E-Paper
Advertisement

విండ్‌షీల్డ్‌ సైడ్ లో నల్ల చుక్కలు.. వామ్మో.. వీటితో ఇన్ని లాభాలున్నాయా?

విండ్‌షీల్డ్‌ సైడ్ లో నల్ల చుక్కలు.. వామ్మో.. వీటితో ఇన్ని లాభాలున్నాయా?
Advertisement

Black Dots on Car Windshield: కారులో విండ్‌ షీల్డ్‌ అంచుల దగ్గర నల్లటి రంగులో చిన్న చిన్న చుక్కలు కనిపిస్తాయి. చాలామంది వాటిని కేవలం డిజైన్ కోసం వేసినవి అనుకుంటారు. కానీ, నిజానికి ఆ చుక్కల వెనుక ముఖ్యమైన టెక్నికల్ రీజన్ ఉంది. విండ్‌షీల్డ్ భద్రత, మన్నిక, డ్రైవర్‌ కు స్పష్టమైన విజిబిలిటీ విషయంలో ఈ డాట్స్ కీలక పాత్ర పోషిస్తాయి.

ఆ నల్ల చుక్కలను ఏమంటారు?

విండ్‌షీల్డ్ అంచుల చుట్టూ కనిపించే నల్లటి భాగాన్ని సాధారణంగా సెరామిక్ ఫ్రిట్ అంటారు. ఇందులో ఒక గట్టి నల్లటి పట్టీతో పాటు చిన్న చిన్న చుక్కలు కూడా ఉంటాయి. ఇవి గాజు తయారీ సమయంలో రెడీ అవుతాయి. బయట నుంచి పెయింట్ చేసినవి కావు. విండ్‌ షీల్డ్‌ ను కారుకు అమర్చేటప్పుడు గాజును ఫ్రేమ్‌ కు బలంగా అంటించేందుకు ప్రత్యేకమైన జిగురును ఉపయోగిస్తారు. ఈ జిగురు సరిగ్గా పనిచేయడానికి ఫ్రిట్ కూడా సాయపడుతుంది.

గమ్ ను గట్టిగా పట్టుకునేలా చేస్తాయి!

Advertisement

విండ్‌ షీల్డ్‌ ను కారు బాడీకి అంటించే సమయంలో జిగురుకు గట్టి పట్టుదల అవసరం. నల్లటి ఫ్రిట్ గాజు అంచున ఒక గరుకైన ఉపరితలాన్ని అందిస్తుంది. దీంతో జిగురు గాజుకు గట్టిగా అంటుకుంటుంది. అంటే, ఈ నల్లటి పట్టీ కేవలం అందం కోసం మాత్రమే కాదు. విండ్‌షీల్డ్ తన ప్లేస్ లో బలంగా ఉండేందుకు కూడా ఉపయోగపడుతుంది. ప్రమాదం జరిగినప్పుడు గ్లాస్ స్థిరంగా ఉండటంలోనూ ముఖ్యపాత్ర పోషిస్తుంది.

సూర్యకిరణాల నుంచి రక్షణ

విండ్‌ షీల్డ్‌ ను అంటించే జిగురుకు మరో సమస్య సూర్యుడి నుంచి వచ్చే UV కిరణాలు. ఎక్కువకాలం UV కిరణాలకు గురైతే జిగురు నెమ్మదిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇక్కడే నల్లటి ఫ్రిట్ రక్షణ పొరలా పనిచేస్తుంది. ఇది జిగురును నేరుగా సూర్యకిరణాలు తాకకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా జిగురు ఎక్కువకాలం తన బలాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది.

చుక్కలు ఎందుకు చిన్నవిగా ఉంటాయి?

Advertisement

అంచు దగ్గర ఉన్న నల్లటి పట్టీ క్రమంగా లోపలికి వస్తున్న కొద్దీ చిన్న చిన్న చుక్కలుగా మారుతుంది. దీన్ని హాఫ్‌ టోన్ ప్యాటర్న్ లాగా చూడొచ్చు. గాజు తయారు చేసే సమయంలో ఒక ప్రాంతం అకస్మాత్తుగా ఎక్కువ వేడికి గురైతే అక్కడ ఒత్తిడి లాంటి సమస్యలు రావచ్చు. నల్లటి పట్టీ నుంచి చుక్కలుగా మారే ఈ డిజైన్ వేడిని క్రమంగా సమతుల్యం చేయడంలో సాయపడుతుంది. చుక్కల ప్యాటర్న్ వల్ల నల్లటి అంచు నుంచి పారదర్శక గాజు వైపు మార్పు ఒక్కసారిగా కనిపించదు. క్రమంగా మారే ఈ డిజైన్ కళ్లకు కూడా సౌకర్యంగా ఉంటుంది.  అందువల్ల డ్రైవర్‌ కు రోడ్డు విజుబులిటీ మరింత సహజంగా కనిపిస్తుంది.

చిన్న చుక్కల వెనుక పెద్ద టెక్నాలజీ

కారులో కనిపించే ఈ చిన్న నల్ల చుక్కలను చాలామంది పట్టించుకోరు. కానీ వాటి వెనుక గాజును బలంగా అమర్చడం, జిగురును రక్షించడం, తయారీ సమయంలో వేడిని నియంత్రించడం, డ్రైవర్‌కు స్పష్టమైన దృశ్యాన్ని అందించడం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.  చిన్నగా కనిపించినా, కారు భద్రతలో వాటి పాత్ర చాలా పెద్దగా ఉంటుంది.

Read Also: కెమెరా లేదు.. వైర్లు లేవు.. డ్రైవర్‌ కు నిద్రొస్తే సీటే కనిపెట్టేస్తుంది!

Tags

Related News

ఉద్యోగులకు BMW కార్లను గిఫ్ట్‌గా ఇచ్చిన లేడీ బాస్, అలా చూసి.. చలించిపోయి..

ఈవీలకు పెరుగుతున్న క్రేజ్.. కమర్షియల్ వెహికల్స్ మార్కెట్‌ ఏకంగా 158% జంప్!

స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది.. కొత్త ఫీచర్లు ఇవే!

BE 07 TO విజన్ T.. మహీంద్రా నుంచి రాబోతున్న పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ SUVలు ఇవే!

హోండా కార్లపై అక్టోబర్‌ లో అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.2.34 లక్షల తగ్గింపు!

మారుతి స్విఫ్ట్‌ లో కొత్త టర్బో ఇంజిన్.. కళ్లు చెదిరే పవర్‌ తో మార్కెట్ లోకి ఎంట్రీ!

హోండా సిటీ vs హ్యుందాయ్ వెర్నా.. CVTలో ఏది బెస్ట్?

CNG నింపుతుండగా భారీ పేలుడు.. కారు యజమానులు ఈ 3 విషయాల్లో జాగ్రత్త!

Big Stories

Advertisement
×