Nindu Noorella Saavasam Serial Today Episode : భోజనం చేసిన తర్వాత కాళీ తాను పెళ్లి చేసుకోబోతున్నానని కొత్త జీవితం మొదలు పెడతానని.. నా పెళ్లికి మీరందరూ రావాలని చెప్తాడు. అలాగే సరస్వతి మేడంను కలిసి సారీ చెప్పాలని ఉంది. ఆవిడ ఎక్కడ ఉన్నారని అడుగుతాడు. ఆవిడ హాస్పిటల్‌లో ఉందని వెళ్లి కలవమని చెప్తాడు అమర్. ఇంతలో మిస్సమ్మ.. మనోహరి గారు మీకు అక్కు అన్నం పెట్టిన దేవత సరస్వతి గారు హాస్పిటల్‌లో ఉంటే ఒక్కసారైన వెళ్లి చూసి రావాలని అనిపించలేదా మీకు అని అడుగుతుంది. దీంతో మనోహరి ఇరిటేటింగ్‌గా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు ఇప్పుడే ఏం చెప్పాలి అని మనసులో అనుకుని ఎందుకు కలిసి రాలేదు. వీలు కుదిరినప్పుడల్లా వెళ్లి కలిసి చూసి వస్తున్నాను. అయినా నువ్వేంటి అంతా చూసిన దానిలా మాట్లాడుతున్నావు అంటుంది.
దీంతో మిస్సమ్మ అది కాదు మనోహరి గారు. మీరు వార్డెన్ గారిని కలిసి ఉంటే ఆరు అక్క జీవితానికి ఒక దారి చూపించినట్టు.. మీకు మంచి దారి చూపించేది కదా..? అర్థం కాలేదా…? నీ పెళ్లి గురించి అని చెప్పగానే.. కాళీ సిగ్గు పడుతుంటాడు. ఇంతలో మనోహరి కోపంగా ఏయ్ ఇప్పుడు నా పెళ్లి టాపిక్ ఎందుకు నేను నిన్ను అడిగానా..? నాకు పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పు అంటుంది. ఇంతలో శివరాం.. అదేంటమ్మా పెళ్లి చేసుకోకుండా ఎంతకాలం ఈ ఇంట్లో ఉంటావు.. నీకు ఓ జీవితం కావాలి కదా అంటాడు. నిర్మల కూడా అవునమ్మా మనోహరి ఆరు నీకు ఎంత ఫ్రెండ్ అయినా ఎంతకాలం అని నువ్వు ఒంటరిగా ఈ ఇంట్లో ఉంటావు.
నీకు కూడా ఒక తోడు కావాలి కదా అంటుంది. మనోహరి అది కాదు ఆంటీ అనగానే అమర్ కూడా మనోహరి అమ్మవాళ్లు చెప్పింది నిజమే. నీ పెళ్లి గురించి నీ భవిష్యత్తు గురించి నేను కూడా ఆలోచించడం మానేశాను. మిస్సమ్మ నువ్వు నా కర్తవ్యాన్ని గుర్తు చేశావు థాంక్యూ.. ఏవండి మనోహరి గారికి ఒక కుటుంబాన్ని ఇవ్వడం మన బాధ్యత కదండి. తనకు ఓ మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేద్దాం అనగాగే మనోహరి ..అమర్ నాకు మీరందరూ ఉన్నారు నాకు ఇక పెళ్లి ఎందుకు ఏమీ వద్దు అంటుంది. అందరూ మాట్లాడుకుంటుంటే కాళీ మాత్రం సిగ్గు పడుతుంటాడు.
అనామిక హైదరాబాద్‌లోని తన అన్నయ్య ఇంటికి వస్తుంది. వాళ్ల వదిన అనామికతో ప్రేమగా మాట్లాడుతూ వాళ్ల అన్నతో మాత్రం దాన్ని ఇప్పుడే పంపించేయ్ అని చెప్తుంది. బయటకు వచ్చిన అన్న ఎలా ఉన్నావు అని అడుగుతాడు. బాగానే ఉన్నానని చెప్తుంది. దీంతో వాళ్ల వదిన ఉండటానికా.. ఉండిపోవడానికా..? అని అడుగుతుంది. రెండు రోజులు ఉండి జాబ్ చూసుకుని వెళ్లిపోతాను అని చెప్తుంది.
కాళీ ఇంటికి వెళ్తుంటే.. కారులో అడ్డం వెళ్తుంది మనోహరి.. కాళీ ఎవర్రా నువ్వు అంటూ కొట్టబోయి మనోహరిని చూసి అరే మన లేడీసూ.. అంటాడు. మనోహరి కారు దిగి వచ్చి రేయ్ నువ్వు రణవీర్‌ను చంపేస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదా..? మళ్లీ ఇంటికి వచ్చి బెదిరించడం ఏంట్రా.. ఓవర్ చేస్తే తాట తీస్తా.. అంటుంది. నేనేం నీ కోసం రాలే నేను మా భాగీ కోసం వచ్చిన అంటాడు కాళీ. మరి నా పెళ్లి గురించి ఎందుకు అడిగావు.. నీ పెళ్లి గురించి ఎందుకు చెప్పావు తగ్గాను కదా అని నన్ను బెదిరించాలనుకుంటున్నావా..? అంటుంది.
నేను బెదిరించలేదు. నువ్వు బెదురుకోలేదు. ఎప్పటికైనా మన పెళ్లి గురించి తెలియాలి కదా అని తమాషా చేసిన అంటాడు. దీంతో మనోహరి.. రణవీర్ చంపాక మన పెళ్లి గురించి మాట్లాడమని చెప్పాను కదా అంటుంది. దీంతో కాళీ నీ మాజీ మొగుడి చావుకు ఇవాళ ముహూర్తం పెట్టిన కదా..? అంటాడు. మనోహరి ఏంటి నిజమా అని అడుగుతుంది. కాళీ అవును ఇప్పుడు వాడి దగ్గరకే వెళ్తున్నా.. నీ ఫోన్ ఆన్‌లో పెట్టుకో.. నేను ఫోన్ చేస్తాను అని చెప్తాడు.
మిస్సమ్మ ఇంట్లో చేస్తున్న పనులు అన్ని గుర్తు చేసుకుంటాడు అమర్. ఇంతలో మిస్సమ్మ రాగానే నేను మాట్లాడాలి అంటాడు. దీంతో మిస్సమ్మ మాట్లాడుకోండి దానికి నా పర్మిషన్ ఎందుకు అంటుంది. దీంతో అమర్ కోపంగా ఏయ్ లూజ్ నేను సీరియస్‌గా మాట్లాడాలి అంటాడు. దీంతో మిస్సమ్మ సీరియస్‌గానే మాట్లాడుకోండి దానికి కూడా నా పర్మిషన్ ఎందుకు..? అంటుంది. అమర్ లేచి వెళ్లిపోతుంటే.. కూర్చోబెట్టి అబ్బా మీరు కోపంలో ఉన్నప్పుడు కూడా చాలా ముద్దుగా ఉంటారు.. అంటూ చెప్పండి ఏంటో.. అని అడుగుతుంది.
దీంతో అమర్.. నువ్వు నిద్ర లేచినప్పటి నుంచి కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్టు తిరుగుతూనే ఉంటావు అందుకే పిల్లలకు ఒక కేర్ టేకర్‌ను అపాయింట్ చేద్దామనుకుంటున్నాను అని అమర్ చెప్పగానే.. మిస్సమ్మ షాకింగ్ గా అదేంటి పక్కింటి అక్కా మీరు ఒకే రోజు ఒకేలాగా ఆలోచిస్తున్నారేంటి..? అక్క కూడా కేర్ టేకర్‌ను పెట్టుకో అని చెప్పింది అంటుంది. ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని పెట్టుకుందామని చెప్తాడు అమర్. సరే అంటుంది మిస్సమ్మ. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?