Fire Accident : రాష్ట్రంలో వరుస అగ్ని ప్రమాదాలు నగరవాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఎప్పుడు ఎటువైపు నుంచి అగ్నిప్రమాదం జరుగుతుందో అని ఆదోళన చెందుతున్నారు. తాజాగా హైదరాబాద్ పాతబస్తిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కిషన్ బాగ్ ఎక్స్ రోడ్డు సమీపంలో ఓ బిల్డింగులో సెల్లార్ లోని ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే కాసేపటికే మంటలు పైకి పాకాయి.
అగ్ని ప్రమాదము వల్ల భవనంపై అంతస్తుల్లో దట్టమైన పొగ వ్యాపించాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో బిల్డింగ్‌లోని ఉన్నవారిని పోలీసులు కిందకి దించారు. ఇక అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
కాగా పాతబస్తీలో తరుచూ అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజుల క్రితం మాదన్నపేట చౌరస్తాలో ఓ తుక్కు గోదాంలో మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేయడానికి.. అగ్నిమాపక సిబ్బంది దాదాపు ఆరుగంటల పాటు శ్రమించారు. ఇక రానున్నది వేసవికాలం కావడంతో అగ్నిప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి.. అందరూ జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. శనివారం నాడు హైదరాబాద్‌లో మరోసారి కాల్పుల కలకలం రేపాయి. గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌లో ఓ దొంగ పోలీసులపై కాల్పులు జరిపాడు ఓ దొంగ. పబ్‌లో దొంగ ఉన్నాడన్న సమాచారంతో పోలీసులు అక్కడి వెళ్లారు. పోలీసులను చూసి అక్కడి నుంచి తప్పించుకునేందుకు వారిపై కాల్పులు జరిపాడా దొంగ. ఈ కాల్పుల్లో సీసీఎస్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి, పబ్ బౌన్సర్ గాయపడ్డారు. గాయపడ్డ వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీసులు దొంగను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో పోలీసులు షాకింగ్ విషయాలు తెలిశారు. అయితే ఆ దొంగ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ అని పోలీసులు గుర్తించారు. ప్రభాకర్ పై చాలా కేసులు ఉన్నట్టు తేలింది.
Also Read: ఆ రైతుకి అదే చివరి ప్రయాణం.. ఆర్టీసీ బస్సులో కుప్పకూలి మరణించిన వైనం..
ప్రభాకర్ సొంత ఊరు చిత్తూరు జిల్లా వడ్డిపల్లి గ్రామం. చిత్తూరుతో పాటు విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. అతని వయసు కేవలం 26 సంవత్సరాలే అయినా.. వందకు పైగా కేసులున్నాయి. తెలుగు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు ప్రభాకర్. గతంలో 2020లో విశాఖ పోలీసులకు చిక్కడంతో కోర్టు అతనికి శిక్ష విధించింది. 2022 జూన్ 8 నుంచి జైలు శిక్ష కూడా అనుభవిస్తున్నాడు. అయితే ఈ మధ్య మళ్లీ పోలీసులకు తలనొప్పిగా మారాడు. ఎందుకంటే అనకాపల్లి కోర్టుకు వాయిదా కోసం వెళ్లి తిరిగి వస్తుండగా ఎస్కార్ట్ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు.
ప్రభాకర్ ప్రిజం పబ్‌లో ఉన్నట్టు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు పబ్‌లో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలోనే ప్రభాకర్.. కాల్పులు జరిపాడు. కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డి కాలికి గాయమైంది. బుల్లెట్ అతని తొడ నుంచి దూసుకుపోయింది. పబ్‌లో ఉన్న బౌన్సర్ కూడా గాయపడ్డాడు. ప్రస్తుతం ప్రభాకర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. బత్తుల ప్రభాకర్‌ను అరెస్టు చేసి అతని దగ్గర 2 గన్‌లను, 23 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ పాతబస్తిలో అగ్నిప్రమాదం
కిషన్ బాగ్ ఎక్స్ రోడ్డు సమీపంలోని ఓ భవనంలో చెలరేగిన మంటలు
ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పిన అగ్ని మాపక సిబ్బంది
భవనంలో చిక్కుకున్న వారిని రక్షించిన రెస్క్యూ టీమ్స్
సహాయక చర్యల్లో పాల్గొన్న కిషన్ బాగ్ కార్పొరేటర్, కాలాపత్తర్ సీఐ pic.twitter.com/l9CydU4T4D
— BIG TV Breaking News (@bigtvtelugu) February 2, 2025