E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode August 25th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: పోలీస్ ట్రైనింగ్ క నందు – ఏదో ఒకటి చేయాలనుకున్న రేఖ      

Brahmamudi Serial Today Episode August 25th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: పోలీస్ ట్రైనింగ్ క నందు – ఏదో ఒకటి చేయాలనుకున్న రేఖ      
Advertisement

Brahmamudi serial today Episode: తనను గెలవాలన్న కసితో ఐశ్వర్య బాగా చదువుతుందని తన మీద ఉన్న కోపంతో కచ్చితంగా డిగ్రీ పాస్‌ అవుతుంది అని ఇందు చెప్తుంటే.. రాజు సరే ఒకవేళ తను పాస్‌ అయిందనుకో.. అప్పుడు కంపెనీ పెట్టిస్తావా..? అని అడిగితే.. కచ్చితంగా పెట్టిస్తా ఒక్కసారి మనిషి కష్టపడటం నేర్చుకుంటే ఆయనలో చాలా మార్పులు వస్తాయి.. మా అక్కను నేను హైయ్యర్‌ పొజిషన్‌లో చూడాలనుకుంటున్నాను అని ఇందు చెప్తుంది. అంటే నువ్వు ఐషును కావాలని రెచ్చగొట్టావా..? అని అడిగితే.. అవునని చెప్తుంది. నువ్వు చాలా గ్రేట్‌ ఇందు నాకు కూడా అర్థం కాకుండా బలే చేశావు అంటాడు రాజు.

ఐశ్వర్య తన ఫ్రెండ్స్‌కు ఫోన్‌ చేసి తాను డిగ్రీ పాస్‌ అవ్వాలని అందుకు ఏం చేయాలని అడుగుతుంది. అయితే డబ్బులు రెడీ చేసుకో అని చెప్పగానే.. డబ్బులు ఎందుకు అని ఐశ్వర్య అడిగితే.. సబ్జెక్టు ఇంతని తీసుకుని పాస్‌ చేస్తారు అని చెప్పగానే.. ఐశ్వర్య కోపంగా ఏయ్‌ ఏం మాట్లాడుతున్నావే.. నేను నిజాయితీగా పాస్‌ అవ్వాలనుకుంటున్నాను.. నీకు అంత సీన్‌ లేదు నువ్వు ఎంత చదివినా ఒక్క సబ్జెక్ట్‌ కూడా పాస్‌ కాలేవు అంటుంది. ఐశ్వర్య కోపంగా కాల్‌ కట్‌ చేసి నేను నిజాయితీగా చదివి పాస్‌ అవుతానంటే ఒక్కరూ నమ్మడం లేదేంటి అని ఇరిటేట్‌ అవుతుంది. అప్పుడే నేను నమ్ముతున్నాను ఐషు అంటూ లక్కీ వస్తాడు. నువ్వు డిగ్రీ పాస్‌ అవ్వుతావని నేను నమ్ముతున్నాను.. ఎందుకంటే నీకు నేను హెల్ప్‌ చేస్తాను.. అని చెప్పగానే.. నీ ముఖం నువ్వేం హెల్ప్‌ చేస్తావు.. అయినా నువ్వేం చదువుకున్నావు అని అడిగితే..

Advertisement

లక్కీ సిక్త్‌ క్లాస్‌ అని చెప్తాడు. ఐషు కోపంగా నేన డిగ్రీ అంటుంది.. దీంతో లక్కీ కానీ నువ్వు ఫెయిల్‌ అయ్యావు.. నేను పాస్‌ అయ్యాను.. అంటూ నన్ను నమ్ము ఐషు నువ్వు ఏ టైంలో ఏం చదవాలి ఎలా చదవాలి అనేది ప్రిపేర్‌ చేసి ఇస్తాను నన్ను నమ్ము నువ్వు అంటూ వెళ్లి మందు తీసుకొచ్చి ఐషుకు ఇస్తాడు. ఇద్దరూ కలసి ఫుల్లుగా మందు తాగుతారు. మందు మత్తులో ఐశ్వర్య కోపంగా లక్కీని ఇందు అనుకుని  కాలర్‌ పట్టుకుని పిచ్చకొట్టుడు కొడుతూ.. ఈ చాలెంజ్‌ నేను గెలుస్తానే.. అయినా నీకు ఎందుకే నేనంటే అంత కక్ష్య అంటూ తిడుతుంది. లక్కీ భయంతో ఐషు నేను ఇందును కాదు లక్కీని చూడు నన్ను చూడు అంటే.. నాతోనే అబద్దం చెప్తావే.. నిన్ను అసలు వదలను అంటూ కొడుతుంటే.. లక్కీ అక్కడి నుంచి పారిపోతాడు.

నందుకు పోలీస్‌ జాబ్‌ వస్తుంది. ట్రైనింగ్‌కు రమ్మని కాల్‌ లెటర్‌ వస్తుంది. అది తెలుసుకున్న అపర్ణ, సుభాష్‌, ఇందు హ్యాపీగా ఫీలవుతారు. పోలీస్‌ అవ్వాలని నువ్వు ఎన్ని కలలు కన్నావో ఇందు కూడా అన్ని కలలు కంది.. ఈరోజు ఆ కలలను నిజం చేశావు నందు అంటూ అందరూ కంగ్రాట్స్‌ చెప్తారు. కిచెన్‌లోకి వెళ్లి స్వీట్స్‌ తీసుకొచ్చి అందరికీ పంచుతుంది ఇందు. అప్పుడే బయటి నుంచి వచ్చిన రేఖ, భ్రమరాంబ, భూషణ్‌, శేషు వస్తారు. ఇందు పోలీస్‌ గా సెలెక్ట్‌ అయిందని తెలిసి షాక్‌ అవుతారు. భ్రమరాంబ భయంతో వణికిపోతుంది.

Advertisement

అపర్ణ ఎమోషనల్‌ అవుతూ.. నందును మెచ్చుకుంటూ.. ఎన్ని కష్టాలు వచ్చినా నిలదొక్కుకుని జీవితంల నిలబడింది అంటూ ఐశ్వర్యను తిడుతుంది. దీంతో ఇందు ఐశ్వర్యను తక్కువ చేసి మాట్లాడొద్దని అపర్ణకు చెప్తుంది. ఐషు డిగ్రీ పాస్‌ అయితే కచ్చితంగా కంపనీ పెట్టిస్తానని చెప్తుంది. ట్రైనింగ్‌ కు ఎప్పుడు వెళ్లాలని రాజు అడిగితే.. ఈరోజు సాయంత్రమే వెళ్లాలని.. ట్రైనింగ్‌ ఎక్కడని ఇందు అడిగితే.. వరంగల్‌ లో ఉందని చెప్పగానే.. ఇందు ఎమోషనల్ అవుతుంది. మళ్లీ మాకు దూరంగా వెళ్లిపోతావా..? అంటూ బాధపడుతుంటే.. నందు ఓదారుస్తుంది. ఇన్ని రోజులు నాకు దూరంగా ఉన్నావు ఈ కొన్ని రోజులు ఎలాగోలా ఉండాలని చెప్తుంది. మీరు ఇంత హ్యాపీగా ఉండటం నాకు నచ్చడం లేదు ఏదో ఒకటి చేయాలి అని మనసులో అనుకుంటుంది.

మరోవైపు ఇంటర్వ్యూలో సెలెక్ట్‌ కాలేదని వెంకీ బాధపడుతుంటే.. లక్ష్మీ వెళ్లి ఓదారుస్తుంది. అప్పుడే నందు వస్తుంది. ఎందుకొచ్చావని వెంకీ అడిగితే.. నందు షాక్‌ అవుతుంది. తాను పోలీస్‌ ట్రైనింగ్‌కు వెళ్తున్నానని చెప్తుంది. అప్పుడే కూరగాయలు తీసుకుని వచ్చిన చలపతి, నందును పలకరిస్తాడు.. ఎప్పుడొచ్చావమ్మ అని అడిగితే ఇప్పుడే వచ్చానని తాను పోలీస్‌ ట్రైనింగ్‌కు వెళ్తున్నానని వెంకీని చివరిసారి చూద్దామని వచ్చాను అని చెప్తుంది. ఆ మాటకు చలపతి షాక్ అవుతాడు. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

త్వరలో పెళ్లి చేసుకోబోతున్న జబర్దస్త్ కమెడియన్..!

Intinti Ramayanam Kamal : అయ్యో.. కమల్ అవుట్.. ఇదేం ట్విస్ట్ మామా..

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మీనా చెల్లి అవుట్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లిని ఇంట్లోంచి గేంటేసిన వేదవతి.. భాగ్యంకు నర్మదా స్ట్రాంగ్ వార్నింగ్.. పాపం శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవని పై భానుమతి సీరియస్.. అవనికి సీరియస్.. ప్రణతి కాపురంలో చిచ్చు..

Karthika Deepam 2 Serial Today Episode October 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ దెబ్బకు టిపిన్ బండి ఎత్తేసిన మాలిని           

Podarillu Today Episode : నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్.. మహా పై సీరియస్.. కన్నా కన్నీళ్లు..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ మాటతో ప్రభా షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రభా.. బాలు రచ్చ రచ్చ..

Big Stories

Advertisement
×