E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode August 25th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్నకు ఇష్టం లేకపోతే తనను వదిలేయమన్న సూరజ్     

Karthika Deepam 2 Serial Today Episode August 25th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్నకు ఇష్టం లేకపోతే తనను వదిలేయమన్న సూరజ్     
Advertisement

Karthika Deepam 2 serial today Episode:  అవుట్‌ హౌస్‌లోకి సూరజ్ దగ్గరకు వెళ్లిన జ్యోత్స్న.. సూరజ్‌ను రొమాంటిక్ గా చూస్తుంది. కాబోయే భార్యతో ఏదైనా మాట్లాడొచ్చు కదా అని అడుగుతుంది. అందుకు సూరజ్‌ తనకేం మాట్లాడాలో తెలియదని.. నీకు తెలిస్తే నువ్వు మాట్లాడు అంటాడు.. నాకు ఎలా తెలుస్తుంది అంటూ జ్యో అడిగితే.. అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఎక్కువ తెలుస్తాయి… అంటూ సూరజ్‌ తన స్టైల్‌లో మాట్లాడుతుంటే.. జ్యోత్స్న ఇక అవన్నీ ఆపేయ్‌ అంటూ సూరజ్‌ దగ్గరకు వెళ్లి కిస్‌ చేయడానికి ప్రయత్నిస్తే.. సూరజ్‌ దూరంగా జరుగుతాడు.

పెళ్లి కాక ముందు ఇవన్నీ ఎందుకు అంటాడు.  ఆ మాటకు జ్యోత్స్న అందుకేరా నువ్వుంటే పిచ్చి నాకు.. నేనేం ఇచ్చినా తీసుకోవు.. నీకు నచ్చితే ఎలాగైనా మాయ చేసి తీసుకుంటావు.. కానీ పెళ్లి అయ్యాక ఇలా మాత్రం ఉండొద్దు.. నాతో  ఫ్రెండ్లీగా ఉండు.. అందరిలా ఉండు.. జోక్ వేస్తే నవ్వు.. ముద్దు ఇస్తే తీసుకో.. టోటల్‌గా నా బెస్ట్‌ ఫ్రెండ్‌గా ఉండు అంటూ జ్యోత్స్న చెప్తుంటే.. నేను నాకు నచ్చేలా ఉంటాను.. నేను ఇలా ఉండటం నీకు నచ్చకపోతే వదిలేయ్‌ అంటాడు సూరజ్‌. కానీ జ్యోత్స్న అలా చేయలేనని నువ్విప్పుడు నా ఊపిరి అయిపోయావని.. ఆ ఊపిరిని వదిలేసి నేను ఎలా బతకగలను అంటూ కవితలు చెప్తుంది. అప్పుడే అక్కడకు దీప, కార్తీక్‌, శ్రీధర్‌ వస్తారు.

Advertisement

వాళ్లను చూసి జ్యోత్స్న తన కవితలు ఆపేస్తుంది. మౌనంగా చూస్తుండిపోతుంది. శ్రీధర్‌ మాత్రం సూరజ్‌ ను వాళ్ల ఇంటికి వెళ్దాం పద అంటూ పిలుస్తాడు. ఎందుకని సూరజ్‌ అడిగితే.. ఒకే ఇంట్లో వధూవరులను తయారు చేయకూడదని.. నువ్వు నా కొడుకుతో సమానం కదా అందుకే నీకు రేపు అక్కడ మంగళస్నానాలు చేయించాలి.. అక్కడే పెళ్లికొడుకుగా రెడీ అయి ఇక్కడకు రావాలి అని చెప్తాడు. అందుకు సూరజ్‌ ఎందుకు జ్యోత్స్న ఉండేది ఆ పెద్ద ఇంట్లో నేను ఉండేది ఈ చిన్న రూంలో కదా..? ఇక్కడే చేయోచ్చు కదా అంటాడు. అందుకు శ్రీధర్‌ నవ్వుతూ.. అమ్మా జ్యోత్స్న సూరజ్‌తో ఏమైనా పని ఉందా..? మేము త్వరగా వెళ్లాలి అని చెప్పగానే..

జ్యోత్స్న సిగ్గుపడుతూ వెళ్లిపోతుంది. సూరజ్‌ను రెడీ అవ్వమని తాను కాంచను ఫోన్‌ చేస్తానని బయటకు వెళ్తాడు. కార్తీక్‌ పెళ్లి తర్వాత పెళ్లాన్ని కంట్రోల్‌ లో పెట్టాలని సూరజ్‌కు చెప్తుంటే.. పక్కనే ఉన్న దీప విని ఏంటి బావ చెప్తున్నావు అని అడుగుతుంది. అందుకు ఏం లేదు పెళ్లి అయ్యాక పెళ్లాన్ని ఎంత ప్రేమగా చూసుకోవాలో చెప్తున్నాను అంటాడు కార్తీక్‌. దీప, కార్తీక్‌ వెళ్లబోతుంటే.. సూరజ్‌ సారీ చెప్తాడు. ఎందుకు సారీ చెప్తున్నావు.. ఏమైనా తప్పు చేశావా..? అని అడిగితే.. వాళ్లను ఇబ్బంది పెడుతున్నందుకు సారీ చెప్తున్నాను అంటాడు సూరజ్‌. కానీ కార్తీక్‌, దీప మాత్రం ఈ పెళ్లి చేయడం తమ బాధ్యత అని చెప్పి వెళ్లిపోతారు.

Advertisement

అందరూ పెళ్లి హడావిడిలో ఉండగా పారిజాతం వెళ్లి దశరథతో పెళ్లి కాగానే ఆస్థి మొత్తం జ్యోత్స్న పేరు మీద రాస్తా అన్నారు గుర్తుందా అని అడుగుతుంది. గుర్తుందని చెప్తారు దశరథ, సుమిత్ర. అప్పుడే దాసు వస్తాడు. నువ్వెందుకు వచ్చావని పారిజాతం అడిగితే.. కూతురు పెళ్లి జరుగుతుంటే తండ్రి లేకపోతే ఎలా పిన్ని అంటాడు దశరథ. ఆ మాటలకు అందరూ షాక్‌ అవుతారు. దశరథ మాత్రం అదే నా కూతురు దాసుకు కూడా కూతురు లాంటిదే కదా అంటూ కవర్‌ చేస్తాడు దశరథ. ఇక్కడ ఇంట్లో జ్యోత్స్నను పెళ్లికూతురును చేస్తారు. అక్కడ కాంచన ఇంట్లో సూరజ్‌ను పెళ్లికొడుకును చేస్తారు. జ్యోత్స్న దగ్గరకు శౌర్య వెళ్లి ఫోటోలు తీస్తుంటే.. ఇక్కడ తీయడం కాదని వెళ్లి సూరజ్‌ను ఫోటోలు తీసి తనకు సెండ్‌ చేయమని చెప్తుంది. శౌర్యకు చాక్లేట్‌ ఇచ్చి పంపిస్తుంది. శౌర్య వెళ్లి సూరజ్‌ ఫోటోలు తీస్తుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మీనా చెల్లి అవుట్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లిని ఇంట్లోంచి గేంటేసిన వేదవతి.. భాగ్యంకు నర్మదా స్ట్రాంగ్ వార్నింగ్.. పాపం శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవని పై భానుమతి సీరియస్.. అవనికి సీరియస్.. ప్రణతి కాపురంలో చిచ్చు..

Karthika Deepam 2 Serial Today Episode October 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ దెబ్బకు టిపిన్ బండి ఎత్తేసిన మాలిని           

Podarillu Today Episode : నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్.. మహా పై సీరియస్.. కన్నా కన్నీళ్లు..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ మాటతో ప్రభా షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రభా.. బాలు రచ్చ రచ్చ..

Ninnu kori Serial Today Episode October 10th ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎండింగ్ ఏపిసోడ్ ఇలా ముగుస్తుందనుకోలేదు

Saturday Tv Movies : శనివారం టీవీ సినిమా.. మూవీ లవర్స్ కు పండగే..

Big Stories

Advertisement
×