E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి పై ప్రశంసలు.. అయ్యో ఇంత మోసమా.. దారుణంగా మోసపోయిన అవని..

Intinti Ramayanam Today Episode: పల్లవి పై ప్రశంసలు.. అయ్యో ఇంత మోసమా.. దారుణంగా మోసపోయిన అవని..
Advertisement

Intinti Ramayanam Today Episode august 25th: పల్లవి వంటగదిలో వంట చేస్తూ ఉండడం చూసి అందరూ ఏంటి నువ్వు ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావ్ మేము చేస్తాను కదా అని అంటారు.. కాఫీ మాత్రమే పెడుతున్నాను. అందరికీ నేనే కాఫీ పెడతానని అంటారు. కానీ పల్లవి అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా వంట గదిలోకి నేను వెళ్తాను నేను వెళ్తాను అని పోటీ పడతారు. కానీ పల్లవి అందరికోసం మంచి కాఫీలు పెట్టి తీసుకొని వస్తుంది అందరూ కూడా అవని ఎక్కలాగే చాలా బాగా పెట్టావు అంటూ పొగడ్తలు వర్షం కురిపిస్తారు.. పల్లవి మారిపోవడం నిజంగానే ఆశ్చర్యంగా ఉంది మరీ ఇంత మారిపోతుందని అసలు అనుకోలేదు. ఇలానే ఉంటే బాగుంటుంది అని అవని అనుకుంటుంది.

అందరిని నమ్మించిన పల్లవి..

పల్లవి మంచిదానిగా అనిపించుకోవడానికి అందరికీ కావాల్సిన విధంగా అన్ని చేస్తూ ఉంటుంది. వంటగదిలో మొత్తం తానే చేయాలని ఫిక్స్ అవుతుంది.. ముందుగా కాఫీ పెట్టి అందరికీ ఇస్తుంది పల్లవిలో ఇంత మార్పుని అసలు ఊహించలేదు అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు.. ఇక అందరూ సరదాగా ఉండగా అవని నాన్న ఇచ్చిన రెండు కోట్ల చెక్కుని నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది. నన్ను చైర్మన్గా చేస్తాను అని చెప్పిన కూడా నేను వినలేదు. ఈ రెండు కోట్లతో నేను మంచి బిజినెస్ స్టార్ట్ చేసి అంచలంచలుగా ఎదగాలని కోరుకుంటున్నాను అని పల్లవి చెప్పగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా అది నిజమే అనుకొని నువ్వు కష్టపడాలనుకుంటున్నావ్ కాబట్టి నీకు మా సపోర్ట్ ఉంటుంది అని అంటారు.. పల్లవి నిజంగానే మారిపోయింది అని అవని కూడా మోసపోతుంది.

శ్రీయ జోక్ అదుర్స్..

Advertisement

పల్లవి తన గురించి తాను చెప్పుకుంటూ ఉండగా శ్రేయ మీ అందరి కోసం ఒక జోక్ చెప్తాను అని అంటుంది.. అందరికీ అర్థమయ్యేలా దేవుడు కి సంబంధించిన ఒక జోక్ ని చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా నవ్వుకుంటారు. మహిళల భక్తి ఎలా ఉంది అన్నది ఈ రోజుల్లో ఎలా మారిపోయింది అన్నది చూపించారు. శ్రియ చెప్పిన ఆ జోకు తో అక్కడ ఉన్న వాళ్ళందరూ పగలబడి నవ్వుకుంటారు. పల్లవి కూడా నిజంగానే శ్రియా చాలా మంచి జోక్ చెప్పింది అందుకే చాలా బాగుంది అని మెచ్చుకుంటుంది.. ఇక ఇంట్లోనే ఆడవాళ్ళందరూ ఒక్కచోట కూర్చొని సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అందరూ కలిసి ఇంత సంతోషంగా ఉండడం చూసిన పార్వతీతో పాటు అవని కూడా నా ఇల్లు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు.

అక్షయ్ మాటతో అవని రియాక్షన్..

అక్షయ్ అవని చెప్పినట్లుగానే ఆరాధ్యను రెడీ చేసి చూపిస్తాడు.. మీరు చెప్పినట్టుగానే నేను ఆడదేను రెడీ చేశాను మీరు ఏం చెప్తే అదే మేడం అంటూ అక్షయ్ చేసిన ప్రవర్తన అవనికి కాస్త నవ్వు తెప్పిస్తుంది.. మీరిచ్చిన పనిష్మెంట్ ని నేను తప్పకుండా చేయాలి కదా అందుకే ఆరాధ్యను రెడీ చేసి చూపించాను అని అక్షయ్ అంటాడు. పరవాలేదే మీరు కూడా మంచిగానే రెడీ చేశారు అని అవని అక్షయ్ ని పొగిడేస్తుంది.. ఇక తర్వాత అక్షయ్ ఆరాధ్యను మాత్రమే కాదు మిమ్మల్ని కూడా రెడీ చేయమంటే రెడీ చేస్తాను అని అనగానే.. అవని కాస్త సిగ్గుపడుతుంది. ఇక ఇద్దరూ కలిసి అవనీని ఆడుకోవడంతో అవని వాళ్ళిద్దరికి కూడా చెవి మెలిపెట్టేస్తుంది.. ఇద్దరూ కలిసి తోడుదొంగ లాగా మారిపోయారు అని ముగ్గురు కూడా సంతోషంగా ఉంటారు.

మీనాక్షి ఫుల్ హ్యాపీ..

Advertisement

మీనాక్షి బాబుని తీసుకుని బయట కూర్చుని ఆడుకుంటూ.. మీ పల్లవి పిన్ని నువ్వు వచ్చిన తర్వాత ఇంతగా మారిపోయింది అంటూ బాబు పై పొగడ్తల వర్షం కురిపిస్తుంది.. నువ్వు వచ్చిన తర్వాత ఇండ్లు మొత్తం సంతోషంగా మారిపోయింది. నువ్వు చాలా అదృష్టవంతుడివి కన్నా అంటూ మీనాక్షి బాబుని ఎత్తుకొని ఆడిస్తూ ఉండగా అవని అక్కడికి వస్తుంది.. మీ కూతురు మారిపోయింది అని మీరు చాలా సంతోషపడుతున్నట్టు ఉన్నారు అని అవని అంటుంది. రాజేంద్రప్రసాద్ గారు ఇంట్లో అడుగు పెట్టకని ఇలాంటి శుభవార్తలు ఎన్నో విన్నాము నిజంగానే నా జన్మ ధన్యమైంది అంటూ మీనాక్షి ఎమోషనల్ అయిపోతుంది. పల్లవిలో ఇంత మార్పు వస్తుందని నేను కూడా అసలు ఊహించలేదు అమ్మ అందుకే పల్లవి తన ఇష్టమైన పనిని చేయాలని కోరుకుంటున్నాను అని అవని అంటుంది. వీళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా పల్లవి వస్తుంది.

చెక్ డిపాజిట్ చేస్తున్నాను..

అక్క నేను బిజినెస్ పని మీద బయటకు వెళ్తున్నాను నాన్న ఇచ్చిన చెక్కుని నేను అకౌంట్లో వేయాలి అనుకుంటున్నాను. మీరు ఏమంటారు అంటూ పల్లవి అన్న మాట విని అవని వాళ్ళందరూ షాక్ అవుతారు. నీ ఎదుగుదల కోసం నాన్న ఇచ్చిన చెక్ ను నువ్వేమైనా చేసుకోవచ్చు. అది నీ ఇష్టం అని అవని అనగానే సరే అక్క నేను వెళ్తాను అని నన్ను ఆశీర్వదించండి అంటూ ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోతుంది.. అవని చెప్పినట్లుగానే పల్లవి బ్యాంకుకు వెళ్లి ఆ చెక్కుని డిపాజిట్ చేయాలని అనుకుంటుంది. అక్కడ ఆ బ్యాంక్ అతను రెండు కోట్ల అమౌంటు ఒకేసారి ప్రాసెస్ చేయాలంటే చాలా టైం పడుతుంది అని అంటాడు. కానీ పల్లవి మాత్రం ఎలాగోలాగో చూడండి ఒక అర్జెంటు పని ఉంది అని అంటుంది.. అటు శ్రీధర్ కోసం ఒక ఆవిడ వచ్చి తన జీవితం గురించి చెప్పి బాధపడుతుంది. ఆవిడని చూస్తుంటే జనాలకి కాస్త అనుమానం వచ్చేలా ఉంది కానీ ఏం జరుగుతుందో అన్నది ముందు ముందు ఎపిసోడ్లలో చూడాలి. ఇక అశ్విన్ పల్లవి నన్ను జైలుకు పంపించడానికి కారణం అని తనపై ఇంకా కోపాన్ని పెంచుకుంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

Related News

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మీనా చెల్లి అవుట్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లిని ఇంట్లోంచి గేంటేసిన వేదవతి.. భాగ్యంకు నర్మదా స్ట్రాంగ్ వార్నింగ్.. పాపం శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవని పై భానుమతి సీరియస్.. అవనికి సీరియస్.. ప్రణతి కాపురంలో చిచ్చు..

Karthika Deepam 2 Serial Today Episode October 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ దెబ్బకు టిపిన్ బండి ఎత్తేసిన మాలిని           

Podarillu Today Episode : నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్.. మహా పై సీరియస్.. కన్నా కన్నీళ్లు..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ మాటతో ప్రభా షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రభా.. బాలు రచ్చ రచ్చ..

Ninnu kori Serial Today Episode October 10th ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎండింగ్ ఏపిసోడ్ ఇలా ముగుస్తుందనుకోలేదు

Saturday Tv Movies : శనివారం టీవీ సినిమా.. మూవీ లవర్స్ కు పండగే..

Big Stories

Advertisement
×