E-Paper
Advertisement

CSK జట్టుకు మరో షాక్… SRHతో ధోని సీక్రెట్ మీటింగ్?

CSK జట్టుకు మరో షాక్… SRHతో ధోని సీక్రెట్ మీటింగ్?
Advertisement

Csk Dhoni Shares:  చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (Chennai Super Kings team)మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (Mahendra Singh Dhoni)… సన్ రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad) ఓనర్ కావ్య పాప ( kavya maran ) మధ్య రహస్యంగా చర్చలు జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ షేర్స్ విక్రయించబోమని యాజమాన్యం స్పష్టం చేసిన నేపథ్యంలో… ధోని ప్లాన్ మార్చినట్లు తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ కాకుండా మరో ఏ ఐపిఎల్ జట్టు షేర్స్ అయినా కొనుగోలు చేసేందుకు ఆయన సిద్ధమయ్యారట. ఈ వార్త తెలుసుకున్న కావ్య పాప… ధోనితో డీలింగ్ కు సిద్ధమైందట. సన్ రైజర్స్ జట్టుకు సంబంధించిన షేర్స్ విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని ధోనికి ఆఫర్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. దాదాపు 3 శాతం షేర్స్ ఇచ్చేందుకు ఆమె డిసైడ్ అయిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

సన్ రైజర్స్ షేర్స్ ఇచ్చేందుకు సిద్ధమైన కావ్య ?

సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య పాప కోట్లకు పడగలు ఎత్తిన సంగతి తెలిసిందే. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును కొనుగోలు చేసిన తర్వాత ఆమె స్టార్ తిరిగింది. ఇక్కడ ఛాంపియన్ గా జట్టును నిలప‌డమే కాకుండా… విదేశీ ఫ్రాంచైజీలలో కూడా సొంతంగా జట్లను కావ్య కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా మూడు ప్రధాన క్రికెట్ జట్లను ఆమె కలిగి ఉన్నారు. దక్షిణాఫ్రికా ఇటు ఇంగ్లాండ్ దేశాల్లో జరుగుతున్న ప్రధాన ఫ్రాంచైజీ లీగ్స్ లలో జట్ల‌ను ఆమె కలిగి ఉండటం గమనార్హం.

Advertisement

దక్షిణాఫ్రికాలో ఎస్ఏ 20 లీగ్ జరుగుతుండగా.. అందులో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ పేరుతో కొనసాగిస్తున్నారు. ది 100 లీగ్ టోర్నమెంట్ లో సన్ రైజర్స్ లీడ్స్ పేరుతో మరో జట్టును కావ్య నడిపిస్తున్నారు. ఇక్కడ ఐపిఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఒక జట్టు నడుస్తోంది. అయితే ఇందులో ధోనికి నచ్చిన జట్టు షేర్స్ విక్రయించేందుకు కావ్య సిద్దంగా ఉన్నట్లు ఆఫర్ ప్రకటించారట. ఇందులో భాగంగానే మహేంద్రసింగ్ ధోనితో రహస్యంగా చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ధోనికి షేర్స్ విక్ర‌యిస్తే, స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు బ్రాండ్ వ్యాల్యూ పెరుగుతుంద‌ని ఆమె బిజినెస్ ప‌రంగా లోతుగా ఆలోచ‌న చేస్తున్నార‌ని స‌మాచారం. అందుకే ధోని కోసం త్యాగానికి సిద్ధం అయ్యార‌ని అంటున్నారు.

ధోనిని అవమానించిన చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించిన షేర్స్ కొనుగోలు చేసేందుకు మహేంద్రసింగ్ ధోని సిద్ధమయ్యాడని గత మూడు రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ జట్టుకు సంబంధించిన 25% వాటాను కొనుగోలు చేసేందుకు ధోని సిద్ధంగా ఉన్నట్లు యాజమాన్యానికి సమాచారం ఇచ్చారట. అయితే కేవలం 5.5% మాత్రమే ధోనికి షేర్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కుండబద్దలు కొట్టి చెప్పినట్లు వార్తలు బయటకు వచ్చాయి. చివరికి 18 శాతం అయినా విక్రయించాలని ధోని కోరాడట. అయినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ ఒప్పుకోలేదు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ధోని తెగ దెంపులు చేసుకున్నాడని అంటున్నారు.

Related News

స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

వ్యాపారంలో దూసుకువెళుతోన్న అంబానీ, ముంబైని డీల్ చేయ‌లేక‌పోతున్నాడు!

స‌చిన్ నుంచి బ‌ల‌వంతంగా కెప్టెన్సీ లాగేసుకున్నా..గంగూలీ సంచ‌ల‌నం !

ఆ న‌లుగురే ప్ర‌మాదం…2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడే టీమిండియాను ప్ర‌క‌టించిన అక్త‌ర్‌

రోహిత్ శ‌ర్మ‌, హార్ధిక్ పాండ్యా మ‌ధ్య విభేదాలు… అందుకే ముంబై ఇండియ‌న్స్ సంక‌నాకిపోతోంది !

తెగించిన‌ తెంబా బ‌వుమా…టాయిలెట్ కుండి ప‌గ‌ల‌గొట్టి మ‌రీ

కొంచెం ఉప్పు త‌క్కువైనా ధోని క్లాస్ పీకుతాడు..కానీ !

బుమ్రా మాకు రంకు మొగుడిలా త‌యార‌య్యాడు…అందుకే పాకిస్తాన్ గెల‌వ‌డం లేదు

Big Stories

Advertisement
×