E-Paper
Advertisement

వైజాగ్‌లో ‘జబర్దస్త్’ నటి బర్త్ డే.. కత్తులతో పొడుచుకున్న ఆ పార్టీ నేతలు?

వైజాగ్‌లో ‘జబర్దస్త్’ నటి బర్త్ డే.. కత్తులతో పొడుచుకున్న ఆ పార్టీ నేతలు?
Advertisement

Jabardasth Actress Anu Birthday Party:బర్త్‌డే పార్టీలంటేనే ఎంత సందడిగా సాగుతాయో చెప్పక్కర్లేదు.కేకు,సౌండ్, డెకరేషన్, సాంగ్స్,డాన్స్ అంటూ పార్టీకి వచ్చిన వాళ్ళంతా తెగ హడావిడి చేస్తుంటారు.కానీ విశాఖపట్నం జిల్లాలో జబర్దస్త్ ఫేమ్ నటి అను బర్త్ డే పార్టీ రణరంగంగా మారిపోయింది.

విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం శొంఠ్యాం సమీపంలోని హ్యాపీ నేచర్ రిసార్ట్స్‌లో జరిగిన ఈ వేడుకల్లో రెండు వర్గాల మధ్య గొడవ జరిగిందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఒక దశలో రెండు వర్గాల మధ్య మొదలైన ఈ వివాదం కత్తులతో దాడి చేసుకునే స్థాయికి వెళ్లినట్టు తెలుస్తుంది.

సుమారు 70 మంది వరకు

Advertisement

అందుతున్న సమాచారం ప్రకారం.. మంగళవారం రాత్రి ప్రారంభమైన ఈ బర్త్‌డే వేడుకలకు సుమారు 70 మంది వరకు హాజరైనట్లు తెలుస్తోంది. పార్టీ మొదట్లో అంతా సరదాగానే సాగినప్పటికీ, బుధవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయినట్లు సమాచారం. పార్టీలో ఉన్న కొందరి మధ్య మొదలైన చిన్న వివాదం క్రమంగా మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసినట్లు తెలుస్తోంది.

గొడవల్లో పొలిటీషియన్స్ 

ఈ గొడవలో టీడీపీ నేత మమ్ముల వెంకట్ దినేష్‌పై యర్రా చరణ్‌తేజ్ కత్తితో దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలో వెంకట్ దినేష్ ఎడమ భుజం వెనుక భాగంలో తీవ్ర గాయం అయినట్లు సమాచారం. వెంటనే అక్కడున్నవారు స్పందించి ఆయనను చికిత్స కోసం విశాఖలోని విమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

Advertisement

ఇక ఈ ఘటనలో రాజకీయ కోణం కూడా చర్చకు వస్తోంది. పార్టీలో టీడీపీ, టీడీపీ అనుబంధ విద్యార్థి విభాగం TNSFకు చెందిన వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. వీరి మధ్యే వివాదం ముదిరిందా? లేక వ్యక్తిగత కారణాలతో గొడవ మొదలైందా? అనేది ప్రస్తుతం స్పష్టంగా తెలియాల్సి ఉంది. అసలు గొడవకు కారణం ఏంటి అన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వివరాలు సేకరిస్తున్నపోలీసులు

ఘటనపై సమాచారం అందుకున్న ఆనందపురం పోలీసులు వెంటనే హ్యాపీ నేచర్ రిసార్ట్స్‌కు చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని పరిశీలించడంతో పాటు పార్టీలో పాల్గొన్న వ్యక్తుల గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సమాచారం. దాడికి ఉపయోగించిన ఆయుధం, దాడిలో పాల్గొన్న వ్యక్తులు, గొడవ ఎలా మొదలైంది అనే అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

also read :200 కోట్ల టార్గెట్.. ఇరుముడి రీచ్ అవుతుందా?

మరోవైపు ఈ బర్త్‌డే వేడుకను కొందరు రేవ్ పార్టీగా పేర్కొంటుండటం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో అసలు అక్కడ ఏం జరిగింది? పార్టీకి అనుమతులు ఉన్నాయా? ఎంతమంది పాల్గొన్నారు? మద్యం వినియోగం ఎంతవరకు జరిగింది? డ్రగ్స్ వినియోగం జరిగిందా? అనే కోణాల్లోనూ పోలీసులు దృష్టి పెట్టినట్లు సమాచారం. .

 వివాదాలుగా మారడం కొత్తేమీ కాదు

నిజానికి ఇలాంటి పార్టీల్లో చిన్న గొడవలు పెద్ద వివాదాలుగా మారడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా అర్ధరాత్రి తర్వాత మందు తాగిన సమయంలో మాటామాటా పెరగడం, వ్యక్తిగత గొడవలు గ్రూపుల మధ్య వివాదాలుగా మారడం వంటి ఘటనలు గతంలోనూ మనం చూశాం.
మరి జరిగిన ఈ ఘటనలో కూడా అసలు గొడవ ఎక్కడ మొదలైంది? దాని వెనుక వ్యక్తిగత కారణాలున్నాయా? రాజకీయ విభేదాలున్నాయా? అన్నది పోలీసుల విచారణ పూర్తయితేనే క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

also read :‘టాక్సిక్’ దెబ్బ..KVNకు బ్యాడ్ టైమ్ మొదలైందా?

ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్

మొత్తానికి నటి అను బర్త్‌డే వేడుకగా మొదలైన ఈ పార్టీ.. చివరకు దాడులు చేసుకుని ఆస్పత్రి చికిత్స వరకు వెళ్లడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు సంబంధించిన వ్యక్తులు ఇందులో ఉండటంతో ఈ వివాదం మరింత వైరల్ అవుతుంది.

ఏది ఏమైనా జబర్దస్త్ ఫేమ్ నటి అను బర్త్ డే పార్టీ సందర్భంగా ఈ గొడవ జరగడంతో ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఈ న్యూస్ హాట్ టాపిక్ మారింది.

Tags

Related News

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు ఘోర అవమానం.. పోలీస్ స్టేషన్లో రామరాజు.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Big Stories

Advertisement
×