వెందుకు ఏం అవసరం లేదు. ఏదో ఒకటి చెప్పి ఇంట్లోనే ఉండు. నేను అమర్ సరదాగా బయటకు వెళ్లొస్తాం.. అంటుంది. దీంతో రాథోడ్ మీరు సరదాగా వెల్లడానికి సార్ తీసుకు వెల్తుంది షాపింగ్‌కు కాదండి.. మిలటరీ ఆఫీసుకు.. మా మేజర్ గారిని కలవడానికి అని చెప్పగానే.. మనోహరి షాక్ అవుతుంది. నేనెందుకు మేజర్ గారిని కలవాలి. అని అడుగుతుది. దీంతో మీరు మీనన్ మనుషులతో చేతులు కలిపారు కదా దాని గురించి మా సారు మాట్లాడుతున్నారు మీ గురించి మాట్లాడేటప్పుడు మీరు లేకపోతే ఎలా అంటాడు.
దీంతో మనోహరి కోపంగా నేను మీనన్‌తో చేతులు కలపడం ఏంటి..? అని అడుగుతుంది. దీంతో అదే మిమ్మల్ని బయపెట్టాడని మీనన్‌కు మీరు హెల్ప్ చేశారు కదా అని చెప్పగానే.. మనోహరి భయంగా సరే రెడీ అయి వస్తాను అని చెప్పగానే.. రాథోడ్ అయ్యో ఫైల్ పైనే మర్చిపోయాను అని పైకి వెళ్లి రూంలో ఆకాష్ పడి ఉండటం చూసి భయంతో గట్టిగా అందరినీ పిలుస్తాడు. అందరూ వచ్చి ఆకాష్‌ను చూసి కంగారు పడుతుంటారు. అనామిక మాత్రం కంగారు పడుతూనే ఆకాష్‌ను తన వడిలో పడుకోబెట్టుకుని బ్రీతింగ్ హీలర్ తో హెల్ప్ చేస్తుంది. తర్వాత ఆకాష్ కూల్ అవుతాడు. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. అనామిక బయటకు వచ్చేస్తుంది.
ఆమె వెనకాలే వచ్చిన అమర్.. అనామికను ఆకాష్‌కు బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అందరూ కంగారు పడ్డారు. కానీ నువ్వు మాత్రం నీలా అనిపించలేదు అంటాడు. నాలా అంటే ఏంటి సార్ అర్థం కాలేదు అని అడుగుతుంది. కొత్తగా అనిపించావు.. చెప్పాలంటే ఆరులా అనిపించావు అని అమర్ చెప్పగానే. అనామికి అలియాస్ ఆరు షాక్ అవుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?