E-Paper
Advertisement

బుల్లితెర నటుడికి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన శ్రీముఖి!

బుల్లితెర నటుడికి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన శ్రీముఖి!
Advertisement

Sree Mukhi: ప్రముఖ యాంకర్ శ్రీముఖి (Sree Mukhi) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అద్భుతమైన వాక్చాతుర్యంతో అందరి దృష్టిని ఆకట్టుకుంటూ దూసుకుపోతున్న ఈమె.. ఒకవైపు ఆదివారం విత్ స్టార్ మా పరివారం, మరొకవైపు అగ్నిపరీక్ష సీజన్ 2లకు హోస్టుగా వ్యవహరిస్తోంది. అప్పుడప్పుడు సినిమాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. తాజాగా ఒక బుల్లితెర నటుడికి ఊహించని గిఫ్ట్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇది చూసిన నెటిజన్స్ నిజంగానే వీరు ప్రేమలో పడ్డారా? అనే కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

బుల్లితెర నటుడికి శ్రీముఖి ఊహించని గిఫ్ట్..

ఆ బుల్లితెర నటుడు ఎవరో కాదు ‘గుండె నిండా గుడి గంటలు’ సీరియల్ లో బాలు పాత్రలో నటిస్తున్న విష్ణు కాంత్(Vishnu Kanth) . ముఖ్యంగా బాలు పాత్రకు యువత, మహిళలలో మంచి ఫాలోయింగ్ ఉంది. అటు శ్రీముఖి – బాలు మధ్య సరదా బాండింగ్ ఇప్పుడు బుల్లితెరపై హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో బాలు అప్పుడప్పుడు వచ్చి సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య స్పెషల్ ట్రాక్ కూడా వేస్తున్నారు.

నా స్పెషల్ బాలు కోసం ఊహించని సర్ప్రైజ్ – శ్రీ ముఖి

Advertisement

ఇలాంటి సమయంలో శ్రీముఖి బాలుకి ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ అందరినీ ఆశ్చర్యపరస్తోంది.. ఆదివారం విత్ స్టార్ మా పరివారం లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన తాజా ప్రోమోలో శ్రీముఖి బాలుకి ఇచ్చిన గిఫ్ట్ మరింత ప్రత్యేకంగా కనిపించింది. దీంతో వీరిద్దరి మధ్య బాండింగ్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రోమోలో శ్రీముఖి స్టేజ్ పైకి వస్తూ.. బాలును ప్రత్యేకంగా పిలిచింది. అందరికీ కవర్ ఓపెన్ చేయకుండా గిఫ్టులు ఇచ్చాను. కానీ నా స్పెషల్ బాలు కోసం మాత్రం దగ్గరుండి నేనే ప్యాకింగ్ చేశాను అంటూ చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.

also read:‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. గుండె కుడివైపు ఉంటే.. రహస్యం ఎటువైపు దారితీసింది?

గిఫ్ట్ చూసి షాక్..

Advertisement

బాలు, శ్రీముఖి ఇద్దరు కలిసి ఆ గిఫ్ట్ ను ఓపెన్ చేశారు.అది ఒక ఫోటో ఫ్రేమ్. ఆ ఫోటోని చూసిన బాలు ఒక్కసారిగా షాక్ అయ్యారు . సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యంగా ఆ ఫ్రేమ్ వైపు చూసారు. . ఆ ఫోటోలో శ్రీముఖి గొడుగు పట్టుకుని నిలబడి ఉండగా.. ఆమె కోసం బాలు వర్షంలో పరిగెత్తుకుంటూ వస్తున్నట్లు కనిపించింది. దీంతో ఈ ఫోటోను ఎందుకు తయారు చేయించారు అనే ఆసక్తి ఇప్పుడు అందరిలో మొదలయ్యింది. పైగా త్వరలో తాను బాలు కలసి ఒక కొత్త ప్రాజెక్టు చేయబోతున్నామని అనౌన్స్ చేసింది. అయితే ఆ ప్రాజెక్ట్ ఏంటి ? అనేది మాత్రం ఆమె వెల్లడించలేదు. ఇక మొత్తానికైతే ఇది టీవీ షో? స్పెషల్ ప్రోగ్రామ్ ? లేక వెబ్ ప్రాజెక్ట్ ? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

పెళ్లి ప్రపోజల్ పెట్టిన శ్రీముఖి..

ఇదిలా ఉండగా గతంలో శ్రీముఖి బాలుకి సరదాగా పెళ్లి ప్రపోజల్ పెట్టిన విషయం తెలిసిందే.. అటు బాలు కూడా తాను నేసిన చీరను శ్రీముఖికి ఒక ఈవెంట్లో గిఫ్ట్ గా కూడా ఇచ్చారు. ఇప్పుడు శ్రీముఖి ఇలాంటి ఫోటో గిఫ్ట్ గా ఇచ్చింది. ఇక ఏం జరుగుతోందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

?utm_source=ig_web_copy_link

Related News

జూనియర్ బాలు అనుకుంటే ఇలా దొరికిపోయాడేంటి.. సరిగమపలో దైవిక్‌కు షాక్!

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Big Stories

Advertisement
×