Rana Naved-ul-Hasan apologize to Sachin Tendulkar: పాకిస్తాన్ వర్సెస్ ఇండియా (Pakistan vs. India) మధ్య మ్యాచ్ లు అంటే మూడో ప్రపంచ యుద్ధం జరిగినట్లుగానే భావిస్తారు. ఇక ఇరు జట్ల క్రికెటర్లు మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఢీ అంటే ఢీ అన్నట్లుగా వ్యవహరిస్తారు. అయితే అప్పట్లో పరిస్థితి ఇలాగ ఉండేది కాదు. సచిన్ టెండూల్కర్ లాంటి ఆటగాళ్లకు పాకిస్తాన్ క్రికెటర్లు కూడా గౌరవం ఇచ్చేవారు. అలాంటి సంఘటనే ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. సచిన్ టెండూల్కర్ ను డకౌట్ చేసిన తర్వాత ఓవర్ గా సెలబ్రేషన్ చేసుకున్నందుకు ఇంజమామ్ ఉల్ హక్ తనకు క్లాస్ పీకాడని… పాకిస్తాన్ ఒకప్పటి స్టార్ బౌలర్ రానా నవీద్ ఉల్ హసన్ ( Naved-ul-Hasan ) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ ఇంజమామ్ ఉల్ హక్ క్షమాపణలు చెప్పించాడని గుర్తు చేశారు.
2004 సమయంలో పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు చాలానే జరిగేవి. అయితే అప్పట్లో ఇండియాకు వచ్చిన పాకిస్తాన్… టీమిండియాతో వన్డే సిరీస్ ఆడింది. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ ను పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ రానా నవీద్ ఉల్ హసన్ డక్ అవుట్ చేశాడు. వికెట్ కీపర్ క్యాచ్ పట్టగానే సచిన్ పెవిలియన్ కు వెళ్ళాడు. ఆ సందర్భంగా సచిన్ టెండూల్కర్ ను ఉద్దేశించి… ర్యాగింగ్ చేస్తూ తాను సెలబ్రేషన్స్ చేసుకున్నానని రానా నవీద్ ఉల్ హసన్ వెల్లడించారు.
అయితే అప్పటి కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ దానిని చూసి వెంటనే తన క్లాస్ పీకాడని గుర్తు చేశారు. సచిన్ టెండూల్కర్ లాంటి గొప్ప క్రికెటర్లతో అలా బిహేవ్ చేయకూడదని గ్రౌండ్ లోనే ఇంజమామ్ ఉల్ హక్ ఫైర్ అయ్యారట. వెంటనే సచిన్ టెండూల్కర్ దగ్గరకు వెళ్లి క్షమాపణలు చెప్పుకో అంటూ ఆదేశాలు జారీ చేశారట. ఇక చేసేదేమీ లేక పెవిలియన్ కు వెళ్లే సచిన్ టెండూల్కర్ ను ఆపి సారీ చెప్పినట్లు రానా నవీద్ ఉల్ హసన్ తాజాగా వెల్లడించారు. ఈ సంఘటనకు సంబంధించిన విషయాలను తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని పంచుకున్నారు రానా నవీద్ ఉల్ హసన్.
ఎన్నో రికార్డులు సృష్టించిన సచిన్ టెండూల్కర్ అంటే ఇంజమామ్ ఉల్ హక్ కు చాలా గౌరవం అన్న సంగతి తెలిసిందే. సచిన్ టెండూల్కర్ అప్పట్లో బ్యాటింగ్ కు వస్తున్నాడు అంటే ఇంజమామ్ ఉల్ హక్ చాలా అలర్ట్ అయ్యేవాడు. అతడిని అవుట్ చేసే వరకు నిద్రపోయేవాడు కాదు. కదలలేని ఇంజమామ్ కూడా ఫీల్డింగ్ సరిగ్గా చేసి.. అతన్ని పంపే ప్రయత్నాలు చేశాడు. అదే సమయంలో సచిన్ అంటే తనకు ఎంతో గౌరవం అంటూ చాలా సందర్భాలలో ఇంజమామ్ ఉల్ హక్ ను కూడా వెల్లడించారు. సచిన్ ఔట్ అయినప్పుడు పాకిస్తాన్ క్రికెటర్లు సెలబ్రేషన్స్ చేసుకోకూడదని కూడా చాలా సార్లు ఆదేశాలు ఇచ్చారట.