SRH In IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 లో తన తొలి మ్యాచ్ లో భారీ విజయం సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్.. అనంతరం గాడి తప్పింది. ఆ తర్వాత ఆడిన 3 మ్యాచ్లలోనూ ఘోర పరాభవాన్ని చవిచూసింది. లక్నో సూపర్ జెయింట్స్ పై ఐదు వికెట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ పై 7 వికెట్లు, కలకత్తా చేతిలో 80 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
Also Read: Ipl 2025: ఐపీఎల్ లో కలకలం… అర్ధాంతరంగా టోర్నీ నుంచి తప్పుకున్న ప్లేయర్ ?
గురువారం రోజు డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కలకత్తా – రన్నరప్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో.. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన కలకత్తా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేదనకు దిగిన హైదరాబాద్ 16.4 ఓవర్లలో కేవలం 120 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఇలా మూడు మ్యాచ్ లలో హైదరాబాద్ జట్టు వరుసగా ఓటములను చవిచూడడంతో హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఫై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కలకత్తాతో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కమిన్స్ సరిగా బౌలింగ్ లో మార్పులు చేయలేకపోయాడని, స్పిన్నర్లు రెండు వికెట్లు పడగొట్టినప్పటికీ వారిని కంటిన్యూ చేయలేదని మండిపడుతున్నారు. అంతేకాకుండా ఎనిమిది ఓవర్లు స్పిన్నర్లు వేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ.. పేసర్లతో వేయించి మూల్యం చెల్లించుకున్నారని విమర్శిస్తున్నారు. మరోవైపు కలకత్తా స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ కలిసి 8 ఓవర్లలో నాలుగు వికెట్లు పడగొట్టి హైదరాబాద్ ని దెబ్బ కొట్టారని.. కమిన్స్ మాత్రం స్పిన్నర్లను వినియోగించుకోలేదని కమిన్స్ కెప్టెన్సీ పై విమర్శలు చేస్తున్నారు నెటిజెన్లు.
నిజానికి కెప్టెన్సీకి కొత్త అర్థం చెప్పిన వాడు కమిన్స్. ఒకే ఏడాది ఆస్ట్రేలియా కి ఐసిసి టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే ప్రపంచ కప్ లను అందించిన ఘనుడు. 2023లో టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, వన్డే ప్రపంచ కప్ లను గెలిచిన అనంతరం కమీన్స్ కెప్టెన్సీకి ఎన్నో ప్రశంసలు లభించాయి. దీంతో ఐపీఎల్ వేలంలో కమీన్స్ ని భారీ ధరకు సొంతం చేసుకున్న సన్రైజర్స్ హైదరాబాద్.. అతడికే కెప్టెన్సీ పగ్గాలను అప్పగించింది. ఇక 2024 ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ తలరాతను పూర్తిగా మార్చేశాడు కమీన్స్. 2024 లో జట్టను ఫైనల్ కీ చేర్చాడు.
Also Read: NZ beat Pak: కివీస్ గడ్డపై వరుసగా 12 వన్డేల్లో ఓడిన పాక్… పరువు మొత్తం పాయె ?
కానీ 2025లో మాత్రం కమిన్స్ కెప్టెన్సీ పై ప్రస్తుతం విమర్శలు వెళ్ళువెత్తుతున్నాయి. ఇక కలకత్తాతో ఓటమిపై తన నిరాశను వ్యక్తం చేశాడు కామిన్స్. “ఈ మ్యాచ్ లో ఫీల్డింగ్ లో మేము చాలా అవకాశాలను కోల్పోయాం. చివరికి మ్యాచ్ మా చేతుల్లో నుండి జారిపోయింది. జట్టు ఫీల్డింగ్ బలహీనంగా ఉంది. బౌలింగ్ బాగానే ఉంది కానీ.. కొన్ని క్యాచ్లు మిస్ అయ్యాయి. ఈ ఓటమి నుండి మేము నేర్చుకుంటాం. మాకు బాగా తెలిసిన మైదానంలో తదుపరి మ్యాచ్ ఆడతాం” అని చెప్పుకొచ్చాడు.