Nindu Noorella Saavasam Serial Today Episode: పార్థును చంపేస్తే తన సమస్యలన్నీ తీరిపోతాయని పార్థు కేసును మిస్సమ్మ మీదకు తోసేసి అమర్ దృష్టిలో మిస్సమ్మను నేరస్థురాలిని చేసి జైలుకు పంపించాలి. తర్వాత పిల్లలను హాస్టల్‌కు పంపించాలి. అమర్‌తో తాను హ్యాపీగా బతకొచ్చు అని ఆలోచిస్తుంది. అనుకున్నట్టుగానే.. రూంలోకి వెళ్లి కిరాయి రౌడీలకు ఫోన్ చేస్తుంది. ఒకరిని చంపాలని వాళ్లకు చెప్తుంది. ఎవరిని చంపినా మా పేమెంట్ మాకు కావాలి మేడం మర్డర్ చేశాకు పోలీసులకు దొరికిపోతే మేము జైలుకు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కువ మొత్తంలో ఇవ్వాలి అని చెప్తారు రౌడీలు.
మనోహరి మాత్రం మీరు చంపాల్సిందే పోలీసోడిని మీరెంత అడిగినా ఇస్తాను.. పది లక్షలా..? పదిహేను లక్షలా అని అడుగుతుంది. కాదు మేడం పాతిక లక్షలు అంటూ రౌడీలు చెప్పగానే.. మనోహరి అయితే ఓకే అంటుంది. ఎవరిని చంపాలి..? ఎక్కడ చంపాలి..? అడ్వాన్స్ పేమెంట్ ఎంత ఇస్తారు..? పేమెంట్ నగదు రూపంలోనే ఇవ్వాలి అని రౌడీలు అడిగితే.. అడ్వాన్స్ ఇవ్వను మొత్తం పని అవ్వగానే ఇస్తాను..అది కూడా నగదు రూంలో కాదు నగల రూపంలో ఇస్తాను.. ఆ బంగారం అమ్ముకుంటే మీకు పాతిక లక్షల కంటే ఎక్కువే వస్తుంది.
వాటిని అమ్ముకున్నాక మీరు అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోవాలి అని చెప్తుంది. సరే మేడం ఇంతకీ చంపాల్సిన వ్యక్తి ఎవరు..? ఎక్కడకు వెళ్లాలి అని రౌడీలు అడిగితే.. మీరు చంపాల్సిన వ్యక్తిని నేనే మీ ఒక చోటికి తీసుకొస్తాను.. మీరు వచ్చి మా పై అటాక్ చేయండి. ఇద్దరు ఆ వ్యక్తిని పట్టుకుని పొడిచి చంపేయండి. ఒకరు నా వెనకాల పడండి నన్ను కొంచెం గాయపరచి నా ఒంటిపై ఉన్న నగలు తీసుకుని వెళ్లిపోండి. ఆ వ్యక్త మెడలో చైన్, చేతికి ఉన్న రింగ్స్ తీసుకుని వెళ్లిపోండి అని మనోహరి చెప్పగానే.. రౌడీలు ఐడియా సూపర్ గా ఉంది మేడం.. లోకేషన్ పంపించండి మీరు బయలుదేరే ముందు కాల్ చేయండి అంటూ ఫోన్ కట్ చేస్తారు.
అంతా వెనక నుంచి గమనిస్తున్న చంభా భయంతో వణికిపోతుంది. ఈ నగలన్నీ నేను కొట్టేసి అమ్ముకుని కోల్‌కతా వెళ్లి హాయిగా బతుకుదామనుకుంటే.. మనోహరి ఇలా చేస్తుందేంటి అనుకుని.. వెంటనే మనోహరి మర్డర్ కోసం నగలన్నీ తాకట్టు పెడుతున్నావు కదా..? మరి నగలేవి అని అమర్ అడిగితే ఏం చెప్తావు అని అడుగుతుంది. వాటికి డూప్లికేట్ నగలు చేయించాను అని మనోహరి చెప్పగానే.. మరి అవి గిల్టీ నగలని భాగీ గుర్తు పడితే ఏం చేస్తావు అంటూ అనుమానం వ్యక్తం చేస్తే.. భాగీ అవే తనకు ఇచ్చిందని తనకేం తెలియదని మొత్తం భాగీ మీద నెట్టేస్తాను అంటూ చెప్పగానే. యాదమ్మ భయంతో వణికిపోతుంది. నువ్వు మామూలు దానివి కాదు మనోహరి అనగానే.. నా అవసరం కోసం నేను ఏం చేయడానికైనా సిద్దం.. ఎవరిని చంపడానికైనా సిద్దం అంటూ మనోహరి చెప్తూ కోపంగా చూస్తుంది.
మిస్సమ్మ, రాథోడ్ ప్లాన్ ప్రకారం రాథోడ్ కోయదొర వేషం వేసుకుని అమర్ ఇంటికి వస్తాడు. రాథోడ్‌ను చూసి మిస్సమ్మ నవ్వుకుని ఏమీ తెలియనట్టు ఎవరు నువ్వు.. కోయదొర ఏంటి..? ఇల్లు దోచుకోవడానికి ఇదో వేషమా..? అంటూ తిడుతుంది. అందుకు రాథోడ్ అలాంటిదేం లేదని.. ఉదయం నుంచి ఈ ఇంట్లో అశుభాలు జరిగాయి.. ఆ ప్రమాదం నుంచి మిమ్మల్ని రక్షించడానికే దేవుడు తనను పంపించాడని రాథోడ్ చెప్తాడు. మిస్సమ్మ మాత్రం రాథోడ్‌ను వెళ్లిపోమ్మని తిట్టినట్టు యాక్టింగ్ చేస్తుంది. అంతా విన్న పార్థు మాత్రం మీరు ఉండండి భాగీ గారు.. ఆయన చెప్పేది వింటుంటే నిజమే అనిపిస్తుంది ఇక్కనిమిషం ఆగండి మనోహరిని తీసుకొస్తాను అంటూ రూంలోకి వెళ్తాడు. మనోహరిని తీసుకొచ్చి కోయదొర ( రాథోడ్ ముందు) నిలబెడతాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.