E-Paper
Advertisement

మొగలిరేకులు శిరీషకు ఇంత కష్టం వచ్చిందా? కన్నీళ్లు తెప్పించే కథ!

మొగలిరేకులు శిరీషకు ఇంత కష్టం వచ్చిందా? కన్నీళ్లు తెప్పించే కథ!
Advertisement

Mogalirekulu Shireesha:శిరీష ..బుల్లితెర ఆడియన్స్ కి పెద్దగా పరిచయం అక్కరలేని పేరిది.ముఖ్యంగా మొగలి రేకులు, రాములమ్మ, నాతి చరామి అనే సీరియల్స్ లో ఈమె చేసిన ఫెర్ఫామెన్స్ కి ఫిదా అయిపోయారు ఆడియన్స్.ఇక తాజాగా రెండో పెళ్లి చేసుకున్న ఈ భామ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన సంఘటనలని చెప్పుకొచ్చింది.

కుటుంబం ఎన్నో అష్ట కష్టాలు

శిరీష మాట్లాడుతూ తన చిన్నతనంలో తన కుటుంబం ఎన్నో అష్ట కష్టాలు పడిందని చెప్పుకొచ్చింది. ఇంట్లో బియ్యం కూడాఉండేవి కాదని,ఆసమయంలో పక్కింటి వారిని అడిగి తెచ్చుకున్న నూకల అన్నం తిని కడుపు నింపుకున్నామని బాధపడిపోయింది.

Advertisement

ఇక రోడ్డుపై వర్షంలో తడుస్తూ మిర్చి బజ్జీల బండి వద్ద నిలబడిన రోజులు ఉన్నాయని, అమ్మ బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషించేదని, ఇంట్లో ముగ్గురు అమ్మాయిలమే అయినప్పటికీ రూపాయి కావాలన్నా ఎవరినీ అడగకుండా తన సొంత కష్టంతోనే కుటుంబ బాధ్యతలన్నీ భుజాన వేసుకుని నిలబెట్టానని తను పడ్డ కష్టాలని ఏకరువు పెట్టింది.

15కి పైగా సూపర్ హిట్ సీరియల్స్‌

ఇక తానూ దాదాపు 15కి పైగా సూపర్ హిట్ సీరియల్స్‌లో నటించినప్పటికీ తనకి ‘మొగలిరేకులు’ సీరియలే మంచి గుర్తింపు తెచ్చిందని తెలిపింది.ఆ తర్వాత రాములమ్మ, నాతిచరామి వంటి ప్రాజెక్ట్‌లు తనకు నటిగా మంచి పేరు తెచ్చిపెట్టాయని తెలిపింది.

Advertisement

ఇక సీనియర్ నటి భానుప్రియతో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకుంటూ ఆమె ఎంతో గొప్ప నటి అని ,అంతకు మించిన హ్యూమన్ బీయింగ్ అని వారి పట్ల తన ప్రేమని బయటపెట్టింది.అయితే ఇన్ని హిట్స్ ఇచ్చినప్పటికీ, ఇండస్ట్రీలో ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కంటే కేవలం లుక్స్, కాస్ట్యూమ్స్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారని వాపోయింది శిరీష.

సొంత తెలుగు నటులను పక్కన 

ఇకప్రస్తుతం తెలుగు టీవీ ఇండస్ట్రీలో లోకల్ ఆర్టిస్టులకు దక్కుతున్న ప్రాధాన్యతపై కూడా శిరీష సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు లేదా చెన్నై నుంచి వచ్చే ఇతర భాషల నటీనటులకు ఇక్కడ ప్రాధాన్యత ఇస్తూ, సొంత తెలుగు నటులను పక్కన పెట్టేస్తున్నారని ఆరోపించింది.

బయటి ప్రాంతాల వారిని తక్కువ రెమ్యునరేషన్‌కు తెచ్చుకుంటూ, మన వాళ్లకు అవకాశాలు ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేసింది. కన్నడ, తమిళ ఇండస్ట్రీలు తమ సొంత భాషా నటులను ఎంతగానో ప్రోత్సహిస్తాయని, కానీ మన దగ్గర మాత్రం ఆ పరిస్థితి లేదని తెలిపింది.

రూమర్లన్నీ కేవలం కల్పితాలే 

ఇక తనపై ఇండస్ట్రీలో జరుగుతున్న దుష్ప్రచారంపై శిరీష గట్టిగానే కౌంటర్ ఇచ్చింది శిరీష. శిరీష సెట్‌కి టైమ్‌కి రాదని, ఎన్నో నైఖ్రీలు చూపిస్తుందని, ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని వ్యాపించిన రూమర్లన్నీ కేవలం కల్పితాలని కొట్టిపారేసింది.

also read :గుప్పెడంత మనసు జగతి మేడం.. ఇప్పుడు ఫుల్ గ్లామర్ షో!

రాత్రి 3 గంటల వరకు కంటిన్యూస్‌గా వర్క్ చేసిన రోజులు ఉన్నాయని, సీరియల్ మేకర్స్ చెప్పిన బడ్జెట్‌కే తాను పనిచేశానని తెలిపారు. తన భర్త లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఇండస్ట్రీ పరిస్థితులను బాగా అర్థం చేసుకుని తనకు అండగా నిలిచారని, లేకపోతే ఈ రూమర్ల వల్ల తన పర్సనల్ లైఫ్ కూడా దెబ్బతినేదని స్పష్టం చేసింది.

ఏదైనా సొంత బిజినెస్

గత 3 ఏళ్లుగా నటనకు దూరంగా ఉన్న తాను ప్రస్తుతం మంచి క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలిపింది. ఒకవేళ ఇండస్ట్రీ నుంచి ఆశించిన అవకాశాలు రాకపోతే, ఇక వెయిట్ చేసి సమయం వృధా చేసుకోవడం కంటే ఏదైనా సొంత బిజినెస్ స్టార్ట్ చేసి గౌరవంగా బతకడమే మేలనే ఆలోచనలో ఉన్నట్లు తన ఫ్యూచర్ ప్లాన్ ని బయటపెట్టింది శిరీష.

చూడాలి మరి మళ్ళీ గతంలోలా మళ్ళీ సీరియల్స్ లో తన సత్తా చూపిస్తుందా లేదా అన్నట్టుగా బిజినెస్ లో రానిస్తుందా !

Tags

Related News

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు ఘోర అవమానం.. పోలీస్ స్టేషన్లో రామరాజు.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Big Stories

Advertisement
×